తూర్పుగోదావరి

ఓటుకు నోటు కేసులో పస లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 1: ఓటుకు నోటు కేసుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అయితే ఈకేసులో ఎలాంటి పస లేదని టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 2020 నాటికి ఎపిని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు అభివృద్ధిని నిరోధించేలా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబును అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అయితే ప్రజలకు చంద్రబాబుపై అపారనమ్మకం ఉందన్నారు. దేశవ్యాప్తంగా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వస్తే ఒక్క ఎపికే 40వేల కోట్ల పెట్టుబడులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధించారని గన్ని పేర్కొన్నారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ విధ్వంసకారుడిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణంపై వక్రభాష్యం చెబుతున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఈమేథావులంతా ఏం చేశారని నిలదీశారు. ఉండవల్లి చివరి వరకు రాష్ట్ర విభజన చెల్లదని మభ్యపెడుతూ వచ్చారన్నారు. అభివృద్ధికి అడ్డుపడకుండా నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని గన్ని విజ్ఞప్తి చేశారు. అధికారుల నిర్వాకం వల్ల ప్రభుత్వం అప్రతిష్టపాలవుతోందని గన్ని విమర్శించారు. పుష్కరాలరేవులో గణపతి నవరాత్రి ఉత్సవాలను అడ్డుకున్న అధికారులు చివరకు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా నగరంలో విచ్చిలవిడిగా మద్యం, మాంసం అమ్మకాలు సాగినా అధికారులు అడ్డుకోలేకపోయారని దుయ్యబట్టారు. కరవు ప్రభావిత ప్రాంతాలకు బలవంతంగా ట్యాంకర్లు పంపే ప్రయత్నం చేసి, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు ప్రయత్నించారన్నారు. కొత్తగా చేరిన నాయకుల వల్ల సీనియర్ నాయకులు, కార్యకర్తలకు పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యతపై కొంత బాధ ఉందన్నారు. ఈవిషయమై యువనేత లోకేష్‌తో చర్చించానని, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా చర్చిస్తానని గన్ని చెప్పారు. పదవులు, ప్రాధాన్యత విషయంలో అభద్రతాభావానికి లోనవ్వాల్సిన అవసరం లేదని గన్ని భరోసా ఇచ్చారు.