తూర్పుగోదావరి

మళ్లీ అక్రమ మట్టి తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, నవంబర్ 6: గత నాలుగునెలలుగా గోదావరికి వరదలు రావడంతో స్తబ్దుగా ఉన్న మట్టి మాఫియా వరద తగ్గడంతో తిరిగి తమ అక్రమాలకు తెర లేపింది. మండలంలోని గౌతమి, వశిష్ట గోదావరి లంకల్లో అడ్డూఅదుపూ లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు సాగిస్తోంది. మండలంలోని గౌతమీ గోదావరి పరిధిలో ఉన్న ఊబలంక, కొమరాజులంకలతోపాటు వశిష్ట గోదావరి పరిధిలో ఉన్న గోపాలపురం, పొడగట్లపల్లి, లక్ష్మీపోలవరం గ్రామ లంకల్లో రాత్రివేళల్లో యంత్రాలతో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. లంక మట్టి ఇటుక బట్టీల్లో ఇటుకల తయారీకి శ్రేష్టమైనది కావడంతో ఈ మట్టికి మంచి గిరాకీ ఉంది. ఎంత ధర అయినా చెల్లించేందుకు బట్టీల యజమానులు సిద్ధంగా ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగించేందుకు మట్టి మాఫియా వ్యక్తులు వెనుకాడటంలేదు. ట్రాక్టరు మట్టి రూ.1500 నుంచి రెండువేలు ధర పలుకుతుండటంతో లంక ప్రాంత రైతులకు కొద్దోగొప్పో ముట్టచెప్పి వారి చేలల్లోని లక్షలాది రూపాయల మట్టిని తవ్వి తరలిస్తున్నారు. గోదావరి వరదల సమయంలో సాగుకు ఇబ్బందులు కలిగేలా మట్టి మేటలు వేస్తే తప్ప తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇవ్వరు. అయితే ప్రస్తుతం ఎలాంటి మేటలూ లేని భూముల్లో సైతం అయిదు నుంచి ఆరు అడుగుల లోతున అగాధాల మాదిరిగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. దీనితో భవిష్యత్తులో లంకలకు ముప్పు పొంచి ఉంది. వరదల సమయంలో నదీప్రవాహం దిశ మార్చుకుని లంకలు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం రైతులు తమ చేలల్లో మట్టి మేటలు వేస్తే అధికారులకు దరఖాస్తు చేసుకుని అవసరమైన మేర మాత్రమే మట్టి తొలగింపు చర్యలు చేపట్టాలి. అయితే ఎలాంటి అనుమతులూ లేకుండానే ప్రస్తుతం లంకల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు అటువైపు కనె్నత్తి చూడటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని లంక ప్రాంతాల రైతులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ సిహెచ్ ఉదయ్‌భాస్కర్‌ను వివరణ కోరగా, మండలంలో లంక మట్టి తవ్వకాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. అక్రమ తవ్వకాలు సాగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మేటలు వేస్తే రైతులు తమకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.