తూర్పుగోదావరి

నేను బతికే ఉన్నాను... పింఛను ఇప్పించండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆక్టోబర్ 17: బతికున్న ఓ వృద్ధ మహిళను అధికారులు తమ రికార్డుల్లో చంపేశారు. దీనితో వృద్ధాప్య పింఛను నిలిచిపోయంది. గత్యంతరంలేక కలెక్టరేట్‌కు వచ్చి తాను బతికే ఉన్నానని, గత ఏడాది నుండి ఆపిన పింఛను ఇప్పించండంటూ మొరపెట్టుకుంది. కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన నల్లజర్ల వీరలక్ష్మి అనే వృద్ధురాలు గత 2008వ సంవత్సరం నుండి పింఛను అందుకుంటోంది. 2015 అక్టోబర్‌లో ఆమె చనిపోయిందంటూ పింఛను నిలిపేశారు. తాను బతికేవున్నానంటూ పింఛను నిమిత్తం సంబంధిత అధికారుల వద్దకు వెళ్ళినా వారు స్పందించలేదు. దీనితో బంధువుల సహాయంతో సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుంది. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దయిందని తెలియడంతో ఆమె బయటి గేటు వద్ద నిరాశగా కూర్చుండిపోయింది. తాను బతికేందుకు పింఛను ఇప్పించాలంటూ వీరలక్ష్మి కోరుతోంది.