అంతర్జాతీయం

ట్రంప్ గెలిస్తే కొంప కొల్లేరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే జిహాదీ తరహా ముప్పు
బ్రిటీష్ ఆర్థిక విశే్లషణ సంస్థ హెచ్చరిక

లండన్, మార్చి 17: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే మొత్తం ప్రపంచానికే ప్రమాదమని బ్రిటన్‌కు చెందిన పరిశోధనా సంస్థ ఇఐయు హెచ్చరించింది. ప్రస్తుతం జిహాదీ తీవ్రవాదం ఎంతగా ముప్పును రగిలిస్తుందో ట్రంప్ ఎన్నికల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతగానూ నష్టం వాటిల్లితుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏ ఏ కారణాల వల్ల ముప్పు వాటిల్లుతుందో విశే్లషించే ఈ సంస్థ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపడితే మాత్రం అన్ని విధాలా ప్రమా దం తేల్చింది. ఇప్పటికే ట్రంప్ ప్రసంగాలు, మాటలను బట్టి చూస్తే ఆయన పూర్తిగా చైనాపట్ల మొగ్గుచూపుతున్నట్టు అర్థమవుతోందని ఇఐయు పేర్కొంది. అలాగే జిహాదీ తీవ్రవాదం విషయంలో ఆయన చేస్తున్న ప్రకటనలు కూడా కల్లోలాన్ని రేకెత్తిస్తున్నాయని తెలిపింది. ముఖ్యంగా ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించాలన్న ఆయన వ్యాఖ్యలు జిహాదీ గ్రూపులకు ఊతాన్ని ఇవ్వడమేనని హెచ్చరించింది. అలాగే ట్రంప్ అధ్యక్షుడైతే వాణిజ్య పరమైన యుద్ధాలుకూడా జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆయన విధానాలు ఇందుకు ఆస్కారం ఇచ్చేవిగా ఉన్నాయని సం స్థ స్పష్టం చేసింది. ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్యం పట్ల తన వ్యతిరేకతను చాటిచెప్పిన ట్రంప్ చైనా కరెన్సీ విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా వి వాదాస్పదమయ్యాయని సంస్థ వెల్లడించింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే చోటుచేసుకునే అవకాశం ఉన్న పరిణామాలు విశే్లషించిన ఈ సంస్థ ఆయన అంత తేలిగ్గా డెమోక్రట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించే అవకాశం లేదని కూడా ఇఐయు స్పష్టం చేసింది.