డైలీ సీరియల్

కారణమూ కార్యమూ ( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10 శివావతారాలు (శతరుద్ర సంహిత)
సూత మహర్షి వివరిస్తున్న శివ పురాణాన్ని తన్మయులై వింటున్న శౌనకాది మునులు ఆయనని ఇలా ప్రార్థించాడు.
‘‘జ్ఞానివీ, వ్యాస శిష్యుడవూ అయిన సూత మునీంద్రా! దయ చేసి మాకు ఆ శంభుడి వివిధ అవతారాలనూ, వాటి వలన ప్రజలకు జరిగిన మేలూ వివరంగా తెలుపమని ప్రార్థిస్తున్నాము.’’
వారి జిజ్ఞాసకు ఎంతో ఆనందించిన సూతుడు, పూర్వము సనత్కుమారుడీ విధంగానే అడుగగా నందీశ్వరుడాయనకు తెలిపిన విషయా లు, వివరించసాగారు. ఇది ‘శతరుద్ర’ సంహితలోనివి.
‘‘మునులారా! సనత్కుమారా! నా స్వామి ఐన ఈశ్వరుడు తన సద్యోజా తాది ఐదు శిరస్సులనూ ఒక్కొక్క కల్పంలో ఒకటిగా తన అవతారంగా రూపొందించాడు. పందొ మ్మిదవ కల్పమైన ‘శే్వత లోహిత’ కల్పంలో సద్యోజాతుడిగా శివుడు బ్రహ్మదేవుడు పరమేశ్వర ధ్యానంలో ఉండగా ఆయన దేహం నుండి శే్వత వర్ణంలో పుత్రుడిగా ఉద్భవించి బ్రహ్మకు సృష్టి చేసే సమర్థతనూ, జ్ఞానాన్నీ ప్రసాదించాడు. ఆ తరువాతి కల్పమైన ‘రక్త’ మనే పేరుగల ఇరువదవ కల్పంలో రక్త వర్ణ శరీరంతో, ఎర్రని వస్త్ర విభూషణాలతో ‘వామదేవుడి’గా పరమేశ్వరుడు అవతరించాడు. ఇరువది ఒకటవ కల్పమైన ‘పీతవాసా’ అనే కల్పంలో పీత వర్ణుడై పీత వస్త్ధ్రారియైన తేజో రూపిగా ‘తత్పురుష’ నామంతో శంభుడు బ్రహ్మపుత్రుడిగా ఆవిర్భవించాడు. ఆ తరువాతిదైన ఇరవై రెండవ కల్పమైన ‘శివకల్పం’లో ‘రక్త పింగళ వర్ణం’ అనగా నల్లని వర్ణంలో ‘అఘోర’ నామంతో పరమేశ్వరుడతని పుత్రుడిగా ఆవిర్భవించాడు. ‘తత్పురుష, అఘోర అవతారాల్లో ఆయన పార్శ్వభాగాన్నుండి ఉద్భవించిన పుత్రులు బ్రహ్మకు యోగ మార్గాన్ని బోధించి దానిని ప్రచారం కూడా చేసారు. అఘోరావతారంలో ‘ఘోర’ అనే పేరుగల యోగం ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత ‘విశ్వరూపము’ అనే పేరు గల కల్పంలో పరమేశ్వరుడు ‘శుద్ధ స్ఫటిక’’వలె ప్రజ్వలిస్తూ ‘ఈశాన’ నామంతో ప్రాదుర్భవించి బ్రహ్మకు ఉపదేశమూ, బోధా చేశాడు. ఈ విధంగా తన ఐదు వదనాలతోనూ ఐదు అవతారాలు దాల్చాడు ఈశ్వరుడు.
