డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలపిస్తూ పిచ్చిదానిలాగా కన్పిస్తూ సగం చీరతో తేజోహీనమై ఉన్న ఆమెను చూచి కొందరు భయపడ్డారు. కొందరు హేళనగా నవ్వారు. కొందరు దయతో ఆమెను ఇలా అడిగారు.
‘‘కల్యాణీ! నీవు ఎవరవు? దేనికోసం వెతుకుతున్నావు? నీవు మానవకాంతవా? లేక శాపగ్రస్తమైన దేవకాంతవా? నిన్ను చూసి మేమంతా బాధపడుతున్నాము. మేము నిన్ను శరణు కోరుతున్నాము. మాకు చెడు జరుగకుండా కాపాడు’’.
వ్యాపారులు ఇలా ప్రార్థించగా దయమంతి వారికి ఇలా చెప్పింది. ‘అయ్యలారా! మీరు నన్ను మానవకాంతగానే భావించండి. నేనొక మహారాజు పుత్రికను, ఇంకొక మహారాజు భార్యను. భర్తను వెతుకుతూ ఇలా అరణ్యంలో తిరుగుతున్నాను. నేను విదర్భరాజ తనయను. నిషధరాజైన నలమహారాజు పట్టమహిషిని. నా భర్తను గురించి మీకు తెలిస్తే చెప్పండి’’.
ఆ వ్యాపారుల సమూహానికి నాయకుడైన శుచి ఆమెతో ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ ఆ పేరు గల వానిని నేను చూడలేదు. ఈ అరణ్యంలో కౄరమృగాలను తప్ప ఇంకొక మనష్యుని చూడలేదు’’.
దయమంతి వారు ఎక్కడికి వెళ్తున్నారో అడుగగా వారు చేదిదేశము వెళ్తున్నామని చెప్పారు. దయమంతి వారితో కలిసి వెళ్లింది. కొన్ని రోజులు ప్రయాణం చేసి ఆ వ్యాపారులు ఒక చెరువు దగ్గరకు చేరి అక్కడే విశ్రమించారు. అర్ధరాత్రి ఏనుగుల గుంపు ఆ చెరువు దగ్గరకు నీటికోసం వచ్చి ఆ సార్థవాహులకి సంబంధించిన ఏనుగులను చూసి వాటిని చంపాలనే కోరికతో వాటిపైకి ఉరికాయి. ఆ అడవి ఏనుగులు నిద్రిస్తున్న ఆ వ్యాపారులను తొక్కివేశాయి. చాలామంది వాటి తొండాలకు చిక్కారు. ప్రాణరక్షణ కోసం చెట్లు ఎక్కిన కొంతమంది వాటి మీదనుంచి పడిపోయారు. వ్యాపారుల గుంపు అంతా సర్వనాశనమైపోయింది. వారు తెచ్చిన రత్నరాసులు చెల్లాచెదురై పోయాయి. ప్రాణాలు దక్కించుకొన్న కొందరు సంపదనంతా అక్కడే వదలి భయంతో పరుగులు తీశారు.
వారిలో కొంతమందికి ఇంకొక ఆలోచన కలిగింది. పిచ్చిదానిలా వికృతరూపంతో ఆ స్ర్తి తమ గుంపులో చేరిన తర్వాతే ఇలాంటి దారుణం జరిగింది. ఆమె మానవకాంత కాదు రాక్షసియో, పిశాచియో అయి ఉంటుంది. కనుక ఈమెను కర్రలతో, రాళ్లతో కొట్టి చంపాలి. వారు మాట్లాడుకుంటున్న మాటలు విన్న దమయంతి అడవిలోకి పరుగెత్తింది.
ఆమె ఇలా చింతించింది. ‘‘నేను ఎవరికీ హాని తలపెట్టలేదు. అయినా నా దురదృష్టం ఇలా జరిగింది. ఇదంతా నా పూర్వజన్మలో చేసిన మహాపాపం. స్వయంవరంలో దిక్పాలకులను కాదని నలుని భర్తగా వరించడం వలన ఇలా జరిగిందా? ఇలా బాధపడుతూ చనిపోగా మిగిలిన వ్యాపారులతో కలిసి నడుస్తూ సాయంకాలానికి సుబాహుని యొక్క నగరంలో ప్రవేశించింది. తైలసంస్కారం లేక చిందరవందరగా ఉన్న జుట్టుతో సగం చీర ధరించి పిచ్చిదానిలాగ ఉన్న ఆమెను పురవాసులు చూసి ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయారు. ఆమె చుట్టూ జనం మూగారు. అలాగే ఆమె రాజగృహం చేరింది.
రాజభవనం మేడమీద నుండి రాజమాత జనం మధ్య ఉన్న దమయంతిని చూసి పరిచారికతో ఆమెను తన దగ్గరకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించింది. ఆ పరిచారిక వెళ్లి జనాన్ని వారించి దమయంతిని రాజమాత దగ్గరికి తీసుకొనిపోయింది. అప్పుడు రాజమాత పిచ్చిదానిలాగ ఉన్న దమయంతిని చూచి ఇలా ప్రశ్నించింది - ‘‘ఏ అలంకారాలు లేకున్నా లక్ష్మిలాగ ఉన్న నీవు ఎవరమ్మా? నీవు ఏ విధంగా భయపడనక్కరలేదు’’.
