డైలీ సీరియల్

ధ్యానం.. మోక్షం (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు అనుమతిస్తేనేను ఈశ్వరానుగ్రహానికై కేదార క్షేత్రములో శివుని గూర్చి తపస్సు చేసి ఆయన ఆశీస్సులంది దీర్ఘాయుష్మంతుడినై తిరిగి వస్తాను’’ అని ఎంతో శాంతంగా, వినయంగా పలికి తల్లితండ్రుల అనుమతితో కేదార క్షేత్రానికి బయలు దేరాడు. అక్కడ ఓ అనువైన ప్రదేశంలో కూర్చుని శంకరుడి గూర్చి తీవ్రమైన తపస్సు చేయసాగాడు.
అచిరకాలంలోనే నందుడికి స్ఫటిక వర్ణ దేహంలో నీల గరళ కంఠంతో శోభిల్లుతున్న బ్రహ్మ తేజస్కుడైన ఆ పరమేశ్వర సాక్షాత్కారం లభించింది. బాలుడైన నంది ఆ అద్భుత తేజోమయ రూపాన్ని కనురెప్ప కూడా వేయక తిలకిస్తూండగా ఆ భక్త వత్సలుడు మందహాసంతో,
‘‘వత్సా! నీ తపోనిష్ఠతో నన్ను మెప్పించావు. కావలసిన వరం కోరుకో!’’ అన్నాడు.
భక్త సులభుడైన ఆయనని చూస్తూ మైమరచిన నందుడికి ఇహలోక సంబంధిత ఆయురారోగ్య ఐశ్వర్యాలు కోరాలనే ఆశే కలుగలేదు. ఆ శివుని సదాశివతత్వం అవగతమయినట్లూ, ‘జీవిత మంతా భ్రాంతి’ అనే సత్యం గ్రహించినట్లూ అయి ఆత్మవికాసం కలిగింది. ఆ సర్వేశ్వరుడికి సాష్టాంగ ప్రణామం చేస్తూ,
‘‘ప్రభూ! నీ ఈ అద్భుత రూప దర్శనమూ, నీ సంసేవనా భాగ్యమూ తప్ప ఇతరమైనవేవీ నాకు వద్దు. సదా నినే్న వీక్షిస్తూ నీ పరిచర్యలు చేసే సేవాభాగ్యం నాకనుగ్రహించి, నన్ను ధన్యుడిని చేయి!’’ అని అర్థించాడు ఆ బాలకుడు.
పరమేశ్వరుడి హృదయం కదిలిపోయింది. కరుణతో నందీశ్వరుడిని తన అక్కున జేర్చుకుని ‘‘బాలకా! నీవు నా భక్తులలో అగ్రగణ్యుడివి. నీ అలౌకికమైన కోరికతో నన్ను ఆనందపరిచావు. నీకు ఎన్నటికీ చెదరని బ్రహ్మజ్ఞానము ప్రసాదిస్తున్నాను. ఇక ఈ శరీరాన్ని వదలి, ‘‘్ధర్మ స్వరూపమైన క్రొంగొత్త వృషభ శరీరాన్ని పొంది నీవు కోరినట్లే నిరంతరం నాకెదురుగా నా వాహనంగా కైలాసంలో వసిస్తూ ననే్న వీక్షిస్తూ ఉండే వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. ఇకపై నీవు ‘నందీశ్వరుడ’నే నామంతో వ్యవహరించబడి, సమయానుసారంగా నాకు మంత్రివీ భృత్యుడివీ ప్రమద గణాలకు నాయకుడివీ అయి వర్ధిల్లుతావు. నీకు మృత్యువే ఉండదు. నీ తల్లితండ్రులూ ఐదు తరాల పూర్వపు పితామహులూ ఇప్పుడే నీతోపాటుగా నా కైలాసం చేరుకుని రుద్ర గణాలలో స్థానం పొందుతారు.’’ అని ఆశీర్వదించి తన శిరస్సుననున్న గంగమ్మ పవిత్ర జలాలతో నందుడిని అభిషేకించి, ‘నందీశ్వరుడి’ని చేసాడు పరమేశ్వరుడు. తన మెడలోని కమల పుష్ప హారంతో ఆయన నంది గళాన్ని అలంకరించగా, అతడు రెండవ శంకరుని వలె శోభించాడు. ధన్యోస్మి! అతని తల్లితండ్రులయిన శిలాద దంపతుల జన్మ ధన్యమయిందంటే అతిశయోక్తి కాదు కదా!
నిరంతరాయంగా ఆ పరమశివుడిని దర్శించటం నందీశ్వరుడికి ఎంతో ఆనందం. కాబట్టే, శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికీ, నందీశ్వరుడికీ మధ్యగా ప్రదక్షిణలు చేయకూడదనే ఆచారం వచ్చింది. భగవంతుడికీ భక్తుడికీ అడ్డు రాకూడదని దీని భావం.
పరమేశ్వరుడు తన పరమభక్తుడైన నందీశ్వరుడిని అభిమంత్రించిన ఆ పవిత్ర గంగాజలం ఐదు పాయలుగా కేదారంలోని జపేశ్వర క్షేత్రంలో పారుతున్నది. త్రిస్రోత, జటోదక, స్వర్ణోదక, వృక్షధ్వని, జంబూ నదులనే పేర్లతో ఆ ఐదు పాయలూ ప్రసిద్ధమై, అత్యంత పవిత్రమై, వాటిలోని ఏ ఒక్క పాయలో కేవలం ఒక్కసారి స్నానమా చరించినా, సాక్షాత్తూ జన్మరాహిత్యాన్ని ప్రసాదించ గలిగేటంత మహిమా న్వితంగా అవి రూపొందాయి.
ఈ చరిత్రాన్ని శౌనకాది మహర్షులకు వినిపించిన సూత మహర్షి ఇలా ఫలశ్రుతిని తెలిపారు. ‘‘మునులారా! అకాల మృత్యు హరణమూ, సమస్త పాప క్షయ కరమూ, సర్వాభీష్ట ఫలప్రదమూ, గ్రహ దోష నివారకమూ అయిన నందీ శ్వరుని చరితాన్ని విన్నవారి కష్టాలన్నీ మటు మయవౌతాయి.’’ అన్నారు సూతులవారు.
నందీశ్వరుడు శివుని కార్యాలూ, ఆజ్ఞలూ నెరవేర్చటంలో ఎంత అప్రమత్తంగా ఉండేవాడో తెలిపే ఉదంతమైన నందికేశ్వర తీర్థం గురించి తెలిపిన తరువాత, ఆ తీర్థ మహిమ గురించి కూడా వివరించారు సూతమహర్షి.
నందీశ్వర ధ్యానం
‘‘నందీశ్వర నమస్త్భ్యుం సాంద్రానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థ మనుజ్ఞాం దాతు మర్హధ’’
‘‘మహాదేవుని సేవకు అనుజ్ఞనిచ్చే అర్హతగల ఆనంద ప్రదాయకుడైన నందీశ్వరునికివే వందనములు.’’ అని పై శ్లోకార్థం.
‘‘వృషభస్య వృషణం సృష్ట్యా ఈశ్వరస్యావలోకనం
శృంగమధ్యే శివం దృష్ట్వా పునర్జన్మన విద్యతే॥
శ్లోకార్థం
‘‘వృషభరూపుడైన నందీశ్వరుని శృంగాలు అనగా కొమ్ముల మధ్యనుండి ఈశ్వర దర్శనం చేసిన వారికిక పునర్జన్మ ఉండదు.
గంగా భవాని ఒకప్పుడు నందీశ్వరుడు రక్షించిన ఋషిక అనే భక్తురాలు స్నానం చేసిన ఓ చిన్న తటాకానికి కాశీ గంగా ఫలాన్నిచ్చింది. ఆ ఉదంతం తెలుసుకుందాం.

- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె