డైలీ సీరియల్
శ్రీకృష్ణ రమ్య రామాయణం (రెండవ భాగం)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఆ పిల్లకోతి హనుమేనయ్యా ! ...’’
‘‘అయ్యో ! తప్పై పోనాది సామీ ! చ్ఛమించండి !’’ అంటూ లెంప లేసుకున్నారంతా. కొందరు గుంజీలు కూడా తీశారు.
దాసుని తప్పు దండంతో సరి !
మళ్ళీ రామభజన చేయసాగారు. కానీ, హనుమ రాలేదు. అప్పుడు కృష్ణుడు లేచి నిల్చున్నాడు.
‘‘మీరంతా దూరంగా జరగండి !’’ అంటూ అందర్నీ వెనక్కి జరిపి, తన మురళితో ఒక పెద్ద వలయాన్ని గీశాడు. మధ్యలో మరో చిన్న వలయాన్ని గీశాడు.
‘‘ఈ గీత నెవరూ దాటవద్దు !’’ అంటూ హెచ్చరించాడు.
‘‘హనుమ వస్తే పూలు వేయండి ! ... మళ్ళీ రాళ్ళేయకండి !’’ అన్నాడు.
‘‘అట్టాగే !’’ నంటూ వాళ్ళు తలూపి, ఆ చిన్న వలయంలో పసుపూ, కుంకుమలూ, పూలూ చల్లారు.
‘‘మళ్ళీ రామభజన చేయండి ! ... కానీ, ఆపకండి !’’
మళ్ళీ వాళ్ళంతా ఆర్ధ్రమనస్కులై రామభజన చేశారు చాలాసేపు. తమని తాము మరచిపోయారు.
అప్పుడా పిల్లకోతి ఆ వలయంలో దూకింది. చిన్న వలయంలో నుంచుంది. వాళ్ళతో పాటు తానూ రామభజన చేసింది. అందరూ పూలూ, అక్షతలూ చల్లారు.
చూస్తూండగానే, ఆ పిల్లకోతి పెరిగి, హనుమగా మారి, రామభజన చేయసాగింది తన్మయత్వంతో.
అందరి కళ్ళల్లో ఆనందాశ్రువులు దొర్లాయి. ఆవేశంగా, ఆనందంగా మళ్ళీ రామభజన సాగింది. ఎంతసేపలా చేశారో తెలీదు. కానీ, వాళ్ళంతా కాలాన్ని మరచి, కాలాతీతులయ్యారు.
గీత దాటకుండా, క్రమశిక్షణతో, అందరూ తమ తమ స్థానాల్లోనే ఉండి దండాలు పెట్టారు. నాట్యాలు చేశారు.
‘‘యిది తేర్తాయుగమా ? దాపర యుగమా ? ... తెల్వడం లేదుసామే!’’ అన్నాడొక పెద్దమనిషి.
‘‘మేం మడుసులమో ! కోతులమో తెల్వడం లేదు’’ అన్నాడు మరొకడు.
‘‘మీరేదనుకొంటే అది !’’ అన్నాడు కృష్ణుడు.
‘‘పరమానందెంగా ఉండింది. కిస్కిందలో ఉన్నట్టుగా ఉంది’’ అన్నాడు మరో వృద్ధుడు.
‘‘ఎలా అనుకుంటే అలా ! తథాస్తు !’’ అన్నాడు కృష్ణుడు.
ఇంకేముంది. వాళ్ళంతా వానరులై పోయారు, ఒక్క కృష్ణుడూ, అతని అష్టపత్నులూ తప్ప.
ఆ వానరులంతా ఎగురుతూ, దూకుతూ, కోతి చేష్టలతో రామభజన చేయసాగారు. చిత్రమేమంటే రూపంతో పాటు వారి కంఠస్వరమూ మారిపోయింది.
కొంతసేపటికి హనుమ తన భజన ఆపేసి, నలువైపులా తిలకించాడు. చుట్టూ వానరులు ! మధ్యలో తాను !
ఇంకా ఉంది