తూర్పుగోదావరి

శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, డిసెంబర్ 2: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు పాటుపడాలని ఏలూరు రేంజి డిఐజి రామకృష్ణ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన కడియం పోలీసుస్టేషనును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, అలాగే సామాజిక కార్యక్రమాల్లో కూడ పాల్గొని జనమైత్రి పెంపొందించుకోవాలని కోరారు. అనంతరం స్టేషనులో రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిఐ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది డిఐజికి గౌరవ వందనం సమర్పించారు.
నగదు రహిత లావాదేవీలతోనే అభివృద్ధి
జెసి సత్యనారాయణ
శంఖవరం, నవంబర్ 2: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు పేదలకు అందేందుకు, ఆయా రంగాల్లో సేవలు పారదర్శకతకు నగదు రహిత లావాదేవీలు దోహదపడతాయని, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రం శంఖవరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉప సర్పంచ్ జి నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నగదు రహిత వ్యాపార వ్యవహారాలు, లావాదేవీల అవగాహన గ్రామసభకు జెసి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను అధిగమించేందుకు ప్రతీ ఒక్కరూ ఆధార్, బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలన్నారు. జనధన్ ఖాతా కలిగిన వారు వంద రూపాయులు తమ ఖాతాల్లో వేసుకుంటే ఖాతా బతుకుతుందన్నారు. ప్రతీ ఖాతాదారుడు డెబిట్ కార్డుగాని, రూపే కార్డుగాని, ఎటిఎమ్‌గాని కలిగి ఉండాలన్నారు. భవిష్యత్త్‌లో లావాదేవీలన్నీ నగదు కంటే కార్డులతో జరుగుతాయన్నారు. ప్రస్తుతం డిసెంబర్ నెలకు రేషన్ సరుకులను నగదు రహితంగా అప్పుగా ఇస్తున్నామని, వీటిని వచ్చే నెలలో తీసుకుంటామన్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ నగదు రహితంగానే లావాదేవీలు నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లాలో 4.75లక్షల పింఛన్లు, 13.25లక్షల గ్యాస్ కనెక్షన్లు, 15.79లక్షల తెల్లకార్డులు ఉన్నాయని, వీటన్నింటి లావాదేవీలు నగదు రహితంగానే జరుగుతాయన్నారు. ఎస్‌బిఐ బ్రాంచి మేనేజర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ లావాదేవీలు అన్నీ ఎటిఎంగాని, మొబైల్ బ్యాంకు యాప్‌గాని, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా గాని నగదు రహితంగా నిర్వహించుకోవాలని సూచించారు. వ్యాపారులకు పిఓఎస్ మిషన్లకు ఉచితంగా అందిస్తామని, వీటి కోసం కరెంట్ ఖాతా తెరవాలన్నారు. ఇందులో 3 రకాలు ఉన్నాయని, అవి ల్యాండ్ ఫోన్ ద్వారా పిఓఎస్ మిషన్‌కు ఎటువంటి అద్దె చెల్లించనవసరం లేదని, సిమ్ బేస్డ్ పిఓఎస్ మిషన్‌కు నెలకు 220లు అద్దె, కార్డ్‌లెస్ బేస్డ్ పిఓఎస్ మిషన్‌కు 400లు అద్దె చెల్లించాలన్నారు. దీని ద్వారా నిర్వహించే ప్రతీ వంద రూపాయుల లావాదేవీలకు 0.75పైసలు సర్‌ఛార్జ్, 2వేలు దాటితే వందకు ఒక రూపాయి సర్‌ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుందని, ఈ నెల 30వరకు ఎటువంటి ఛార్జీల విధింపు లేదన్నారు. ఎంపిడిఓ ఎం శ్రీను మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై విద్యావంతులు, యువకులు, ఉపాధ్యాయులు, డ్వాక్రా యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు ఒక సామాజిక బాధ్యతగా ప్రజలకు, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి, చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎండిసి ఛైర్మన్ బద్ధి రామారావు, ఎంపిటిసిలు పగడాల బాబ్జి, బైరా రాంబాబు, ఎంఇఓ బిఆర్ కమలాదాస్, ఏఎస్‌ఓ శంకరరావు, డిటి కె రఘురామయ్య, ఏపిఎమ్ టి శ్రీను, ఏపిఓ లక్ష్మీ నారాయణ, పర్వత జిజ్జిబాబు తదితరులు పాల్గోన్నారు.