డైలీ సీరియల్
శ్రీకృష్ణ రమ్య రామాయణం (రెండవ భాగం)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఏమిటిది స్వామీ ! ... మనం కిష్కింధలో ఉన్నామా ? ... లంకలోనా?’’ అన్నాడు హనుమ.
‘‘కాదు. యమునానదీ తీరాన. బృందావనాన. ద్వారకకు సమీపాన’’.
‘‘మరి ? ... ఈ వానరులంతా ?’’
‘‘వాళ్ళంతా నా ప్రజలు. నీ భక్తులు. వాళ్ళ అభీష్టం మేరకిలా. వానరులై పోయారు !’’
‘‘ఎంతటి భాగ్యం నాది ? ... ఎంతటి సుదినమిది ? ... వీళ్ళతో పాటు నా రామయ్యా, సీతమ్మా ఉంటే, కనుల పండువుగా ఉండేది !’’
‘‘అలాగే. నీ కోరికా నెరవేరుతుంది. తథాస్తు !’’ అన్నాడు కృష్ణుడు.
ఇంకేముంది ! అతని చేతిలోని మురళి ధనువైపోయింది. శ్రీకృష్ణుడు శ్రీరాముడైపోయాడు. సత్య సీతగా మారింది. మిగతా వారంతా శ్రీరామ పరివారమైపోయింది.
హనుమ ఆనందానికి అవధుల్లేవు.
‘‘రామ ! రామ ! రామసీత !’’ అంటూ భజన చేస్తూ, ఆ సీతారాముల చుట్టూ తిరుగసాగాడు. కాసేపయాక ...
‘‘హనుమా ! నీ భక్తులదొక చిన్నకోరిక తీర్చుతావా ?’’ అంటూ అడిగాడు రామునిగా మారిన కృష్ణుడు.
‘‘తప్పకుండా. అలాగే స్వామీ !’’ అంటూ చేతులు జోడించాడు హనుమ. నీవు రామకథా గానం చేస్తున్నావని తెలిసి, పనీ, పాటా మానేసి, నీ నోట రామకథ వినాలని పరుగెత్తుకు వచ్చారు వీరంతా !’’ అన్నాడు.
‘‘అలాగా ?’’ అంటూ, ఆనందభాష్పాల్ని కార్చాడు హనుమ.
‘‘అవును. అవును’’ అంటూ అరిచారు వారంతా.
‘‘తప్పకుండా స్వామీ ! ... కానీ, ఎక్కడిదాకా చెప్పానో గుర్తులేదే !’’ అంటూ బుర్రగోక్కున్నాడు.
‘‘శ్రీ సీతారాముల కల్యాణం దాకా !’’ అంటూ గుర్తుచేశాడు రామ వేషధారియైన కృష్ణుడు.
‘‘ఐతే, వనవాసంతో మొదలెట్టాలన్నమాట ! ... నా సీతారాములకి మళ్ళీ వనవాసమా ? ...’’ హనుమ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
‘‘అవును. ఐనా, వనవాసమైనా, బృందావనవాసమైనా, లోక కళ్యాణార్థమే కదా హనుమా ?’’
‘‘అవును స్వామీ ! ... వనవాసమే లేకుంటే నాకు శ్రీరామదర్శనం దక్కేదా ? ... నేను సీతానే్వషణ చేసేవాడినా ? ... రామ రావణ యుద్ధం జరిగేదా ? ... రాక్షసులు అంతరించేవారా ? ... నేను రాముని సేవలో తరించేవాడినా ? ... నాతోపాటు సుగ్రీవాదులూ, వానరులూ తరించేవారా? ఈ అఖండ భారతదేశం శ్రీరాముని ధర్మపరిపాలనను చవి చూసేదా?’’ ... అన్నాడు హనుమ ఆనందాశ్రువుల్ని కారుస్తూ !
‘‘యదార్థమే. నిజాన్ని గ్రహించావు నీవు హనుమా !’’
ఇంకా ఉంది