శివుని అష్టమూర్తులు ఆయన అంశావతారాలే! శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహదేవుడు అన్న పేర్లతో విశ్వకల్యాణం కోసం పరమేశ్వరుడు వరుసగా జలమునీ, అగ్నినీ, వాయవునీ, ఆకాశాన్నీ, క్షేత్రజ్ఞుడినీ, సూర్యుడినీ, చంద్రుడినీ అధిష్ఠించి ఉన్నాడు.ఇదికాక బ్రహ్మదేవుడు ఆదిలో ‘స్ర్తీజాతి’ని సృష్టించలేని అసమర్థుడై ఉండగా మహేశ్వరుడాయన ఎదుట ‘అర్థనారీశ్వర’ రూపం ధరించి ప్రకటితమయాడు. ఆయన తననుండి ఉమాదేవిని వేరు చేయగా ఆ తల్లిని తనకు నారీ జాతిని సృష్టించే శక్తిని ప్రసాదించమనీ, తన కుమారుడైన దక్షుడికి పుత్రికగా జన్మించమనీ వేడుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆ శివాదేవి అంగీకరించింది. శివాదేవి అంశగా, దక్ష పుత్రికగా జన్మించి ఈశ్వరుడిని వరించింది సతీదేవి.’’ అని వివరించిన నందీశ్వరుడు ఆ పిదప బ్రహ్మదేవుడికి స్వయంగా శివుడు వివరించిన ఇరవై ఎనిమిది యోగేశ్వరావతారాలను కూడా వివరించాడు.
‘‘సనత్కుమారా! సృష్ట్యాదిలో ఒకానొకప్పుడు భగవంతుడైన రుద్రుడు బ్రహ్మదేవునితో ఈ విధంగా పలికాడు.. ‘‘విధాతా! ఈ కల్పమైన వరాహకల్పంలో లోకాలనీ, లోకులనీ, ముఖ్యంగా బ్రాహ్మణులనీ, అనుగ్రహించటానికి చతుర్యుగాలలోని ద్వాపర యుగాలలో భగవంతుడైన మహేశ్వరుడు గురువైన వ్యాసుని రూపంలో అవతరిస్తాడు తన వివిధ అంశలతో. అవే చతుర్యుగాలలోని కలియుగాలలో రుద్రుడినైన నేను మహా మునుల అవతారాలు దాలుస్తాను. మొదటి కలియుగంలో ‘శే్వతుడ’ నే మహామునిగానూ, రెండవ కలియుగంలో ‘సుతారుడి’ గానూ, మూడవ కలియుగంలో ‘దమనుడి’ గానూ, నాలుగవ కలియుగాన ‘సుహూత్రుడి’ గానూ నేను అవతరిస్తాను. ఆ తరువాత వరుసగా మహామునులైన కంకుడు, లోలాక్షి, జైగీషవ్యుడు, దధి వాహనుడు, ఋషభుడు, భృంగతుంగుడు, తపుడు, అత్రి, బలి, గౌతముడు, వేదశిరుడు, గోకర్ణుడు, గుహావవాసి, శిఖండి, మాలి, అట్టహాసుడు, దారకుడు. లాంగవీ భీముడు, శే్వతుడు, శూలి, ముండీశ్వరుడు, పరాశరుడు, సోమశర్మ అనే పేర్లతో ప్రకటితవౌతాను. ఇరువది ఎనిమిదవ సారి శ్రీహరి పరమేశ్వరాదేశంపై పరాశర పుత్రుడైన కృష్ణద్వైపాయన నామంతో వ్యాసుడిగా అవతరించినప్పుడు నేను బ్రహ్మచారినై ‘లకువీ’ అనే పేరుతో కలియుగంలో ఉద్భవిస్తాను. ఈ ఇరువై ఎనిమిది యోగేశ్వరావతారాలూ ఆయన రుద్రాంశుడిననైన నేను ధరిస్తాను అనగా ఇవి ఆయన అవతారాలేనని తెలుసుకో! ఇలా ఈ అవతారాలు ప్రతి కలియుగాంరంభంలోనూ ఒక్కొక్కటిగా క్రమక్రమం గా ప్రకటితవౌతాయి’’ అని రుద్రుడు స్వయంగా బ్రహ్మకి తెలిపిన వివరాలను సనత్కు మారునికి తెలియజేశాడు.
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె