డైలీ సీరియల్

నామస్మరణం పాపహరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృక్షములు నాటిస్తే అక్షయలోకాలు పొందుతారని తెలిపి, మానవుడు సత్యమనే శ్రేష్ఠ యజ్ఞాన్ని ఆచరిస్తూ, తపస్సు, స్వాధ్యాయము, వేదాధ్యయనమూ, పురాణ శ్రవణమూ అనే సాధనాలు అవలంబిస్తే సంపూర్ణ యజ్ఞాలను చేసిన ఫలం పొందుతాడనీ, ముఖ్యంగా కలియుగంలో ఇంతకు మించిన ధర్మమేదీ లేదనీ, ఈ సాధనాలు ధ్యాన మోక్ష రూప ఫలలాను ఇస్తాయనీ తెలిపారు సనత్కుమార మహర్షి.
‘‘గొప్ప పాపాలకూ, తేలికపాటి పాపాలకూ ప్రాయశ్చిత్తం చేసుకోవటమే మానవులు చేయవలసింది. వ్యాస మునీంద్రా! పూర్వం ఈ ప్రాయశ్చిత్తాలకు సంబంధించిన కర్మలు స్వాయంభువ మనువు చేత తెలుపబడ్డాయి. వాటన్నింటిలోకీ శంకరుని నామస్మరణమే సర్వశ్రేష్ఠమైన ప్రాయశ్చిత్త కర్మ. పశ్చాత్తప్తుడైన మానవుడు శివస్మరణతో సర్వపాప రహితుడవుతాడు. ధ్యానము, జపము, హూమము, పూజ చిత్తశుద్ధితో చేస్తే తప్పక సద్గతులు కలుగుతాయి.’’ అని వ్యాసునికి తెలిపారు సనత్కుమారుడు.
ఉమా సంహితలో శివుడు స్వయంగా పార్వతికి తెలిపిన కొన్ని విషయాలు కూడా సూతులవారు శౌనకాదులకు తెలిపారు. ధ్యాన పరాయణులైన యోగులు శరీరధారులై కూడా సుఖముగా మృత్యువును నశింపజేయగలుగుతారనీ, ప్రాణాయామము ద్వారా, అంధకార యోగము ద్వారా బ్రహ్మమును పొందవచ్చనీ శివుడు పార్వతికి తెలిపాడు. రాత్రి నిశబ్దంగా ఉన్నప్పుడు అనగా అందరూ నిద్రించాక దీపమును ఆర్పివేసి చూపుడు వ్రేలితో రెండు చెవులనూ మూసి రెండు ఘడియల వరకూ అణచి ఉంచితే ‘అగ్ని పూరిత’ అనగా శబ్ద బ్రహ్మను సాక్షాత్కరింప చేసుకోవచ్చుననీ, దాని వలన జీర్ణశక్తి పెరిగి, సకల రోగాలూ, జ్వరాదులూ, రుగ్మతలూ అతి శీఘ్రంగా నశించటమే కాక, ఆ శబ్దము వలన సంసార బంధాలనుండి కూడా విడివడి బ్రహ్మ చింతన వైపు మానవుడు మరలు తాడనీ పరమ శివుడు పార్వతికి బోధించాడు.
ఉమా సంహితలో దేవి చేసిన రాక్షస సంహారం, అనగా, మహిషాసుర, మధుకైటభ, శుంభ నిశుంభ, దుర్గమాసుర వధలు కజడా వివరించబడ్డాయి.
శ్రావణ, భాద్రపద, మాసాలలోని శుక్ల పక్ష తృతీయ (తదియ) దినానా, ఆశ్వీయుజ మాస శుక్ల పక్షాన నవరాత్ర వ్రత మాచరించటం వలన సమస్త కోరికలు తీరటమే కాక మోక్షం కూడా సులభతరమవుతుందని సూతుల వారు శౌనకాదులకు తెలిపారు.
కైలాస సంహిత ప్రధానంగా ప్రణవార్థముల వివరణము. ఒకప్పుడు వామదేవుడనే ఋషివర్యుడు ప్రణవ అర్థాన్ని వివరించమనీ, ఆ అక్షర స్వరూపాన్ని, విశిష్ఠతనూ తెలపమనీ అడుగగా షడాననుడైన కార్తికేయుడు ఇలా తెలిపాడు.
