డైలీ సీరియల్
ఫలితాలు ఈశ్వరార్పితాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పేరుకి వేదాలు వల్లించి, భాషణాలిచ్చి, నీతి సూత్రాలు బోధించే ఆ బ్రాహ్మణుడు పట్టరాని ఆగ్రహంతో, ఆ పసి పాదపు ఆ కాస్త వత్తిడికే ఆపాదమస్తకమూ కంపించిపోతూ, ప్రక్కనున్న దుడ్డు కర్ర తీసుకుని ఆ లేగదూడను విపరీతంగా బాదాడు.
పాపం, నోరు లేని లేగ దూడ కన్నీరు కారుస్తూ ‘అంబా! అంబా!’ అని అరుస్తూ ఉండిపోయింది. బ్రాహ్మణుడు విసుగ్గా దాన్ని పొదుగు వద్దకు త్రోసాడు కానీ, పాపం నొప్పుల బాధకి అది సరిగా పాలు కూడా కుడచలేకపోయింది.
తల్లి గోవు సైతం జరిగిన దానికి విస్తుపోతూ కన్నీరు కారుస్తూ రోజూ ఇచ్చినన్ని పాలు ఈయలేకపోయింది. అయితే గృహమేథి అదేమీ పట్టించుకోక ఆదరాబాదరా పాలు పిండి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
లేగదూడ కుయ్యి కుయ్యి మంటూంటే తల్లి గోవు ధారపాతగా కన్నీరు కార్చటాన్ని దూరం నుండి అనుకోకుండా గమనించిన అతిథి అయిన కర్మసిద్ధుడు ఏమీచేయలేక వెనుతిరిగి లోపలికి వెళ్ళబోతూ, వెనుకగా మాటలు వినిపించి ఆగిపోయాడు.
గోభాష తెలిసిన కర్మసిద్ధుడు, తల్లి గోవు లాలనగా తన బిడ్డను నాకుతూ,
‘‘నొప్పిగా ఉందా తల్లీ! పాపిష్టి బ్రాహ్మణుడు పసిదానివని కూడా చూడక చర్మం ఊడొచ్చేలా కొట్టాడు. ఓర్చుకో గలుగుతున్నావా పాపా!’’ లాలనగా, ప్రేమగా బిడ్డని అనునయిస్తూంటే చెవులు రిక్కించి వినసాగాడు.
లేగదూడ నొప్పిని ఓర్చుకుంటూ ‘‘లేదులే అమ్మా! మరీ ఎక్కువ నెప్పి లేదు. నీవు బాధపడవద్దు. మన యజమాని ఎందుకో విసుగులో ఉన్నాడు. కనుక మనం అతడిని తూలనాడకూడదు. నేను కూడా చూసి అడుగువేయ వలసింది.’’ అంటూంటే, ఆ పసికూన స్థిత ప్రజ్ఞతకు ఆశ్చర్యపోయాడు కర్మసిద్ధుడు.
ఎంతైనా మాతృమూర్తి కదా, గోవు మాత్రం సమాధాన పడలేకపోయింది.
‘‘బిడ్డా! మానవులకి పరమాత్ముడు మనకు మించిన బుద్ధిని ప్రసాదించాడంటారు. కానీ నిజానికి చిన్న పిల్ల వైన నీకున్నంత ఆలోచన కూడా యజమానికి లేకపోయింది. నీవు కాలు త్రొక్కితేనే అంత బాధపడిన వాడు, నీ పసి చర్మాన్ని కర్రతో మ్రోదితే నీకెంత బాధ కలుగుతుందో యోచించలేకపోయాడు. అందుకు కారణం అతని అధికారమూ, అహంకారమూ, కోపం వలన ఆవరించిన అజ్ఞానములే! మనము మూగ జీవాలమనీ, ఏమీ చేయలేమనీ తలస్తున్న అతనికి గుణపాఠం నేర్పటానికి నేనతని కొడుకుని పొడిచి చంపుతాను. అప్పుడాయనకు కన్న ప్రేమేమిటో తెలిసి వస్తుంది’’ అన్నది గోవు ఆవేశంగా.