ఆ మాటలు విన్న దమయంతి ఇలా అంది. ‘‘్భర్తని అనుసరించే మానవకాంతను. సైరంధ్రిని. నా భర్త నన్ను సదా అనుసరిస్తాడు. నేను కూడ పతియందు భక్తి కలదానను. దురదృష్టం చేత నా భర్త జూదంలో సర్వం పోగొట్టు కొని అడవుల పాలయ్యా డు. తన స్థితికి మనసు చెడిన అతనితో అరణ్యానికి రాగా ఏ కారణం చేతనో అతను విరక్తితో నన్ను విడిచి వెళ్లాడు. అతన్ని వెతుక్కుంటూ నేను ఇలా దుఃఖంతో ఉన్నాను’’.
దమయంతి మాటలు విని దయతో రాజమాత ఇలా అంది. ‘‘అమ్మా! నీవు ఇక్కడే ఉండు. నా పరివారం నీ భర్తకోసం వెతుకుతారు. లేదా అతనే నీ దగ్గరకు వెతుక్కుంటూ రావచ్చు.’’
అప్పుడు దమయంతి ఇలా అంది. ‘‘తల్లీ! నేను మీ దగ్గర కొన్ని షరతులపై మాత్రమే ఉంటాను. నేను ఎవరి ఎంగిలి తినను. పరపురషులతో మాట్లాడను. ఎవరైనా కోరితే వానిని మీరు కఠినంగా శిక్షించాలి. నా భర్తను వెదకడానికి బ్రాహ్మణులనే పంపాలి. వీటికి మీరు ఒప్పుకుంటేనే నేను మీ దగ్గర ఉంటాను. ఇంకొక విధంగా అయితే ఉండను’’.
రాజమాత ఆమె మాటలకు ఒప్పుకొని తన కుమార్తె సునందను పిలిచి ‘‘ఈమె సైరంధ్రి. దేవరూపిణి. ఇకపై నీకు సఖిగా ఉంటుంది’’ అని చెప్పింది.
సునంద ఆమెను తీసుకొని తన అంతఃపురానికి వెళ్లింది. దమయంతి అక్కడ ప్రశాంతంగా కాలం గడుపుతోంది.
నలుడు అరణ్యంలో తిరుగుతూ భయంకరమై విజృంభిస్తున్న కార్చిచ్చును చూశాడు. ఆ మంటల్లోంచి ఎవరివో అరుపులు విని అతను ఆ మాటలలోకి దూకి అక్కడ ప్రాణభయంతో ఉన్న నాగరాజును చూశాడు. అతను చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. ‘‘మహారాజా! నేను కర్కోటకుడనే నాగరాజును. తపస్వియైన నారదమహర్షిని కాటు వేయగా అతను నన్ను కదలకుండా పడి ఉండమని శపించాడు. ఆ శాపం నలుడు నా దగ్గరకు వచ్చేదాకా ఉంటుందని తెలిపాడు. నీ దర్శనం నాకు శాపవిముక్తి కలిగిస్తుంది’’ అని చెప్పాడు. ‘‘దయచేసి నన్నిక్కడినుండి తీసుకొని పో. నారదుని శాపం వల్ల కదల్లేను. నీవు నన్ను రక్షించు. నీకు మేలు చేస్తాను’’ ఇలా అతను బొటనవ్రేలంత చిన్నగా అయ్యాడు. నలుడు అతనిని సురక్షిత ప్రాంతానికి చేర్చాడు.
కర్కోటకుడు నలునితో ఇలా అన్నాడు.
‘‘మహారాజా! మీరు అడుగులు లెక్కిస్తూ నన్ను తీసుకొని వెళ్లండి. మీకు మేలు చేస్తాను’’.
నలుడు అడుగులు లెక్కపెడుతూ పదవ అడుగు దగ్గర ‘దశ’ అని అనగానే కర్కోటకుడు అతన్ని కాటు వేశాడు. వెంటనే నలునికి వికృతరూపం వచ్చింది. అప్పుడు అసలు రూపంలో ఉన్న కర్కోటకుడు అతన్నిలా ఓదార్చాడు. ‘‘మహారాజా! నీ నిజరూపం ఎవరికీ తెలియకూడదనే ఈ పని చేశాను. నీకు మంచిరోజులు వచ్చినప్పుడు ఈ రూపం పోయి అసలు రూపం వస్తుంది. ఇకపై నీకు పాముల వల్ల, శత్రువుల వల్ల భయం ఉండదు. నీకు విషం ఎక్కదు. నీవు బాహకుడు అనే పేరుతో ఋతుపర్ణ రాజు వద్ద రథసారథిగా చేరు. అతను నీకు మంచి మిత్రుడు అవుతాడు. అతడు నీకు అక్షహృదయాన్ని అనుగ్రహిస్తాడు. దానివలన నీవు భవిష్యత్తులో విజయం పొందుతావు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి