డైలీ సీరియల్

నందీశ్వరుని జన్మ వృత్తాంతం ( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె బిడ్డ లిరువురినీ పెంచి పెద్ద చేయగా రాకుమారుడు దైవవశాత్తూ తిరిగి రాజు కావటం, ఆమె రాజ మాత కావటం జరిగింది. ఆమె బిడ్డ రాజసోదరుడయి వారంతా సకల సుఖాలూ పొందారు.
ఇవన్నీ కాక ఉపమన్యుడనే బాలుడిని అనుగ్రహిం చేందుకు పార్వతీ సమేతంగా దర్శనమిచ్చి అతడికి యోగ విద్యను బోధించి ‘క్షీరారామము’ అనే పాలకొలను సృష్టించి ఇచ్చాడు ఈశ్వరుడు. అయితే బాలుడైన ఉపమన్యుడికి తనపై గల భక్తిని పరీక్షించటానికి మొదట సురేశ్వరుడైన ఇంద్రుడిగా కనిపించాడు పరమేశ్వరుడు. అదే ‘సురేశా’వతారం. ఉపమన్యుడు చలించలేదు. కాలక్రమాన అతడు పరమేశ్వర భక్తుడై శ్రీకృష్ణుడంతటి వాడికి ఉపదేశం ఈయగలిగాడు.
ఈశ్వరావతారాలను వివరిస్తున్నప్పుడు నందీశ్వరుడు సనత్కుమారునికి, సాక్షాత్తూ తనను అనుగ్రహించి ‘శివావతారుడి’ని చేసిన పరమేశ్వరుని కృపా కటాక్షాలను గురించి తెలిపాడు.
వ్యాస విరచిత శివ పురాణంలోని ‘శతరుద్ర’ సంహితలో సూతుల వారు శౌనకాదులకి వివరించిన నందీశ్వర చరిత్రం తెలుపబడింది. అంతేకాదు. ఈశ్వరుని అవతారాల్లో ఒకటిగా ‘నందీశ్వరావతారం’ కూడా చోటు చేసుకుంది.
నందీశ్వరావతారం
నందీశ్వరుని జన్మ వృత్తాంతాన్ని సూతుడు శౌనకాదులకి ఇలా విశే్లషించారు.
‘‘మహామునులారా!
పూర్వం శిలాదుడనే మహర్షి సంతానం పొందగోరి హిమవత్పర్వత శ్రేణులలో ఈశ్వరుడి గూర్చి కఠోర తపమాచరించాడు. సమాధి స్థితుడయిన ఆయన శరీరం చుట్టూ చీమలు వల్మీకాలు నిర్మించుకున్నాయి. క్రిమికీటకాదులు ఆయన శరీరాన్ని భక్షించి శిథిలం చేసాయి. అయినా శిలాదుడెంత మాత్రమూ చలించక మరింత పట్టుదలతో తపస్సు కొనసాగించాడు.
వత్సరాలు దొరలిపోయాయి.
శిలాదుని పరమభక్తికీ, తన పట్ల ఉన్న ధృఢ విశ్వాశానికీ, భక్త సులభుడైన ఆ పరమేశ్వరుని మెత్తని హృదయం ద్రవించింది.
ఆ దేవదేవుడు శిలాదుని ఎదుట నిలిచి, ఎండిన కట్టె లాగా ఉన్న ఆయన శరీరాన్ని ఆప్యాయంగా స్పృశించాడు. అంతే! ఆ చల్లని అభయహస్తం తగిలీ తగలగానే శిలాదుడు కోల్పోయిన తన జవసత్వాల శక్తిని తిరిగి పొందాడు. ‘‘గంగ జటాధరా! హర హర మహాదేవ శంభోశంకరా! పాహి!పాహి!’’ అంటూ ఆయన పాదాలపై వ్రాలిపోయిన శిలాదుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు ఆ కైలాసపతి. శిలాదుడు దీనంగా,
‘‘స్వామీ! అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కద! సంతానం లేని నాకు కులదీపకుడైన పుత్రుడిని ప్రసాదించు.’’ అని వేడుకున్నాడు.
పరమేశ్వరుడు దయాదృక్కులతో చూస్తూ,
‘‘నాయనా! నీకీ జన్మలో సంతాన యోగం లేదు. అయితే కాలక్రమాన నీకొక బాలుడు దొరికి నీకతడు దత్తపుత్రుడై నీ వంశం, నిలిపే వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. నేనే నీకు అయోనిజ పుత్రుడినై త్వరలోనే అవతరిస్తాను’’ అని ఆశీర్వదించి అంతర్థానం అయాడు.
శిలాద దంపతులు ఎంతోకాలం నిరీక్షించి, ఇక తాళలేక పరమేశ్వరుని వరం త్వరగా సిద్ధించేందుకై ఓ యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞ వాటికలో హూమ గుండం మధ్యన ఒక అందమైన చిన్ని బాలుడు కాళ్ళూ చేతులూ ఊపుతూ ఆడుకుంటూ వారికి కనిపించాడు.
శిలాద దంపతుల అపరిమితా నందంతో ఆ బాలుడిని అందుకుని అపురూపంగా పెంచుకోసాగారు. వారి ఆనందానికి కారకుడైన ఆ బాలునికి ‘నందుడు’ అని నామ కరణం చేయమని అశరీరవాణి పలుకులు వినిపించటంతో వారతనికి నందుడని పేరు పెట్టి సకాలంలో అక్షరాభ్యాసమూ, ఏడవ ఏట ఉపనయనమూ, బ్రహ్మోపదేశమూ గావించి విద్యాభ్యాసానికై గురుకులానికి పంపించారు. అన్నీ సవ్యంగానే జరుగుతూండగా శిలాద దంపతులు మహామేధావి అయిన తమ వరపుత్రుడి పాండిత్యానికి ఆనందిస్తూ కాలం గడుపుతున్నారు. కానీ విధి విన్యాసం!
ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులనే మహర్షులు వేంచేసి వారి కుమారుడి భవిత్యాన్ని పరిశీలించి ‘‘శిలాదా! ఈ బాలుడు సర్వ లక్షణ సంపన్నుడు, కానీ మిక్కిలి అల్పాయుష్కుడు. ఏడవ సంవత్సరము జరుగుతున్న అతని ఆయువు మరొక్క ఏడాది మాత్రమే! ఈ లోపం సవరించలేనిది సుమా!’’ అని పెదవి విరచి వెళ్ళిపోయారు.
శిలాద దంపతులు మ్రాన్పడి దుఃఖసాగరంలో మునిగిపోయారు. తల్లితండ్రులు మాటి మాటికీ కన్నీరు పెట్టుకుంటూ ఉండటం గమనించిన నందుడు ఆశ్చర్యపడి వారి విచారానికి కారణం అడిగాడు. అతడెంతో బ్రతిమాలగా చెప్పలేక చెప్పలేక సంగతి తెలిపి భోరున విలపించారు తల్లితండ్రులు.
నందుడు ఏమాత్రమూ కలత చెందక వారిని ఊరడించి, ‘‘మాతాపితరులారా! ఆ పరమేశ్వరుడు భక్త సులభుడనీ, తపమొనర్చి మెప్పిస్తేచాలు, అడిగిన వరాలొసగే ఉదారుడనీ తమరే సెలవిస్తారే, మరి ఇప్పుడిలా చింతించవచ్చునా?!
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె