డైలీ సీరియల్
జగదేకసుందరి క్లియోపాత్రా--92
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మనం త్వరలోనే ప్రమాదకరమైన స్థలాలను దాటిపోగలం!’’ అన్నదామె.
‘‘సరే! రాణీ!’’ అన్నాడు ఏంటనీ.
‘‘మరో ముఖ్య విషయం ఏంటనీ! ఈ రహస్యం ఎవ్వరికీ తెలియరాదు. నాకు ఆరోగ్యం సరిగా లేదనీ, ఈజిప్టుకు ప్రయాణం చేసేందుకు సన్నాహాలు చేయమనీ గత సాయంత్రమే ఆజ్ఞలిచ్చాను. అందరూ ఇది నిజమనుకుంటున్నారు. మన సైనిక బలాక్కూడా మనం పారిపొయ్యే ధోరణిలో ఉన్నామని తెలయకూడదు. మనం రోమన్ పలుకుబడి విస్తరించిన సముద్ర భాగాన్ని దాటేవరకూ చాలా జాగ్రత్తగా వుండాలి. ఈలోగా నీ సైన్యాధిపతులు ద్రోహం చేయకుండా చూసుకో!’’ అన్నదామె.
ఏంటనీ తీవ్రంగా ఆలోచించాడు. క్లియోపాత్రా మాటలు అతని బుర్రకు పదును పెట్టినవి.
‘‘ఔను రాణీ! నీవు ఎంత బాగా ఆలోచించావ్! ఈ సేనాపతులకు నా మీద గొంతువరకూ కోపమున్నది. నౌకాయుద్ధంలో వీరికి ప్రవేశం లేకపోయినా, వీరిని కూడా నా ఓడలోనే తీసుకువెళతాను. అప్పుడిక వారు ద్రోహం చేయలేరు; అందుకు ప్రయత్నిస్తే, మనకు తెలియకుండానూ పోదు!’’ అన్నాడు ఏంటనీ.
‘‘అలాగే చెయ్- ఏంటనీ! ఇక రుూ విషయంమీద మనం చర్చలు జరుపకూడదు. యుద్ధంలో మాత్రం అధైర్యపడవద్దు. మనకు మరికొన్ని అవకాశాలంటూ ఉండకపోవవు.. ఏంటనీ! మనిద్దరం ఒకర్నొకరు గాఢంగా నమ్మి, ప్రేమించుకోగలిగిననాడు, రుూ ప్రపంచమంతా ఏకమైనా మనకేమీ భయం ఉండదని గుర్తుంచుకో’’ అన్నదామె.
‘‘రాణీ! ఈ జన్మలోనే కాదు.. జన్మ జన్మాలకూ నీ అనురాగ సుధామృతాన్ని నాకు ప్రసాదించమని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాను’’ అన్నాడు ఏంటనీ.
ఏంటనీని గాఢంగా కావించుకొని ‘‘ప్రియా! మన రుూ కోర్కెను దేవతలు హర్షించి, మనకీ వరాన్ని ప్రసాదిస్తారు గాక!’’ అన్నదామె.
సూర్యోదయ సమయంలో ఏంటనీ క్లియోపాత్రా దగ్గర సెలవు తీసుకుని తన గుడారానికి జేరాడు. ఎంతో తేలికైన మనస్సుతో అలసిన శరీరానికి విశ్రాంతినిస్తూ హాయిగా నిద్రు ఉపక్రమించాడు.
28
మర్నాడు యుద్ధ సన్నాహాలు రెట్టింపు ఉత్సాహంతో జరిగినవి. శత్రువు ఏ క్షణంలోనైనా దెబ్బతీయవచ్చు. అయితే ఆచారం ప్రకారం, మర్నాటి ఉదయమే యుద్ధారంభమని ఆక్టోవియన్ పక్షంవారు కబురంపారు. నౌకాదళంలోని ప్రతి ఒక్కరూ చాలా హడావిడిగా ఉన్నారు. చిత్రం- ఈజిప్టు పతాకాలున్న నౌకలు అల్లంత దూరాన వున్నవి. వాటిమీద నావికులు చాలా ప్రశాంతంగా ఉన్నారు.
ఆ రాత్రి క్లియోపాత్రా తన అధీనంలో వున్న బంగారాన్నంతట్నీ రహస్యంగా తనమీదికి జేర్చింది. గుడారం బైటికి రానందున ఆమెను కులాసాగా లేదనే అందరూ అనుకున్నారు. అయితే బైట ఏం జరుగుతుందో ఆమెకు క్షణక్షణమూ తెలుస్తూనే వున్నది.
అర్థరాత్రి దాటాక ఏంటనీ ఆమె డేరాలోకి వచ్చాడు.
‘‘సన్నాహాలు పూర్తయినవా?’’ అన్నదామె.
‘‘అయినట్లే! రేపు సూర్యోదయంతోనే యుద్ధారంభం కదా!’’
‘‘ఔను.. సరే.. నేను చెప్పింది గుర్తున్నది కదా! ఇక వెళ్ళు.. తరువాత తీరిగ్గా మాట్లాడుకొందాం. నిజంగానే నాకు ఒంట్లో బాగోలేదు’’ అన్నదామె.
తనకెంతో ఉత్సాహాన్ని నూరిపోస్తుందనీ, ఈ రాత్రి ఆమెతో సుఖపడవచ్చనే ఆశతో ఏంటనీ వచ్చాడు. తీరా ఆమె ఎక్కువ మాట్లాడేందుక్కూడా నిరాకరించాక, నిరుత్సాహంగా వెనక్కు మళ్లాడు.
