డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -107

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం కాయవ్యుడు అనే ఎరుకలవాడు ఉండేవాడు. అతను వృత్తి చేత దోపిడీదొంగ. కాని నిజజీవితంలో అతను బుద్ధిమం తుడు, శూరుడు, చదువుకున్న వాడు, కౄరత్వం లేనివాడు. అతనికి నాలుగు వర్ణాశ్రమాలలో ఉన్న ధర్మాల గురించి క్షుణ్ణంగా తెలుసు. బ్రహ్మజ్ఞానం కలవాడు. గురువులను పూజించే వాడు. అతను ఒక క్షత్రియునికి, నిషాదికి జన్మించాడు. కనుక క్షత్రియ ధర్మాలను చక్కగా నిష్ఠతో పాటించే వాడు. కనుక అతను దస్యుడయినా సిద్ధి పొందాడు. అతను ప్రతిదినం ఉదయం సాయంత్రం సమయాలలో అరణ్యమృగాలను ఉత్తేజపరిచేవాడు. అతనికి వివిధ జాతుల మృగాల స్వభావాలన్నీ చక్కగా తెలుసు. అందరి ఆటవికులలో అతను నిపుణుడు. అతనికి ఆ అరణ్యంలో అన్ని ప్రదేశాలు వాటి మార్గాలు క్షుణ్ణంగా తెలుసు. అన్ని ప్రాణుల ధర్మాలు తెలుసు. అతను వందలకొద్దీ సైన్యాన్ని ఒక్కడే గెలువగలడు. అతను అరణ్యంలోనే ఉన్న వృద్ధులైన తన తల్లిదండ్రుల సేవ, పూజ చేసేవాడు. వారికి రకరకాల మాంసాలు, పండ్లు, తేనె ఆహారంగా పెట్టేవాడు. వారితో పాటు ఇంకెవరైనా పెద్దలు ఉంటే వారినీ ఆదరించేవాడు. వారికీ పరిచర్యలు చేసేవాడు. అరణ్యంలో ఉండే తాపసులు, సన్యాసుల దగ్గరికి వెళ్ళి వారినీ సేవించేవాడు. ఎవరైనా అతను దొంగ కనుక అతని సొమ్ము తమకి అక్కర్లేదని తీసుకోకపోతే, రాత్రిపూట వారి గృహాలలో ఆహారపదార్థాలు పెట్టి వెళ్లిపోయే వాడు.
అతని గుణగణాలకు ముచ్చటపడి ఎంతోమంది దొంగలు అతన్ని నాయకునిగా ఎన్నుకున్నారు. వారు అతనితో ఇలా అన్నారు ‘‘దేశ, కాల, పరిస్థితుల గురించి నీకు క్షుణ్ణంగా తెలుసు. నీవు శూరుడవు. నీవు మాకు నాయకునిగా ఉండి మమ్మల్ని తల్లీ దండ్రి లాగా కాపాడు. మేము ఎలా నడుచుకోవాలో మాకు చెప్పు!’’.
అప్పుడు కాయవ్యుడు వారితో ఇలా అన్నాడు ‘‘స్తల్రను, భయపడినవారిని, చిన్నపిల్లలను, తాపసిని, మనతో యుద్ధం చెయ్యని వానిని చంపకూ డదు. ఎప్పుడూ బ్రాహ్మణుల హితం కోరాలి. వారి కోసం పోరాడాలి. ఎక్కడ దేవతలు, పితృదేవతలు, అతిథులు పూజింపబడుతారో అక్కడ పూజార్హమైన ద్రవ్యాలను అపహరించి ఆ కార్యాలకు విఘ్నం కలిగించ కూడదు. అన్ని ప్రాణులలోను బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని కనుక మోక్షార్హత కలవాడు. వారికి మన దగ్గర ఉన్నది అంతా ఇచ్చి అయినా అభివృద్ధి కలిగించాలి. బ్రాహ్మణులను నిందిస్తూ వారి నాశనాన్ని కోరేవాడు తప్పక పరాభవం పొందుతాడు. వారు ఎవరినైనా కోపిస్తే వానిని ఎవ్వరూ రక్షించలేరు. ఎవరైనా మనకు ఇవ్వవలసింది ఇవ్వకపోతే వారి ఇంటిపై దాడి చేయవచ్చు. దండో పాయం ద్వారా సంపద పెంచుకో కూడదు. తమ ఉన్నతి కోసం దేశం యొక్క అభివృద్ధిని ఎవరైతే అడ్డుకుం టారో వారు శవంలోని పురుగుల్లాగ నశిస్తారు. దొంగలు అయినా ఎవరు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటే వారు తప్పక సిద్ధి పొందుతారు’’.
నాయకునిగా కాయవ్యుని ఆదేశాలను ఆ దొంగలు అందరూ ఆచరించారు. దాని వలన వారు అభివృద్ధి పొందారు. పాపకర్మలను మానివేశారు. కాయవ్యుడు నాయకునిగా ఈ కార్యాలలో సాధు జనులకు క్షేమాన్ని కలిగిస్తూ తన అనుచరులైన దొంగలను పాపం నుండి నివారిస్తూ గొప్ప సిద్ధిని పొందాడు. ఇదీ కాయవ్య చరిత్ర.

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి