తూర్పుగోదావరి

జిల్లాలో విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 22: భారీ వర్షాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌కు సూచించారు. గురువారం ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రం కాకినాడ నుండి పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ప్రస్తుతం జిల్లాలో ప్రమాదకర పరిస్థితుల్లేవని, రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించలేదని చెప్పారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసుకుని, కలెక్టర్ సహా జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓలు ఎప్పటికపుడు పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వర్షాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతూ చెరువులు, స్లూయిజ్‌లను పరిశీలించి, గండ్లు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గేట్లను కండిషన్‌లో ఉంచి సమస్యలకు అవకాశం లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. గురువారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు పడగా, జిల్లా కేంద్రం కాకినాడలో వర్షం తీవ్రత తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి గంటకు 45నుండి 50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. తీర, డెల్టా ప్రాంతాల్లో ఆర్డీ ఓలు, తహశీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. తుపాను పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా నిఘా ఏర్పాటుచేశారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, ముంపు కాలనీల్లో అవసరమైతే సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, ఏజన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తంగా ఉండాలని మండల, డివిజన్ స్థాయి అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.