నిజంగానే ఆమె మనుస్స మనస్సులో లేదు. తనా తొందరపడి ఇంత వ్రమపడి ఇంత దూరం వచ్చినందుకు ఇపుడు పశ్చాత్తాపపడుతోంది. ఇంత గొప్ప సైన్యాన్ని రణరంగంలోకి నడపటానికి ఏంటనీ అసమర్థుడని ఆమె చాలా ఆలస్యంగా గ్రహించింది.
రణభేరి మోత మినహా వేరొకటి చెవుల్లోకి దూరకుండా ఉండగలవాడే నిజమైన సేనాని! కాని, ఏటనీ ఎవరు చెప్పిందానికైనా తల ఆడించటం, ఔనన్నది కాస్సేపటికి కాదనే తత్వం కలవాడు. జీవితమంటే తృణప్రాయంగా, చాలా తేలిగ్గా మాట్లాడేసే త్వమున్నవాడు. రెండు విరుద్ధ్భాప్రాయాలు ఎప్పుడైతే అతని మనస్సులో మెదులుతున్నవలో అప్పుడే అతను ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాల మీది డింగీలె ఊగిసలాడుతాడే కాని, ఎటూ నిర్ణయించుకోలేదు. అలాంటి ఏంటనీ తనకు సామ్రాజ్యాన్ని గెలిచిపెట్టలేడు సరికదా, తనకు ఆపత్ సమయంలో ప్రాణరక్షణ కూడా చేయలేడు. చివరకు అతని ప్రాణరక్షణా భారాన్ని కూడా తనే తీసుకోవలసి వచ్చింది కదా!
మనస్సంతా విచార మేఘంతో ఆక్రమితమైంది. మర్నాడు ఏవౌతుందో తనకు తెలుసు.. తన ఓడలు మధ్యధరా సముద్రంలో శీఘ్రగమనంతో ఈజిప్టు వైపు ప్రయాణవౌతవి. ఏంటనీ చేతులకు గాజులు వేసుకునేందుక్కూడా సిద్ధపడినవాడివలె, ఆముదం కారే మొహంతో, పరమ మూర్ఖునివలె తన పమిట చాటున దాక్కుంటాడు. ప్రియుడు తనకు లొంగాడని తాను సంతోషించాలో, లేక అసమర్థుడని ఏడవాలో తెలియక తాను తికమకపడుతుంటుంది.
అయితే, అంత మాత్రానికే తాను కుంగిపోవలసిన పనిలేదు. సగం ప్రపంచానికి తాను రాణి. రెండో సగాన్ని కూడా కబళిద్దామనుకున్నది. కాని, విధి పడనీయలేదు. తాను ఈజిప్టు వెళ్తుంది. బహుశా ఈసారి అటు పర్షియాను జయించవచ్చు, లేదా, ఉన్న రాజ్యానే్న జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ తన జీవితం ప్రశాంతంగా వెళ్లిపోతుంది. పోతే, తాను మాత్రం ఇప్పుడు రోమ్‌కు మరింత లోకువవుతుంది. రోమన్‌లు తనను జయించాలని ఈజిప్టుకు రావచ్చు. ఈ దాడికి తట్టుకునేందుకు తాను ఇప్పటినుంచే ప్రయత్నాలు చేయాలి. ఈ వెధవ దురాశ తన భావి మీద పెద్ద దెబ్బ తీసింది!
చప్పున ఆమెకు పిల్లలు గుర్తుకొచ్చారు. ఆమె హృదయం మాతృప్రేమతో నిండిపోయింది. ఇక్కడికొచ్చి సంవత్సరమైంది. పిల్లలు కులాసాగానే ఉన్నారనే వార్తలు వస్తూన్నవి. కాని, తాను వెనువెంటనే వాళ్ళను చూడాలని, వాళ్ళను హృదయానికి హత్తుకోవాలనీ తీవ్ర వాంఛతో ఆత్రుతతో ఆమె వణికిపోయింది.
తానేదో ప్రపంచాన్ని జయించాలని భ్రమపడుతూన్నది కాని, తన నలుగురు సంతానమూ తనకో ప్రపంచం కాదా? వాళ్ళను ఈజిప్టులో విడిచి తను రుూ సంవత్సరం పాటూ ఎలా ఒంటరిగా ఉండగలిగింది? వెధవ రాజకీయాల్లో పడి, సహజమైన అనురాగాన్ని కూడా మరిచిపోయిన కఠినాత్మురాలు తాను!
ఆమెకిప్పుడు అలెగ్జాండ్రియా రాజ్య ప్రాసాదమూ, తన నలుగురు పిల్లలే కనిపిస్తున్నారు. ఎంత త్వరగా రెక్కలు కట్టుకొని అక్కడ వాలితే తనకంత మనశ్శాంతి. మర్నాడు యుద్ధం ఏమన్నాకానీ గాక, తాను మాత్రం ఈజిప్టు వెళ్లిపోవాలి. తాను పుట్టి పెరిగిన మాతృదేశం మీద తనకు మమత ఏర్పడి, సర్వశక్తుల్నీ తనవైపు లాక్కోగలిగిన ఈజిప్టు తీరాలమీదనే ఆమె దృష్టిని కేంద్రీకరించింది. సూర్యోదయం కోసం ఉవ్విళ్ళూరుతూ ప్రయాణోత్సాహంతో, ఈ యుద్ధంలో తనకూ, ఏంటనీకి అపజయం కలుగబోతూన్నదనే విచారాన్ని కూడా దిగమింగగలిగిందామె.
- ఇంకాఉంది -