తూర్పుగోదావరి

సంక్షోభంలో హితకారిణి సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 30: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్థాపించిన విద్యా సంస్థలు నేడు అణగారిపోతున్నాయి..దాత లక్ష్యానికి దూరంగా క్షీణించిపోతున్నాయి..బోధన, బోధనేతర సిబ్బంది అర్ధాకలితో సతమతమవుతున్నారు. ఈ సంస్థలపై వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ దేవాదాయ శాఖ కర్రపెత్తనం చెలాయిస్తోంది తప్ప నయాపైసా పెట్టి అభివృద్ధి చేసిన దాఖలాలు కన్పించడం లేదు..ఎంతో ఉదాత్తమైన ఆశయంతో చారిత్రక రాజమహేంద్రవరంలో కందుకూరి మహాశయుడు స్థాపించిన ఈ విద్యా సంస్థలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
రాజమహేంద్రవరంలో హితకారిణీ సంస్థ పేరుతో కందుకూరి వీరేశలింగం పంతులు ఎస్‌కెవిటి డిగ్రీ కాలేజీ, ఎస్‌కెవిటి ఇంగ్లీషు మీడియం హైస్కూలు, ఎస్‌కెవిటి జూనియర్ కాలేజి, ఎస్‌ఆర్‌కెఆర్ మహిళా కాలేజి, ఎలిమెంటరీ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఒక పెట్రోలు బంకుకు లీజుకిచ్చిన స్థలం, ఎస్‌కెవిటి కాలేజిలోనే వ్యవసాయ విశ్వ విద్యాలయానికి అద్దెకు ఇచ్చిన భవనం తదితరాల ద్వారా ఏడాదికి ఇరవై నుంచి ముఫ్పై లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఈ సంస్థలన్నీ 1972-74 మధ్యలో దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లాయి. దీంతో ఈ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం కాస్తా దేవాదాయ శాఖ సిబ్బంది జీతాలకు వెచ్చిస్తున్నారు. విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంతోనే బోధనా, బోధనేతర సిబ్బంది అరకొర జీతాలు పొందుతున్నారు. ఉదాహరణకు ఎస్‌కెవిటి డిగ్రీ కాలేజీలో పనిచేసే పదమూడు మంది అధ్యాపకులు యుజిసి జీతాలు అంటే నెలకు లక్షా పాతికవేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారు. ఇదే డిగ్రీ కాలేజీలో పనిచేసే అధ్యాపకులు అదే విద్యార్హత, అనుభవం కలిగిన వారు మాత్రం సంవత్సరాల తరబడి కేవలం నెలకు రూ.10వేల చొప్పున జీతానికి పని చేస్తున్న దయనీయ స్థితి నెలకొంది. అదే విధంగా అధ్యాపకేతర సిబ్బంది పరిస్థితి కూడా అరకొర జీతాలతో అర్ధాకలితో నెట్టుకొస్తున్నారు. హితకారిణీ సంస్థను తమ అధీనంలో పెట్టుకున్న దేవాదాయ శాఖ ఏనాడూ ఈ విద్యా సంస్థల అభివృద్ధికి నయాపైసా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని తెలుస్తోంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి విద్యార్ధులకు అందుబాటులో వున్న ఈ విద్యా సంస్థలు కందుకూరి ఆశయాల మేరకు విద్యను అందిస్తున్నాయి. గట్టిగా ఫీజు చెల్లించాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తే ఇందులో చదువుకునే విద్యార్ధులు రెండు రోజుల పాటు కాలేజీకి సెలవు పెట్టేసి ఏదో పని చేసుకుని సంపాదించి వచ్చి కాలేజి ఫీజు చెల్లించే స్థితిలో వుంటారు. అటువంటి విద్యా సంస్థను ఉదాత్తంగా అభివృద్ధి చేయాల్సింది పోయి దేవాదాయ శాఖ మాత్రం ఈ సంస్థకున్న ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తోంది తప్ప అభివృద్ధి చేయాలనే ధ్యాసే లేకుండా పోయింది. సంస్థకు వచ్చే ఆదాయంతో జీతాలు తీసుకుంటూ నెట్టుకొస్తోంది. ఇందులో పనిచేసే అన్ ఎయిడెడ్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఎవరి మానానవారు పోతారన్నట్టుగా వదిలేసింది. ఈ విధంగా ఈ కందుకూరి విద్యా సంస్థల్లో మొత్తం 40 మంది వరకు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది చాలీ చాలనీ జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో హితకారిణి సంస్థ అధీనంలోని ఎస్‌కెవిటి డిగ్రీ కాలేజిని యూనివర్సిటీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వుంది. యూనివర్సిటీలో విలీనం చేసుకునేందుకు కూడా నన్నయ్య యూనివర్సిటీ సుముఖంగా వుంది. యూనివర్సిటీలో విలీనం చేస్తే తమకు జీతాల దారిద్య్రం నుంచి విముక్తి చేసినట్టు అవుతుందని, ఆ దిశగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.