డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం (రెండవ భాగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్టే పాడుతున్నట్లూ, తన మాటల పత్రాల్ని రాల్చుతున్నట్లూ, తన పాటల పరీమళాల్ని వెద జల్లుతున్నట్లూ, పారవశ్యంతో తలనూపుతున్నట్లూ అనిపించింది అందరికీ.
కానీ, నేడో, తన పతిదేవుని కౌగిట్లో ! తన ప్రియసఖియలు తోడుగా! భక్తజన సందోహం మధ్య. ఆపై, ఆనందార్ణవంలో మునకలిడుతూ !
ఇంతకన్నా పారవశ్యం ఏముంటుంది ?
కృష్ణలీలలంటే అంతే మరి ! వాని లోతుపాతుల్ని తెలుసుకున్న వారెవరు ?
‘‘కృష్ణం వందే జగద్గురుం’’
*
5. సమాగమం
హనుమ
మళ్లీ రామకథనిలా చెప్పసాగాడు
తన కొడుకులకు పెండ్లి
తాను జరిపించి
కొడుకులూ కోడండ్రు
బంధుజనములతో
తరలి వెళ్లినాడు దశరథుండంత

ఆనంద లహరులే
ఆకసమునంట
ఒక పాలపుంతయే
వెడలె యనగా
పెళ్లి నడకల దేలి వెళ్ళె నారాజు

వాయువే మేఘాల
సాగనంపెడు రీతి
ఊరి పొలిమేరలకు
సొసనంపేను
ఆ రాజు జనకుండు జనరంజకుండు
రేతిరంతా వెలుగు
పంచిపెట్టిన చుక్క
ఉదయ సంధ్యనె
తాను తప్పుకొనినట్లు
సెలవు దీసికొనెను గాథేయుడంత

సప్తర్షి మండలమె
సాగెనోయనగ
ముందు వరసన మునులు
వెనక బాపలును
వారి వెనకనె నడిచె పరివారమంత

చేతులను హారతులు
కాంతుళ్లు చింద
కాంతి పుంజములట్లు
కాంతలేగేరు
వారి వెనకనె రాజు
అతని చుట్టును సేన

కైవార మనునట్లు
పరివారమొప్పె
ఇంద్రుండె దేవతల
కూడి వెడలేనొ
కదలెనో నాకమ్ము
ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087