తూర్పుగోదావరి

ఘర్షణల నివారణకు శాంతి కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాట్రేనికోన, సెప్టెంబర్ 23: మత్స్యకార గ్రామాల్లో కొట్లాటలు, ఘర్షణలు అరికట్టేందుకు శాంతి కమిటీలను నియమిస్తున్నట్లు ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కాట్రేనికోన పోలీసు స్టేషను రికార్డులను అయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ హింసాత్మక సంఘటనలకు పాల్పడితే ఎంతటివారినైనా సహించేది లేదని, రౌడీషీటర్లు తెరుస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో పోలీసులు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు జనమైత్రి సదస్సులు, ఫ్రెండ్లీ పోలీసు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శాంతి కమిటీల వల్ల గ్రామాల్లో కులపరమైన గొడవలు నివారించవచ్చన్నారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గినా సైబర్ నేరాలు పెరిగాయని, వీటి నివారణకు చర్యలు చేపట్టామన్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఖాళీలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుమన్నారు. స్థానిక ఎస్సై జానీ భాషా పనితీరు ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉందన్నారు. ఎస్పీ వెంట అమలాపురం డి ఎస్పీ ఎల్ అంకయ్య, ముమ్మిడివరం సిఐ కెటివి రమణారావు, ముమ్మిడివరం ఎస్సై నాయుడు పాల్గొన్నారు.