తూర్పుగోదావరి

పతాకస్థాయకి ‘సేల్స్’ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 1: జిల్లాలోని వ్యాపార వర్గాల సేల్స్ కష్టాలు పతాకస్థాయికి చేరాయి. ప్రభుత్వ ఆదేశాలను నూటికి నూరు శాతం అమలుచేసి, లక్ష్యాన్ని పూర్తిచేసేయాలన్న తాపత్రయంతో ప్రభుత్వ యంత్రాంగం దుకాణదారులపై పడింది. పెద్ద వ్యాపార సంస్థల నుండి చిన్నా చితకా దుకాణాల వరకు స్వైపింగ్ యంత్రాల ఏర్పాటు తప్పనిసరంటూ స్పష్టం చేస్తుండటంతో వ్యాపారులు యంత్రాల కోసం ఉరుకుల పరుగులతో సాగుతున్నారు. సేల్స్ టాక్స్ అధికారులు దుకాణాలకు వచ్చి స్వైపింగ్ యంత్రాలను విధిగా వాడాలని, లేని పక్షంలో షాపులు మూసేయాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సేల్స్ టాక్స్ అధికారులు దుకాణాలను తనికీ చేస్తూ యంత్రాలను తక్షణం అమర్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఆయా బ్యాంకులను ఆశ్రయించి దరఖాస్తులు సమర్పించుకుంటున్నారు. కిరాణా, రైస్ మర్చంట్స్ నుండి కూరగాయల దుకాణాల వరకు స్వైపింగ్ యంత్రాలను యుద్ధప్రాతిపదికన సమకూర్చుకునే పనిలో ఉన్నారు. అలాగే పాన్‌షాపుల నుండి పాల బూత్‌ల వరకు స్వైపింగ్ యంత్రాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. డిసెంబరు 1వ తేదీ కావడంతో గురువారం నుండి సహజంగానే దుకాణాలకు వినియోగదారుల తాకిడి పెరిగింది. ఈనెల జీతాలందుకుని దుకాణాలకు వస్తున్న వినియోగదారులందరూ దాదాపు రెండు వేల నోట్లు తీసుకువస్తున్నారు. పెద్దనోట్లు చూసి వ్యాపారులు డీలా పడుతున్నారు. ఏ ఒక్క వినియోగదారుడూ చిల్లర ఇవ్వడం లేదని, పెద్దనోట్లు ఇవ్వడంతో తమ వద్ద కూడా చిన్న నోట్లు లేక త్రిప్పి పంపేయాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. ఇక జీతాల రోజు కావడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా గల బ్యాంకులను ఆశ్రయించారు. జిల్లాలోని బ్యాంకులన్నీ కిటకటలాడుతున్నాయి. ఎటిఎంల వద్ద వినియోగదారుల కష్టాలు వర్ణనాతీతంగా గోచరిస్తున్నాయి. ఇంటి అద్దె నుండి పాల వరకు బాకీలు చెల్లించేందుకు వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలావుండగా ఎన్టీఆర్ భరోసా క్రింద ప్రతినెలా మంజూరు చేసే పింఛన్లను లబ్దిదారుల ఖాతాలకు నేరుగా జమ చేశారు. నగదుకు బదులు ఖాతాల్లో జమ చేసిన సొమ్మును రూపే కార్డుతో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చని అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్ భరోసా క్రింద పింఛన్లు పొందుతున్న వారిలో చాలా మందికి రూపే కార్డులు లేకపోవడంతో సదరు లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా ఆయా బ్యాంకులు వెంటనే రూపే కార్డులు మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో నగదు రహిత సరుకుల పంపిణీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు కలెక్టర్ తెలియజేశారు. ఈ-పోస్ యంత్రాల సహాయంతో సమర్ధవంతంగా రేషన్ సరుకులను అర్హులకు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎయిడ్స్ రోగులను ఆదరించాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్
చిన్నారులతో అల్పాహారంలో పాల్గొన్న కలెక్టర్ తదితరులు
కాకినాడ, డిసెంబర్ 1: ఎయిడ్స్ సోకిన వారికి, ప్రభావిత కుటుంబాలకు ప్రతీ ఒక్కరు బాసటగా నిలిచి అన్ని విధాలా సామాజిక మద్దతు అందించాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ కోరారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ వ్యతిరేక దినం సందర్భంగా జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్ధల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో హెచ్‌ఐవి సోకిన పిల్లలతో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల అల్పాహార విందులో పాల్గొన్ని సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2005- 06 నాటికి 28శాతంగా ఉన్న వ్యాప్తి, 2015-16 నాటికి 3.6 శాతానికి తగ్గిందన్నారు. అలాగే గర్భిణీలలో హెచ్‌ఐవి సెంటినల్ సర్వేల ప్రకారం 2005లో వ్యాధి ఉనికి 2.5 శాతం ఉండగా ప్రస్తుతం 0.35 శాతానికి తగ్గిందని, తల్లి నుండి బిడ్డకు వ్యాధి సోకకుండా 98 శాతం వరకు నివారించామన్నారు. సెక్స్‌వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లలో చాలా వరకు అవగాహన కలిగి జాగ్రత్త వహిస్తున్నారన్నారు. జిల్లాలో 7437 మంది ఎఆర్‌టి చికిత్స పొందుతున్నారని వీరందరికీ పించన్లు అందిస్తున్నామని చెప్పారు. హెచ్‌ఐవి సోకిన వారికి ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యానికి నిరాకరిస్తే వారికి నోటీసులు పంపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాధి సోకిన 350 మంది పిల్లలను, 6573 మంది వ్యాధిగ్రస్తులను అనేక రకాలుగా సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. హెచ్‌ఐవితో జీవిస్తున్న 60 మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చులకన చూడడం మానుకోవాలని సమాజం నుండి ఎయిడ్స్ రోగాని దూరం చేయాలని సూచించారు. స్థానిక పిఆర్ కళాశాల నుండి బాలాజీచెరువు వరకు ఎయిడ్స్ అవగాహనపై ర్యాలీని నిర్వహించి నెహ్రు సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెసి- జె రాధాకృష్ణమూర్తి, డిఎంహెచ్‌ఓ చంద్రయ్య, ఎడిఎంహెచ్‌ఓ ఎం పవన్‌కుమార్, రెడ్‌క్రాస్ అధ్యక్షుడు వైడి రామారావు, ఐసిడిఎస్ పిడి నాగరత్నం, పిల్లి సత్తిబాబు, రమణమూర్తి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.