తూర్పుగోదావరి

గ్రంథాలయాలకు సాంకేతిక వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 14: పాఠకుల అభిరుచికి అనుగుణంగా జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలకు సదుపాయాలు, సాంకేతిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని హోం, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 20 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను సోమవారం రాజప్ప స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి అధ్యక్షత వహించగా రాజప్ప ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంతో పాటు దేశవ్యాప్తంగా సాగిన గ్రంథాలయ ఉద్యమం స్వేచ్ఛ సమయంలో జాతిని ఐక్యం చేసిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకునేందుకు విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడ్డాయన్నారు. గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం అందించే పుస్తకాలను కూడా అందుబాటులోకి ఉంచామని, వీటిని విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణకు కృషి చేస్తున్నామన్నారు. సెస్ బకాయి వసూళ్లను ముమ్మరం చేయడం ద్వారా కేంద్ర, మండల, గ్రామీణ శాఖా గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడమే కాక జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన ఆధునీకరణ, విస్తరణకు నిధులు కల్పిస్తామని రాజప్ప తెలిపారు. జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాల ప్రాచుర్యానికి, పరిపుష్టికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో విశాలాంధ్ర బుక్‌హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనను రాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, సభ్యులు గద్దేపల్లి దాసు, టిడిపి నగర అధ్యక్షుడు నున్న దొరబాబు తదితరులు పాల్గొన్నారు.