తూర్పుగోదావరి

వీడని చిక్కుముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 9: రాజమహేంద్రవరంలోని రైల్వే క్వార్టర్స్‌లో నిర్బంధం నుండి పోలీసులు రక్షించిన మహిళను మెరుగైన చికిత్స కోసం శనివారం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెను ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామానికి చెందిన సిహెచ్ భవానీగా గుర్తించిన సంగతి తెలిసిందే. గతనెల 30న ఆమె ఇంట్లో నుంచి మండపేటకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిందని, ఆ తరువాత నుంచి ఆమె జాడ తెలియలేదని, ఈమేరకు ఆలమూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసినట్లు బందువులు తెలిపారు. అయితే ఆమె కిడ్నీలు దెబ్బతినడంతో అపస్మారక స్థితిలో నుంచి కోలుకోలేదు. దీంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ఆమె మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో ఈ కేసు మూడు రోజులు గడిచినా ఒక కొలిక్కిరాలేదు. ఆర్థిక కారణాలు, లేదా ఇతర వ్యవహారాలే ఆమె నిర్భంధానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను ఎవరు రైల్వేక్వార్టర్స్‌కు తీసుకుని వచ్చారన్నది తెలియాల్సి ఉంది. ఆమె ఇప్పటికీ అపస్మారకస్థితిలో ఉండటంతో రాజమహేంద్రవరం ఎందుకు వచ్చింది, ఆమెను రైల్వేక్వార్టర్స్‌కు తీసుకుని వెళ్లి నిర్బంధించిన నిందితులు ఎవరన్నది తెలియరాలేదు.