అదిలాబాద్

కలెక్టరేట్ ఎదుట పంచాయతీల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ , నవంబర్ 20: గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటియు జిల్లా నాయకులు మసి ఉల్లాఖాన్ అధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గ్రామపంచాయతీ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిండంతో పాటు పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం చేపట్టిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు సమ్మెవేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనంతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ వర్కర్స్‌కు ప్రతినెల వేతనాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బయమ్మ, శశికల, గంగామణి, గంగన్న, సాయన్న తదితరులు పాల్గొన్నారు.