తూర్పుగోదావరి

మహిళ హత్య కేసులో నిందితులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, అక్టోబర్ 17: అమలాపురం మద్దాలవారిపేటలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు నిందితులను పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐ పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన చెక్కా వెంకట రమణకుమార్, చింతా వీరబాబులను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డిఎస్పీ తెలిపారు. సోమవారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ ఎల్ అంకయ్య ఆ వివరాలను వెల్లడించారు. మద్దాలవారిపేటకు చెందిన గెడ్డం సుబ్బాయమ్మ (నజ్మా) (58) గల్ఫ్ ఏజెంటు. ఐ పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన చెక్కా వెంకటరమణకుమార్ తనను గల్ఫ్ పంపించాలని కోరుతూ ఆమెతో పరిచయం పెంచుకుని గత మూడు నెలలుగా ఇంటి పనులు చేస్తూ నమ్మకంగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న నజ్మా ఇంటిలోనే ఉంటున్న వెంకటరమణకుమార్ ఆమె వ్యక్తిగత పనులు చేస్తూ మరింత చనువు పెంచుకున్నాడు. దీంతో రాత్రులు కూడా ఇక్కడే నమ్మకంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో నజ్మా వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై వెంకట రమణకుమార్ కన్నుపడింది. గతంలో ఒకసారి ఆమెపై హత్యాయత్నం చేసి విఫలమయ్యాడు. అనంతరం పక్కా ప్రణాళికతో సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి వెంకట రమణకుమార్ తన స్నేహితుడు (పశువుల్లంకకు చెందిన) చింతా వీరబాబు సహాయంతో రాత్రి 3.30 గంటల సమయంలో నిద్రిస్తున్న నజ్మాను తలదిండుల సాయంతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఇంట్లో బీరువాలో ఉన్న సుమారు 162.570 గ్రాముల బంగారం, రూ. 6,40,000 నగదు, రోల్డ్‌గోల్డ్ వస్తువులు, సెల్‌ఫోన్లు, కొన్ని దస్తావేజులు, రెండు ల్యాప్ టాప్‌లను అపహరించుకుపోయారు. నజ్మా హత్య సెప్టెంబర్ 1న జరిగినా ఆ విషయం సెప్టెంబర్ 9 వరకూ బయటకు రాలేదు. దీనిపై విచారణ నిర్వహించిన పోలీసులు నిందితులను అరెస్టుచేసి వారి నుండి రెండు ల్యాప్‌టాప్‌లు మినహా మిగిలిన సొమ్ము రూ.11,26,000ల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ వైఆర్‌కె శ్రీనివాస్, ఐడి పార్టీ హెచ్‌సి ఎ బాలకృష్ణ, బి రామచంద్రరావు, కానిస్టేబుల్ రమేష్, శంకర్, అనిల్‌లను డిఎస్పీ అభినందించారు.
చిరు 150వ చిత్రానికి ప్రమోషన్ వర్క్ ప్రారంభం
ముమ్మిడివరం, అక్టోబర్ 17: పదేళ్ల తరువాత చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా ఖైదీ నెం. 150 చిత్రాన్ని ఘనంగా విడుదల చేసేందుకు చిరు అభిమాన సంఘం ప్రమోషన్ వర్కును ప్రారంభించింది. సోమవారం ముమ్మిడివరం కొబ్బరి వర్తక సంఘం భవనంలో చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా కోశాధికారి గోదశి పుండరీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిరంజీవి ఫ్యాన్స్ జాతీయ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని సినిమా విజయవంతానికి నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. నవంబర్ నాలుగున అయినవిల్లి వరసిద్ధి వినాయకుని ఆలయంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సినిమా విజయవంతం కావాలని కోరుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గల ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ 14న కర్ణాటకలోని మంజునాధ్ ఆలయం, నవంబర్ 27న తెలంగాణాలోని యాదాద్రి, డిసెంబర్ 13న తమిళనాడులోని కంచి, కామాక్షి, డిసెంబర్ 27న వారణాశిలోని కాశీ అన్నపూర్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నట్టు స్వామినాయుడు తెలిపారు. సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రాల్లో థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది జనవరి 13న విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు స్వామినాయుడు తెలిపారు. ఈ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల చిరు ఫ్యాన్స్ అధ్యక్షులు ఏడిద శ్రీను, ఉండవల్లి రమేష్‌నాయుడు, అడబాల శ్రీను, గుండాబత్తుల తాతాజీ, కొత్తపేట రాజా, జిన్నూరి సాయిబాబా, యర్రా నాగబాబు, రాయుడు మురళి, కోలా ఆది, దాట్ల బాబు, గణేశుల బ్రహ్మానందం, చిరు, పవన్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆర్‌డిఎస్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు.