తూర్పుగోదావరి

రాజమండ్రి నగరపాలక సంస్థలో జోనల్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 6: రాజమహేంద్రవరంలో రానున్న రోజుల్లో పరిసర గ్రామాల విలీనాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో జోనల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కమిషనర్ వి విజయరామరాజు వెల్లడించారు. గురువారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ నగరాన్ని 4 జోన్లు, 8 సర్కిళ్లుగా విభజించినట్లు తెలిపారు. నగరాన్ని తూర్పు, పశ్చిమ, ఉత్తర, మధ్య జోన్లుగా విభజించామన్నారు. ప్రతీ జోన్‌లో పారిశుద్ధ్య, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, ఇతర పరిపాలనా విభాగం అధికారులను నియమిస్తామన్నారు. భవిష్యత్‌లో పరిసర 13 గ్రామాల విలీనం జరిగితే జోనల్ వ్యవస్థ ద్వారా మెరుగైన పాలనను అందించవచ్చన్నారు. అయితే గ్రామాల విలీనం జరిగితే సిఇ ఇంజనీరింగ్ అధికారితో పాటు, అదనపు అధికారులు, సిబ్బంది అవసరమవుతారని విజయరామరాజు తెలిపారు.
నగరపాలక సంస్థ కొత్త మాస్టర్‌ప్లాన్‌ను ఈనెల 14న జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తరువాత అమల్లోకి తీసుకుని వస్తామన్నారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌ను 5కిలోమీటర్ల పరిధిలో విస్తరించి పరిసర 13 గ్రామాల్లో కూడా అమలుచేస్తామని ఆయన తెలిపారు. ఎవి అప్పారావురోడ్డు, జవహర్‌లాల్ నెహ్రూరోడ్డు వంటి శివారు ప్రాంతాల్లోని ప్రధాన మార్గాలను కొత్త మాస్టర్‌ప్లాన్‌లో కమర్షియల్ జోన్ పరిధిలోకి తీసుకుని వచ్చినట్లు విజయరామరాజు వివరించారు. అలాగే నగరంలోని ప్రధాన మార్గాలను అవసరాన్ని బట్టి 80నుంచి 100 అడుగులకు విస్తరిస్తామన్నారు. మోరంపూడి రోడ్డును 100, ధవళేశ్వరం రోడ్డును 80 అడుగులకు విస్తరిస్తామన్నారు. తద్వారా కొత్త వాణిజ్య సంస్థలు రావడం వల్ల నగర యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, అలాగే ఐదంతస్తులకు మించిన భవనాలను కూడా నిర్మించుకునే సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ఆటోనగర్‌ను పారిశ్రామిక ప్రాంతంగా మాస్టర్ ప్లాన్‌లో గుర్తించామని చెప్పారు. ప్రజాప్రతినిధులు తలుచుకుంటే పరిసర గ్రామాల విలీనం జరుగుతుందన్నారు. కొత్త మాస్టర్‌ప్లాన్, గ్రామాల విలీనం పూర్తయితే రాజమహేంద్రవరం గ్రేటర్‌గా అభివృద్ధి సాధిస్తుందన్నారు. నగరంలోని తోపుడుబండ్ల వర్తకులకు త్వరలో గుర్తింపుకార్డులు జారీ చేయడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వారి వ్యాపారానికి అనువైన ప్రదేశాన్ని కేటాయిస్తామని తెలిపారు. ఈమేరకు టౌన్ వెండింగ్ కమిటీతో చర్చిస్తున్నట్లు చెప్పారు. మేయర్ పంతం రజనీశేషసాయితో తనకు ఎలాంటి భేదాభిప్రాయలు లేవని, పరస్పర గౌరవంతో ముందుకు సాగుతున్నామన్నారు. అయితే కొంతమంది తమ మధ్య భేదాభిప్రాయలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.