లేగదూడ కంగారుగా, ‘‘వద్దు మాతా వద్దు. దయచేసి నీవు ఆవేశ పడవద్దు. ఆ బ్రాహ్మణ బాలుడిని చంపితే నీకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంటుంది. వెనుకటి జన్మలలో ఏ పాపాలు చేసామో ఈ జన్మలో పశు రూపం పొందాము. మళ్ళీ పాపం చేసి నీచ జన్మ కొని తెచ్చుకోవద్దు.’’ అని ఆందోళనగా హెచ్చరించింది.
గోమాత నిశ్చింతగా, ‘‘పాపారుూ! నేనంతా ఆలోచిం చాను. కానీ నేనా బాలకుడి ని మాత్రం చంపి తీరతాను. నిజమే! బ్రహ్మ హత్యా పాతకం నాకు చుట్టుకుంటుంది. కానీ అది పోగొట్టుకునే ఉపాయం నాకు తెలుసు. రేపటి దినం మన ఊరిలోని ‘నందికేశ్వర తీర్థం’లోకి అన్ని నదుల్తో కలిసి గంగాభవాని వచ్చి చేరే పుణ్య దినమైన వైశాఖ శుద్ధ సప్తమీ దినం. బ్రహ్మ హత్యా పాతకం వలన నాకు నల్లని వర్ణం సంక్రమిస్తుంది. నేను పరుగున వెళ్ళి గంగా తీర్థ స్నానంతో నా పాపాన్ని కడిగేసుకుని మళ్ళీ నా పూర్వపు ధవళ వర్ణానికి మారిపోవటం నువ్వే చూద్దువు గానీ! నందికేశ్వర తీర్థ స్నానం వలన నా పాపాలు త్రుటిలో పోవటమే కాదు, అనంత పుణ్యం కూడా నాకు సంప్రాప్తిస్తుంది’’ అని జవాబివ్వటంతో, అప్పుడిక ఆ ఆవేశంలో తానేం మాట్లాడినా తల్లి వినిపించుకోదని గ్రహించి ఊరుకుంది లేగదూడ.
కర్మసిద్ధుడు కూడా తెల్లవారేసరికి ఆవు కోపం తగ్గిపోతుందని తలచి ఆ విషయం వదలి వేసాడు. కానీ దైవ నిర్ణయం అలాగే ఉందేమో అన్నట్లుగానే మర్నాడు ఉదయం అటుగా వచ్చిన విప్రబాలుడిని గోమాత కొమ్ములతో పొడిచి చంపింది. వెనువెంటనే బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుని అది నల్లని వర్ణంలోనికి మారిపోయింది.
దూడతో చెప్పినట్లుగానే అది బలంగా తలుగు లాగి తన బంధనం విడిపించుకుని పరువెత్తి వెళ్ళి నందికేశ్వర తీర్థంలోకి దిగి అందులో మూడు మునకలు వేసి లేచింది.
దాని వెనుకనే పరుగున వెళ్ళిన కర్మసిద్ధుడు, గోవు పాపం పరిహారమైందన్న సూచనగా అది యథాప్రకారం తన ధవళ వర్ణాన్ని తిరిగి పొందటం చూసి ఆ తీర్థ మహాత్మ్యానికి విస్తుపోయాడు. అంతలో ఒక దివ్య తేజోమూర్తి అతని ఎదుట ప్రత్యక్షమయింది.
‘‘నాయనా! నేను గంగామాతను. ఈ రోజు నేనే కాక మిగిలిన పుణ్య నదులన్నీ కూడా ఈ తటాకంలోకి ప్రవహించే వైశాఖ శుద్ధ సప్తమీ దినం. నీవు కాశీ గంగలో కలపాలని తెచ్చిన నీ తల్లి అస్తికలను ఇక్కడే నిమజ్జనం చేయి. వాటిని కాశీ గంగలో కలిపినంత ఫలమూ ఆమెకి లభిస్తుంది.’’ అని ఆదేశించింది గంగాభవాని.
కర్మసిద్ధుడు వెంటనే ఆమె ఆజ్ఞను శిరసావహించగా, మరు నిమిషమే అతని తల్లి దివ్య శరీరాన్ని పొంది అతనికి దర్శనమిచ్చి, ‘‘నాయనా! నా కోరిక తీర్చి నన్ను తరింప జేసావు. పుత్ర పౌత్రాభివృద్ధిగా చిరకాలం వర్థిల్లు.’’ అని దీవించి పుణ్యలోకాలకు వెళ్ళింది.
- ఇంకావుంది...