డైలీ సీరియల్

శబరులు శంకరుని రూపులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రింబవళ్లు-ఉదయాస్తమయాలు, తూర్పు- పడమర- ఉత్తర- దక్షిణమనే దిక్కులరూపమైన అవధులు లేనివాడా! సంసారమనే అంధకారపటలాల్ని ఛేదించువాడా! నిత్యమూ - అనంతమూ అయిన జ్ఞానంచేత ప్రకాశించువాడా! సూర్యాది గ్రహాలకు మహూన్నతమైన తేజస్సును అనుగ్రహిం చు వాడా! సమస్త బ్రహ్మాండాలను ప్రకాశింపచేయు తొలి తత్త్వమైన నక్షత్రమండలాలను వెలిగింపచేయు చంద్రస్వరూపా ! శ్రీకాళహస్తీశ్వరా !
తృతీయాశ్వాసం
తన కన్నులనే పద్మాలతో శ్రీమహావిష్ణువు చేత పూజింపబడిన వాడవగుటచేత దివ్యమైన ఎర్రని పాదపద్మాలు కలవాడా! జనన మరణబాధలకు నిలయమైన సంసారమనే అనేక వ్యాధుల్ని నివారించే వైద్యశ్రేష్ఠుడా! శ్రీకాళహస్తీశ ! శివా !
యాదవరాజు ఎడల కరుణా కటాక్షాల్ని నెరపి మీరే స్వయంగా చెప్పిన మీ స్వీయగాథను భక్తజనులకు చెవుల పండుగ అగునట్లుగా వినిపింతును. ఆలకించుడు.
తిన్నని జన్మభూమి వర్ణన
పొత్తపినాడులో అది ఒక అరణ్యప్రదేశం. అది కిరాతజాతులకు నివాసభూమి. అచ్చట ఎన్నో విలువైన అటవీవస్తువులు లభిస్తాయి. ఆ ఊరిలో ఉండే గొప్ప ధనసంపద అద్భుతం. అనూహ్యం. ఆ ఊరంతా కొండలలో పుట్టిన నదులలోని తామరపూల సువాసనల చేత నిత్యం పరిమళాలలను గుబాళిస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో చాలా మంది చెంచులు - చెంచెతలతో కూడి కాపురం చేస్తూ ఉన్నారు. చిత్రమేమోగాని - వారు అడవిపందుల కోరలో లభించే ముత్యాల్ని రేగుపళ్లు మాదిరిగా పరిగణిస్తారు. సర్పరాజుల తలలపై ఉండే రత్నాల్ని గురివెంద పూసల మాదిరిగా హీనంగా చూస్తారు. మదపుటేనుగుల తలలలో ఉండే ముత్యాల్ని ఉసిరికాయల్లా తక్కువగా చూస్తారు. వెదురు బొంగులలో పుట్టే మేలైన ముత్యాల్ని ఊడుగుపండ్లతో సరి సమానంగా పరిగణిస్తారు. మంచిగంధం - అగరుచెట్ల కొమ్మల్ని వారు వంటయింటిలో కట్టెలుగా ఉపయోగిస్తారు. కస్తూరి - పునుగు - జవ్వాదుల్ని నీళ్లలో కలిపి దానితో ఇండ్లలికి ప్రతిదినమూ బయట వేస్తారు. అవి వీథుల్లో - గోమయపు (ఆవుపేడ) ముద్దలుగా ప్రకాశిస్తూ ఉంటాయి.
