తూర్పుగోదావరి

గూడాలలో చెరువు తవ్వకాలను అడ్డుకున్న మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, సెప్టెంబర్ 8 : అల్లవరం మండలంలోని గూడాల మట్టపర్తివారి పాలెంలో రొయ్యలచెరువులు తవ్వుతుండగా స్థానికులకు పొలం యజమానుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయ్యడంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. గూడాల మట్టపర్తివారిపాలెం సమీపంలో అదే గ్రామాని చెందిన పట్టెం సాయిరాం అనే రైతుకు చెందిన వరి పొలాన్ని రొయ్యల చెరువుగా మార్చేందుకు పొక్లయినర్‌ను గురువారం తీసుకువచ్చాడు. అయితే ఇక్కడ ఉప్పునీటి రొయ్యలచెరువు తవ్వితే బావుల్లోనీరు ఉప్పునీరుగా మారిపోయి తాగునీటికోసం అవస్థలుపడాల్సి వస్తుందని స్థానిక మహిళలు, పిల్లలు సుమారు 100 మందికిపైగా తవ్వకాలను అడ్డుకున్నారు. రొయ్యలచెరువులు తవ్వుకొనేందుకు ప్రభుత్వం తమకు అనుమతి ఇచ్చిందని చెరువులు తవ్వడం అపేది లేదని రైతు చెప్పడంతో స్థానికులకు, యజమానులకు మధ్య వివాదం తలెత్తి ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. చెరువులు తవ్వితే ఇక్కడే నిప్పంటించుకుని చనిపోతామని స్థానిక మహిళలు చెరువు తవ్వకం వద్ద కిరోసిన్ డబ్బాలతో భీష్మించుకొని కూర్చున్నారు. అల్లవరం ఎస్సై కె ప్రశాంతకుమార్‌కు ఇక్కడ విషయం తెలియడంతో ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చెరుకొని చెరువు తవ్వకాలను నిలుపువేశారు. చెరువు వద్దే స్థానికులు వంటావార్పు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.