డైలీ సీరియల్

నాశనానికి తోవ అహంకారమే( యయాతి - 1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహంకారం నాశనానికి దారితీస్తుంది. పొగరు పతనానికి దారి తీస్తుంది. ఇలా ఎన్ని చెప్పినా కొందరు అహంకారానికి లొంగి పోతారు. ఒక్కొక్కరు మనం అహంకరించి తప్పు చేశాము. ఇక అహంకారం జోలికి పోకూడదు అనుకొని పశ్చా త్తాపంతో తమ నడవడిని మార్చుకొని సన్మార్గంలో నడిచేవాళ్లు ఉంటారు. శరీరం నశించి పోయేదని తెలిసినా దీనిపై వ్యామోహం వదలడం అంత సులభంగాదు అని చాలామంది చెబుతూ ఉంటారు. కొంతమంది మాత్రమే శరీరంపై వ్యామోహాన్ని చాలా చిన్నవయస్సులోసులభంగా దూరం చేసుకొంటారు. దీనివల్ల వారు యశోకీర్తిని పొందుతారని చరిత్ర చెబుతుంది. చాలా చిన్న వయస్సులోనే దీక్ష బూని వాసుదేవుని దర్శనం చేసుకొన్న ధ్రువుడు ఇహలోకంలో పరలోకంలోను కీర్తిసంపదను పొందుతున్నాడు.
అట్లానే పూరువు అనే యయాతి కుమారుడు భోగేచ్ఛ తొలగించుకోలేని తన తండ్రికి తన దేహాన్ని చాలా సులభంగా ఇచ్చి తాను వృద్ధాప్యాన్ని గ్రహించాడు. దాని వల్ల వంశోద్దారకుడు గా కీర్తి పొందాడు. యయాతి మహారాజు క్షత్రియుడు. ఓసారి వేటకు వెళ్లి అలా వనాల వెంట తిరుగుతున్నప్పుడు ఓ సంఘటన జరిగింది.
నూతిలోనుంచి స్ర్తి ఆర్తనాదం వినిపించింది. ఎవరో స్ర్తి ఆపదలో ఉన్నట్టు ఉంది అని యయాతి మహారాజు ముందుకు అడుగులు వేస్తూ జాగ్రత్తగా శబ్దం వినివచ్చినవేపు నడిచాడు.
***
జనసందడి.. కోలోహలం.. బావిలో పడి ఉన్న శుక్రాచార్యుని కూతురు దేవయానికి వినవచ్చింది. తనను ఈ బావి నుంచి పైకి తీసే వారు ఎవరైనా వస్తారా అని ఎదురుచూస్తున్న దేవయాని వినిపించే జనసందడి యయాతి మహారాజు పరివారంది అని గ్రహించింది. వెంటనే పెద్దగా ఆర్తనాదం చేసింది. తాను బావిలో పడిపోయానని తనను రక్షించి పుణ్యం కట్టుకోమని దీనంగా అరిచింది.
ఆ అరుపులు మరీ ఎక్కువ కావడంతో అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో అని వడివడిగా యయాతి మహారాజు నడిచాడు. నాలుగువైపులా పరిశీలనా చూస్తున్నాడు...
***
ఓ పాడుబడిన బావిలో నుంచి ఆర్తనాదం వస్తున్నట్టుగా గ్రహించి ఆ బావిలోకి తొంగి చూశాడు.
అక్కడ ఉన్న ఆ స్ర్తిని చూచి తన కుడిచేతినిచ్చి ఆమెను బావి వెలుపలకు తీశాడు. అపుడు ఎంతో సంతోషించిన దేవయాని యయాతికి కృతజ్ఞతలు చెప్పింది. యయాతి తిరిగి తన పరివారం దగ్గరకు వెళ్లుతుండగా దేవయాని ఆపి మీరు నా కుడిచేతిని గ్రహించారు కనుక మీరే నాకు నాథుడు గా ఉండాలని కోరింది. ఆమె వింత కోరికను విన్న యయాతి మహారాజు నిశే్చష్టుడయ్యాడు.
ఆతరువాత యయాతి మీరు చూడబోతే బ్రాహ్మణ కన్యగా కనబడుతున్నారు. నేనేమో క్షత్రియ వంశానికి చెందిన యయాతి మహారాజును. నేను మిమ్ముల్ను ఎలా వివాహం చేసుకొంటాను. ఇది అపమార్గం. దుర్మార్గం. కనుక అటువంటి కోరికను మీరు కోరకూడదు. నేను ఆ కోరికను తీర్చకూడదు అని ఖరాఖండిగా చెప్పి అక్కడ నుంచి గబగబా వెళ్లపోబోతున్న యయాతి మహారాజు ఆపి మీరు అనుకొన్నది నిజమే. నేను బ్రాహ్మణ్య కన్యను. మా తండ్రి రాక్షసులకు గురువు. శుక్రాచార్యుడు. కానీ నన్ను మీరు వివాహం చేసుకొని తీరవలెను.
దీనికి ఒక కారణం కూడా ఉంది. అందులోను మీరు మీ కుడిచేతిని నాకు అందించారు కనుక మీరే నా భర్త అని నిక్కచ్చిగా చెప్పింది. ఆ తరువాత జరిగిపోయిన వృత్తాంతాన్ని వినమని యయాతిని దేవయాని కోరింది. అపుడు జరిగిపోయిన దానిని గురించి ఇలా చెప్పుకొచ్చింది దేవయాని.
***
కొన్నాళ్ల క్రితం రాక్షస కుల గురువు అయిన శుక్రాచార్యుని దగ్గరకు కచుడు అంటే బృహస్పతి కుమారుడు వచ్చాడు. మా తండ్రిని తన గురువుగా ఎంచుకున్నాడు. ఆయనకు శుశ్రూష చేసి మృతసంజీవిని విద్యను అర్థించాడు.
కచుని వినయ విధేయతలు చూసి మా తండ్రి అతనికి మృత సంజీవనీ విద్య నేర్పిస్తానని మాట ఇచ్చి తన గురుకులంలో చేర్చుకున్నాడు.ఆ నాడు నేను కచుని చూశాను. ఆయనపై మనసు పడ్డాను. మా రాక్షసులంతా దేవతల గురువు అయిన బృహస్పతి కుమారుడిని ఇష్టపడలేదు. వారు ఎలాగైనా కచుని పీడ వదిలించుకోవాలనుకొని కచుడిని ఎన్నో అష్టకష్టాల పాలు చేశారు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804