డైలీ సీరియల్

అజామీళుడు -4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతడు మంచి పనులెన్నిటినో చేశాడు. ఇంద్రియాలను జయించి శాంత చిత్తుడై ధర్మమార్గాన నడుస్తూ వేదాలను చదువుకున్నాడు. సర్వదా గురువులనూ, పెద్దలనూ, అతిథులను ఆశ్రయించి సేవలు చేసేవాడు. సర్వ జీవులయందు సమబుద్ధి తో ప్రవర్తించేవాడు. సత్య సంధుడై నిత్యకృత్యాలను చేస్తుండేవాడు. కాని విధి వశాత్తు ఇతనిలో వనోద్రేకంలో కావోన్మాదం కలిగింది. అద్దాని వల్లే ఇతడు ఆ వెలయాలి కామోన్మాదం లో పడిపోయాడు. అపుడే కులాచార మర్యాదలను కూలద్రోశాడు, తండ్రిగారు సంపాదించిన ఆస్తి నంతా ఆ వెలయాలికి ఇచ్చివేశాడు. సాధులక్షణాలను, సద్గుణాలను అన్నింటినీ మరిచాడు. ఇంటి వద్ద ఉన్న భార్యను సైతం మరిచిపోయాడు,. కేవలం తన సుఖంకోసమే ఇక్కడే పడి ఉన్నాడు ’అని విష్ణుదూతలు అంటుండగానే
‘మేమూ అదే చెప్పేది ఇతడు పాపాత్ముడు, కుటిలచిత్తుడు, సజ్జన కంటకడు ధూర్త్ఢు కనుకనే మీరు దూరంగా తొలుగుడు . మేము బలవంతంగా బంధించి ఇతడిని తీసుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాము’అని అన్నారు. ‘ఆగండి ఆగండి ఇక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు. ఇతడు మీరు చెప్పినట్లే కుటిల చిత్తుడే. కానీ ఇపుడు చూడండి. ఇతడు ఎంత పరివేదన చెందుతున్నాడో, ఎంత పశ్చాత్తాపం పొందుతున్నాడో మీరు పాపులను శిక్షించి శిక్షించి మంచివారిని గుర్తించలేని వారయ్యారు. మీలో యుక్తాయుక్త విచక్షణ నశించినట్లు అనిపిస్తోంది. భగవంతుని నామ సంకీర్తనలు, బ్రహ్మ హత్య మొదలైన పాపాలనే దహించివేస్తాయికదా. భగవన్నామ కీర్తనలు బంగారాన్ని దొంగలించడమే పాపాన్ని కూడా క్షయింపచేస్తుంది. నారాయణ నామసంకీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలుబ్రహ్మలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు. అటువంటి నామాన్ని ఈ అజామీళుడు మరణ కాలంలో అమృతపలుకుల్లా పలికాడు. అతడేవిధంగా భావించినా అతని నోటి నుంచి మాత్రం నారాయణుని నామమే వచ్చింది.
అంతేకాదు పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తాలను, చిన్న పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తాలను మన పెద్దలు నిర్ణయించి ఉన్నారు కదా. అయినా ఏ ప్రాణినైనా పరిశుద్దం చేయడానికి కేవలం ఒక్క భగవంతుని నామమే చాలు కదా. భగవంతుడంటే ఎవరో ఏమిటో తెలియని మూఢుడు కూడా భగవంతుని నామాన్ని పలికినట్లయితే అగ్ని గాలితో కూడా గడ్టిని కాల్చివేసినట్లుగా అతని పాపాలన్నీ పటాపంచలు అవుతాయికదా. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాల్చినట్లుగానే హరినామం తెలిసి కానీ తెలియక కానీ పలికితే ఆ పుణ్యం ఊరకనే పోదుకదా.
అంత్యకాలం సమీపించిన ధైర్యం సన్నగిల్లినపుడు పూర్వజన్మ పుణ్యవిశేషం ఉంటేకాని ఏ జీవి పరాత్పరుని నామం తలుచుకోలేడు. పురాకృత సుకృతం వల్లనే ఇతడు నారాయణ నామోపాయసం సేవించాడు. అసలు మనుష్యులుగా పుట్టినవాళ్లు వారి పిల్లలకు హరి నామాలను వారి అంత్యసమయంలోను పిలవడానికి వీలుగా ఉంటుందనే కదా పెట్టుకుంటుంటారు.

- ఇంకాఉంది