డైలీ సీరియల్

క్షమ లేకపోతే..(నృగమహారాజు -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందులో నీ గోవులు ఉండడానికి వీలులేదు కదా ’అన్నాడు.
అట్లా వారిద్దరి మధ్యా వివాదం తలెత్తింది. మనిద్దరం మాటామాటా అనుకోవడం ఎందుకు మన సమస్యను రాజు దగ్గరకు తీసుకొని వెళ్దాం అనుకొన్నారు.
అలా ఆ విప్రులిద్దరూ నృగమహారాజు దగ్గరకు వెళ్లారు. తమకొచ్చిన సమస్యను వివరించారు. నృగమహారాజు అసలు ఆ సమస్యకు తానే కారణమని తెలుసుకొని ఎంతో చింతించాడు. ఎంతో దుఃఖించాడు. ఆతరువాత వారిద్దరినీ తనను క్షమించమని కోరుకున్నాడు. కశ్యపుడిని తెలియక తప్పు చేశాను. దానం ఇచ్చిన గోవునే తిరిగి వేరొకరికి ఇచ్చాను. కనుక ఇపుడు ఆ చేసిన తప్పును సరిదిద్దుకుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీకు లక్ష గోవులను ఆ గోవుకు బదులుగా ఇస్తాను స్వీకరించండి అని అడిగాడు. ఆ కశ్యపుడు దానికి ఒప్పుకోలేదు. దానం స్వీకరించిన మరొక విప్రుని దగ్గరకు వెళ్లి ‘అయ్యా! మీరు రోజులుహాయిగా గడపడానికి కదా నాదగ్గర గోవును దానంగా పుచ్చుకున్నారు. మీకు సౌఖ్యవంతమైన జీవితం ఉండేలాగు నేను కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. ఇపుడు మీరు తీసుకొన్న గోవును నాకు తిరిగి ఇవ్వండి. దానిబదులుగా నేను మీకోరింది ఇస్తాను. లేదంటే లక్ష గోవులను ఇస్తాను’అని ఎంతో వినయంగా అడిగాడు.
కాని ఆ విప్రుడు ఇది చాలా బాగుంది. నీవు ధనవంతుడివని, రాజు వని మమ్ములను తక్కువగా చూస్తున్నావా? మేము అంటే బ్రాహ్మణులు నీకు ఏది ఇచ్చిన తీసుకొనేవారిలాగా ఆశపోతుల్లాగా కనిపిస్తున్నామా? మీ ధనం గోవులు నీ దగ్గరే పెట్టుకో.
నేను కేవలం ఈ గోవును దానంగా స్వీకరించాను కనుక దీనిని మాత్రమే తీసుకొంటాను కానీ నాకు మరో గోవెందుకు? సౌఖ్యమైన జీవితం నాకెందుకు? నేను కేవలం ధర్మపథంలో నడిచేవాడిని. నాకు అన్నీ ఆ దేవాదిదేవుడే ఇస్తాడు. నేను కేవలం ఒక ప్రదేశానికి రాజువి మాత్రమే. ఆ దేవాదిదేవుడు అఖిల భువనాలకు రారాజు అని ఆగ్రహించాడు. ఆ మాటలు విని ఏంచేయలేక మరలా కపిలుడినే బతిమాలాడు.
కానీ ఆయన కూడా విప్రులను చులకనగా భావిస్తున్నావు అంటూ ఆగ్రహించి వెళ్లిపోయాడు.
అట్లా ఆ విప్రులిద్దరూ ఒక్క గోవు కోసం గొడవపడి మనోవేదనతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
కాలం ఎప్పటిలాగే గడిచిపోయింది. కాలం తీరి నృగమహారాజు యమధర్మరాజు దగ్గరకు చేరుకున్నాడు. అపుడు ఆ యముడు ‘రాజా! నీవుఅనేక వేల పుణ్యకార్యాలను చేశావు.దాని వలన నీకు స్వర్గసౌఖ్యాలు లభిస్తాయి. కాకపోతే విప్రులను బాధపెట్టావు. ఇచ్చిన గోవునే తిరిగి దానం ఇచ్చావు కనుక నీవు పాపఫలం కూడా అనుభవించాల్సి వస్తుంది. మొదట నీవు పాపఫలాన్ని అనుభవించు. దాని తరువాత పుణ్యఫలాలను అనుభవిద్దుగానీ అని చెప్పాడు. ఆ పాపఫలితం ఎలా పోగొట్టుకోవచ్చు అని నృగుడు అడిగితే ఒక మహావిష్ణువు ద్వాపరంలో కృష్ణుడుగా అవతరిస్తాడు.
ఇంకావుంది...

డా. రాయసం లక్ష్మి