ఇక ఆ ఊరి వైభవం ఇట్టిదని పొగడటం ఎవరివలన సాధ్యమవుతుంది. ఆ గ్రామంలోని శబరస్ర్తిలు చాల నిరాడంబరులు. నిత్యమూ పట్టుచీరల్ని కట్టే భాగ్యం కలిగియున్నా చెట్ల ఆకుల్ని కట్టడం మాత్రం కష్టమని తలంపరు. రాజభోజనం చేసే వైభవం కలిగియున్నా అడవి ధాన్యాల్ని ఇష్టపడమని యనరు. మణిమాణిక్యాది ఆభరణాలు కలిగి కూడా గురివెంద పూసల దండలేల యని తిరస్కరిం చరు. మంచి ఉయ్యాల మం చాల నల్లుకొని కూడ పూల తీగల ఉయ్యాల లేలయని మాటాడరు. ఎంతసంపద కలిగినా - ఎంత వారలయినా పరంపరగా వచ్చే కులధర్మాన్ని కులాచారాల్ని మాత్రం ఆ శబరస్ర్తిలు విడువరు. ఆ శబరస్ర్తిలు తమ రాగిపంట చేలకు కాపుగా దిష్టిబొమ్మల్ని నిర్మించి ఉంచుతూ ఉంటారు. వానికి శరీరావయవాలుగా అగరు చెట్ల కట్టెల్ని కడతారు. దానికి కస్తూరిని పూస్తారు. చమరీమృగం ఈకల్ని జుత్తుగా అమరుస్తారు. ఏనుగు కుంభస్థలాలలోని ముత్యాల్ని కనుగ్రుడ్డులుగా అలంకరిస్తారు. ఆ అడవిలో నివసించే ఎరుకలు ఏనుగుల తలలను కొమ్ములతో సహా పైరులకు దృష్టి దోషం తగులకుండా చేలలో అందంగా ఉంచుతూ ఉంటారు. తమ పండిన చేలలోనికి కొండలలో ఉండే వరాహపంక్తులు (పందులు) దూరకుండ చేలచుట్టు తెల్లని చామరాలను, వేటలో తెరకట్టుటకై పైన కట్టే పెద్ద త్రాళ్లను కడుతుంటారు. ఆ ఉడుమూరు చేలలో మంచెల మీద ఎక్కిన చెంచెతలు ఒయ్యారపు కదలికలచేత నడుములకు కట్టిన పారుటాకులు కదలాడగా తమ మర్మాంగాల్ని కనిపింప చేస్తూ పిట్టల్ని తోలుతుంటారు. బాహుమూల కాంతులు (చంకలు) స్తనాలమీద పడి ప్రకాశించే విధంగా చేలపై వాలిన పక్షుల్ని చిత్రంగా రాళ్లను ఒడిసెళ్లతో వారు కొడుతూ ఉంటారు. చేలలో భిల్లాంగనలు అందంగా అరుస్తూ పక్షుల్ని తోలుతూ ఉంటారు. ఆ ధ్వనిని విని గండు కోయిలలు తమ జాతి కోయిలలే కూస్తున్నాయనే శంకతో అవి కూడ కుహూ కుహూ అని కూస్తుంటాయి. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వేటాడ వచ్చిన బోయయువకుల మనస్సులు మన్మథావేశమై పోతుంటాయి. ఆ యుడుమూరు లోని శబరకాంతలు మంచి వనవంతలు. వారి బంగారు కుచాలు-ఏనుగుల కుంభస్థలాలతో పరస్పరం పగ వహించాయి. అన్నదమ్ముల పగ-పోరాటం బ్రహ్మకైన మాన్పక శక్యమా? కొండల వంటి చనులు; తేనెలతో ఉబ్బిన పెదవులు; మెఱుపులీను శరీరం; నల్లని పొడవైన కేశాలు - ఆశ్చర్యాన్ని కలిగించే నడుము ఆ ఊరులోని అందగత్తెలకు అందంగా అమరియున్నాయి. శబరులు తేనె త్రాగి తదుపరి శబర స్ర్తిల అధరాల్ని చవిచూచి ఈ యువతుల అధరమ ధురిమకు తేనెలు సమానమా అని భావించి మైమరచిపోతూ ఉంటారు. చింపిరిజుట్టుతో పెట్టిన కొప్పు బిగింపుగా ఉండేందుకు చుట్టూ నెమలిపింఛాన్ని అచట భిల్లస్ర్తిలు చుట్టుకొంటారు. వారు పునుగును అందంగా పూసుకొన్న నుదిటిపై జేగురుబొట్టు పెట్టుకొంటారు. కురువింద పూసల పేరుకు కూడ తావు ఈయని ఇరుకైన స్తనాలపై ఆ భిల్లస్ర్తిలు పారుటాకుల్ని పైటగా వేసుకొంటారు. నడుమునకు కట్టిన జంట ఒడ్డాణాలలో నెమలిపురి వస్త్రాన్ని గట్టిగా కట్టుకొంటారు. పొట్టి కణుపులు కల వెదురులతో చేసిన విల్లులకు చాగ (ఒక వృక్షవిశేషం) నారదారాన్ని నారిగా కట్టి కొయ్యమేకులు కొట్టిన బాణాల్ని తీసుకొని ఆ యుడుమూరులోని భిల్ల స్ర్తిలు భర్తలతో కలిసి అడవులలో తిరుగుతూ ఉంటారు. ఆ వూళ్లో గల కిరాతులు తమ యిల్లాండ్ర అందమైన శరీరావయవాల సౌందర్యంతో పోలిక వహిస్తున్నాయని - తలంచి తమ గృహాల్లో - సింహాలను-నెమళ్లను-లేళ్లను-ఏనుగులను కట్టి పెంచుతుంటారు. అయినా అవి ఆ కిరాతస్ర్తిల నడుములకు, జుత్తుకు, చూపులకు, స్తనాలకు పోలికను వహించకున్నాయా?
- ఇంకావుంది...

చరవాణి: 9490620512