డైలీ సీరియల్

ఇహమూ పరమూ శివయ్య(శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మహా పురుషులారా! నందీశ్వర చరిత్రమూ, నందికేశ్వర తీర్థమూ ఎంత పావనమైనవో అర్థం అయింది కదూ! అంతటి భక్త శిరోమణి అయిన నందీశ్వరుడిని పరమ శివ భక్తుడైన మార్కండేయ మహర్షి పరమేశ్వర చరిత్రాన్నీ, ఆయన తత్త్వాన్నీ తనకు తెలుపవలసిందిగా అర్థించగా, అది శివాదేశం కనుక శివ తత్త్వాన్ని నందీశ్వరుడాయనకు బోధించాడు’’ అని భక్తిగా నమస్కరించుకున్నారు.
- - -
॥ మరణం,వినాదైనే్యన జీవనం
దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే॥
‘‘స్వామీ! పార్వతీ నాథా! దీన స్థితి పొందని జీవితమూ, కష్టం లేకుండా మరణించే భాగ్యమూ, అంత్యాన నీ సాయుజ్యము కలిగే వరమూ నాకు ఇవ్వు ప్రభూ!’’ అని ప్రతినిత్యం మృత్యుంజయ స్తోత్రంలోని ఈ శ్లోకం స్మరించుకుంటే శివసాయుజ్యం తప్పక లభిస్తుంది.
12
శివపురాణ ప్రవచనం సమయాన సూతుల వారు శౌనకాది మహర్షులకు శివపూజా విధానాన్ని గురించీ, శివలింగ పూజ వైశిష్ట్యాన్ని గురించీ, శివుడికి ప్రీతి కలిగించే వ్రతాలలో ముఖ్యమైనదైన శివరాత్రి వ్రతాన్ని గురించీ, శివావతారాల గురించీ ఎన్నో విషయాలను విద్యేశ్వర, రుద్ర, శతరుద్ర కోటిరుద్ర, వాయవీయ సంహితలలోనివి వివరించారు. శతరుద్ర, విద్యేశ్వర సంహితలు నందీశ్వర సనత్కుమార సంవాద రూపకంగానూ, రుద్ర సంహిత బ్రహ్మ నారద సంవాద రూపకం గానూ, కోటిరుద్ర సంహిత సూత శౌనకుల ప్రశ్నోత్తరాలుగానూ, వాయువీయ సంహిత వాయుదేవ నైమిశారణ్య మునుల సంవాద రూపంగానే కాక ఉపమన్యు శ్రీకృష్ణుల సంవాదంగానూ, కైలాస సంహిత కార్తికేయ వామదేవ సంవాదంగానూ, రుద్ర సంహిత లోని పంచమ ఖండమైన యుద్ధ ఖండము సనత్కుమార వ్యాసుల సంవాదంగానూ, సూతుల వారిచే ప్రయాగ క్షేత్రంలో శౌనకాది మహర్షులకి తెలుపబడగా, ఉమా సంహితను ఆయన వారికి సనత్కుమార వ్యాస మహర్షుల ప్రశ్నోత్తరాలుగా వివరించారు.
ఉమా సంహితలో పాప పరాయణులైన జీవులు వివిధ రకాలైన మహా నరకాలు పొంది యమపురి చేరే మార్గంలోనూ, అక్కడికి వెళ్ళిన తరువాతనూ అనుభవించే కష్టాలను గురించీ, నరక యాతనల గురించీ, నూట నలభై రౌరవాది నరకాల గురించీ, యమలోక మార్గాన వెళ్ళే వారికి సౌలభ్యాన్ని ప్రసాదించ గల వివిధ దానాల గురించీ వ్యాసుల వారడుగగా సనత్కుమారుడు వాటినాయనకు విపులంగా వివరించాడు.
పరస్ర్తీని పొందగోరటం, ఇతరుల ధనాన్ని అపహరించదలచటం, చేయరాని పనులను చేయటానికి వ్యూహాలు రచించుకోవటం, ఇతరులకి హాని కలిగించే ప్రయత్నాలు ఆలోచించటం మొదటి శ్రేణికి చెందిన మానసిక పాపకర్మలు కాగా, వ్యర్థ ప్రలాపాలూ, అర్థం పర్థం లేని మాటలతో అసత్యాలతో, చాటుమాటున చాడీలతో ప్రక్కవారికి హాని కలిగించటం రెండవదైన వాచిక పాపకర్మలు. మనస్సు, వాణి, శరీరమూ ఈ మూటి కలయికతో అధర్మ అన్యాయ కర్మలు చేయటం మూడవ శ్రేణి పాప కర్మలు కాగా, భగవంతుడినీ భగవద్భ క్తులనూ తపసంపన్ను ల నూ గురు జనులనూ మాతా పితృ తుల్యులనూ నిందించే వారు నాలుగో శ్రేణి పాపాత్ములు, ఐదవ శ్రేణికి చెందిన ఘోర పాపులు-హత్యలూ, మదిరా పానము, సువర్ణాది విలువ గల వస్తువులను దొంగిలించే వారూ, గురుపత్నిని పొందే వాడూ, ఈ నలుగురితో సాంగత్యము చేయు వాడూ అని తెలిపిన సనత్కుమా రుడు నిర్దోషి మీద దోషా రోపణ చేసేవారూ, ఇతరుల మంచిని బలవతంగా ఖండిం చి అసత్య గుణముల ద్వారా తనని తాను గొప్పవారని ఋజువు చేసికొనే వాడూ, నిండుసభలో ఉత్తములని అవమానించే వాడూ కూడా బ్రహ్మహత్య చేసిన వాడితో సముడేనని వ్యాసుల వారికి వివరించారు. ఇవేకాక భయంకర కార్యాలతో నిరప రాధులను శిక్షించి హింసించే వాడూ గోవధ చేసే వారూ కూడా మహా పాపాత్ములనీ, వివిధ నరక యాతనలనూ పొందుతారనీ తెలిపిన సనత్కుమారుడు దాన ధర్మాలు చేసిన వారు సుఖముగా యమలోక యాత్ర చేయగలరని విశదీకరించాడు.
భూలోకం నుండి ఎనభై ఆరు వేల యోజనాల దూరం లో ఉన్న యమ లోకం పుణ్యాత్ములకి అత్యంత సమీపాన ఉన్నట్లూ, పాపులకు కోట్ల యోజనాల కంటక మార్గంలా ఉన్నట్లూ అనిపిస్తుందనీ, పాపి అయినవాడు కనీసం దాన ధర్మాలు అయినా చేస్తే యమలోక మార్గం సుగమ మవుతుందనీ సనత్కుమారుడు తెలిపాడు.
దానాలలో అన్నము, జలము, అశ్వము, గోవు, వస్తమ్రు, శయ్య, ఛత్రము, ఆసనము ఈ ఎనిమిది వస్తువుల దానాలు యమలోక మార్గాన్ని సుగమం చేస్తాయని తెలిపారాయన. వీటిలో కూడా అన్నదానము శ్రేష్ఠమైనది. అన్నము పరబ్రహ్మ స్వరూపము కనుక దానిని మించినది లేదు. ఘోర పాపము చేసిన వారు కూడా త్రికరణ శుద్ధిగా అన్న దానం చేస్తే సమస్త పాపాల నుండీ ముక్తుడై స్వర్గం పొందుతారనీ, జలదానం (చలివేంద్రము) కూడా ఇంచుమించు అదే ఫలాన్ని ఈయటమే కాక జలాశయాలు త్రవ్వించటం వలన పురుషుని వంశమంతా ఉద్ధరింప బడుతుందని వివరించాడు.
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె