తూర్పుగోదావరి

దివీస్‌తో ఆక్వా రంగం నాశనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 18: తొండంగి కోన ప్రాంతంలో నిర్మిస్తున్న దివీస్ కాలుష్య పరిశ్రమతో ఆక్వా రంగం నాశనమవుతుందని వైకాపా నేతలు పేర్కొన్నారు. శుక్రవారం స్ధానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో జిల్లాకు చెందిన వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు ఈ నెల 22వ తేదీన వైకాపా అధినేత జగన్ జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ జగన్ 22న దివీస్ పరిశ్రమ వద్ద బాధితులతో మాట్లాడతారన్నారు. దివీస్ పరిశ్రమను తమకు వద్దంటూ ఆయా గ్రామాలు ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని పోలీసులతో పలు రకాలుగా నిర్బంధాలకు గురి చేస్తోందన్నారు. ఐటి తరువాత ఖాజానాకు ఆక్వా రంగం ద్వారానే అధిక ఆదాయం వస్తోందని, దివీస్ వెదజల్లే కాలుష్యం వల్ల అక్కడ ఉన్న రొయ్యల హేచరీలు మూసివేత వల్ల సుమారు 10 వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. దివీస్ నిర్మాణం వల్ల 600 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కాలుష్యాన్ని వెదజల్లే దివీస్‌ను పంటలు పండే భూముల్లో కాకుండా కాకినాడ సెజ్‌లో నిర్మించుకోవాలని సూచించారు. యు కొత్తపల్లి నుండి పాయకరావు పేట వరకు ఆక్వా కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారి అవసరాలకు కాకుండా వేరే రంగాలకు మళ్ళిస్తున్న సిఎం చంద్రబాబుకు ఎలా సన్మానిస్తున్నారని ప్రశ్నించారు. సబ్‌ప్లాన్ చట్టం చేస్తున్న సమయంలో చంద్రబాబు అసెంబ్లీకి రాలేదన్నారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కన్నబాబు పిలుపునిచ్చారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) మాట్లాడుతూ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని కాలుష్యం వెదజల్లే పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలించాలని స్ధానికులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ ప్రజా ఉద్యమానికి తాము మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు కుడిపూడి చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముత్తా శశిధర్, శెట్టిబత్తుల రాజబాబు, మేడపాటి షర్మిలా రెడ్డి, తోట నాయుడు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.