తూర్పుగోదావరి

‘దీన్‌దయాళ్’తో గ్రామాల్లో విద్యుద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 26: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పధకం ద్వారా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలుగ్రామాల్లో నూతనంగా సబ్‌స్టేషన్లు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని కాకినాడ పార్లమెంట్ సభ్యుడు, జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్ తోట నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు. దీన్‌దయాళ్ పధకం ద్వారా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో విద్యుత్ కష్టాలు తీర్చేందుకు నిధులు విడుదల చేయాలని సంబంధిత కేంద్రమంత్రితోపాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేయడం జరిగిందన్నారు. దీంతో కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో 10 నూతన సబ్‌స్టేషన్లు నిర్మించేందుకు నిధులు విడుదలయ్యాయని చెప్పారు. నూతనంగా సబ్‌స్టేషన్ల నిర్మాణం పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామం నందు సబ్‌స్టేషన్ నిర్మాణానికి 1.91కోట్లు, యు కొత్తపల్లి మండలం కోనపాపపేటలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి 1.5కోట్లు, పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి 1.47కోట్లు, తొండంగి మండలం అన్నాయిపేటలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి 1.85కోట్ల రూపాయలు నిధులు విడుదల అయ్యాయని తెలిపారు. అదే విధంగా తుని మండలం కెఒ మల్లవరంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి 80లక్షలు విడుదల అయినట్లు పేర్కొన్నారు. ఈసబ్‌స్టేషన్ల నిర్మాణానిక ఇప్పటకే స్థలసేకరణ పూర్తయిందని త్వరలో టెండర్లు ఖరారుచేసి పనులను ప్రారంబిస్తారని ఆయన తెలియజేశారు. అదే విధంగా స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడ నగరంలో విద్యుత్ కష్టాలు తొలగించడానికి ఇంటిగ్రేటెడ్ పవర్ డవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వాసుపత్రిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి 3కోట్లు, సాగర తీరం కుంభాభిషేకం ప్రాంతంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి 1.026కోట్లు, ఆనందభారతి వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణానికి 1.026కోట్లు, పెద్దాపురం మహారాణి కళాశాల వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణానికి 1.026కోట్ల రూపాయలు విడుదల అయినట్లు ఎంపి నరసింహం పేర్కొన్నారు. అదే విధంగా తుని మండలం తాండవ వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణానికి 0.82కోట్లు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. దీన్‌దయాళ్ పధకం ద్వారా ఆగస్టు నాటికి 6.63కోట్ల వ్యయంతో గ్రామాల్లో 4వేల 621విద్యుత్ కనెక్షన్లను ఇవ్వడం జరిగిందని, భవిష్యత్‌లో మరిన్ని నిధులను సేకరించి గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తానని పేర్కొన్నారు.