‘‘మహామునీ! వామదేవా! ‘అ’ ‘ఉ’ ‘మ’ అన మూడు స్వరాలు అనగా అచ్చులు నాలుగవదైన బిందువుతోనూ, ఐదవ అక్షరమైన నాదముతోనూ కలిసి ‘ఓం’ అనే ప్రణవ నాదంగా రూపొందాయి. ‘ఓమితీదం సర్వం’ అనగా ఓంకారమే శివ స్వరూపం. ఓంకారమే శక్తి స్వరూపమైన జగత్తు. శివశక్తి సంయోగమే పరబ్రహ్మము. శివుని పరాశక్తి నుండి చిచ్ఛక్తి ప్రాదుర్భవించి, చేతనా లేక చైతన్య రూపంగా జీవుడిని ఆశ్రయించి ఉంటుంది. పరమేశ్వరుడు తన ఇచ్ఛాశక్తితో విశ్వ సృష్టికి ఉద్యమించే పరిస్పందనమే ‘శివ తత్త్వము’ అని పేరొందింది. పరమేశ్వరుడు జ్ఞాన స్వరూపుడు. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ ‘అహం బ్రహ్మూస్మి’ ‘తత్త్వమసి’ ‘అయమత్మా బ్రహ్మ’ అనేవి ప్రధాన నాలుగు మహావాక్యాలు కాగా ‘‘ప్రజ్ఞానాత్మా’ ‘ఈశావాస్యమిదం సర్వం’ ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ ఇత్యాది మహావాక్యాలు పరబ్రహ్మను జ్ఞాన స్వరూపునిగానూ, శక్తితో కూడిన చైతన్య స్వరూపునిగానూ నిర్ణయిస్తున్నాయి. శక్తితో కూడిన పరమేశ్వరుడే ‘అహం’ పదమునకు అర్థమైన వాడు. ‘సోహం’ అన్నది మహామంత్రంతో సమాన పదము. దీనిలో ‘స’కారము శివ వాచకము. ‘అహం’ అనగా నేను. ‘సోహం’ పదంలో నుండి ‘స’, ‘హ’ అనే వ్యంజనాలను పరిత్యజిస్తే మిగిలే పదమైన ‘ఓం’ మన నిజ స్వరూపమైన నిరాకార పరబ్రహ్మము లేక పరమాత్మ. అందుకే సోహం పదాన్ని త్రిప్పి వ్రాయగా వచ్చిన పదం ‘హంస’ అనగా వెళ్ళిపోయేది. మిగిలేది ‘ఓం’ కారుడైన పరమ శివుడు. శివుని పంచ వదనాలనుండీ పంచకళలు ఆవిర్బవించాయి. ఈశానుని నుండి ‘శాంత్యాతీత’ కళ, తత్పురుషుని నుండి ‘శాంతి’ కళ, అఘోరుని నుండి ‘విద్యా’ కళ, వామదేవుని నుండి ‘ప్రతిష్ఠా’ కళ, సద్యోజాతుని నుండి ‘నివృత్తి’ కళ ఉత్పన్నమయాయి.
గురువును ఆశ్రయించిన శిష్యుడికి ‘సోహం’ మంత్రాన్ని ఉపదేశించాక, ఆయన శిష్యుడికి ‘అహం’ అనగా ప్రకృతి అనీ, ‘ప్రకృతిలేక శక్తి స్వరూపుడనైన నేనే శివ స్వరూపుడిని’ అని శిష్యుడిని భావించమని బోధిస్తున్నాడని అర్థం. ఈ భావన క్రమంగా అతడిని ‘ఓం’ కారుడైన పరమశివుని వద్దకు చేరుస్తుంది.’’ అంటూ మరెన్నో శాస్త్ర విషయాలు వామదేవుడికి బోధించాడు. కార్తికేయుడు అని శౌనకాదులకి సూతలవారు తెలిపారు.
నదీ స్నాన ఫలము, దాన ఫలము, విశేష మాస తిథులలో పూజ వలన కలుగు విశిష్ట ఫలము మొదలైన వాటిని గురించి విపులంగా మునులకు తెలిపారు.
- ఇంకావుంది...

9676926171