తూర్పుగోదావరి

పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 5: జిల్లాలో సింగిల్ డెస్క్ పాలసీలో పరిశ్రమల అనుమతులకు దరఖాస్తుచేసుకున్న వారికి సకాలంలో అనమతులు ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాలులో సోమవారం సాయంత్రం జిల్లా పరిశ్రమ ప్రమోషన్ కమిటీ సమావేశం జిరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పాలసీపై జిల్లాలో పరిశ్రమలకు సపోర్టు ఇవ్వడానికి యూనిట్స్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా పరిశ్రమలను ఏర్పాటుచేయ దలచిన వారికి సబ్సిడీని సకాలంలో అందజేసి ప్రోత్సహిస్తామని తెలిపారు. సింగిల్ విండో పెట్టిన వారికి కౌన్సిలింగ్‌చేసి సపోర్టు ఇవ్వాలని, దరఖాస్తులు డాక్యుమెంట్స్‌పోతే తిరిగి పెట్టమిని పారిశ్రామిక వేత్తలకు చెప్పాలని, వారిని పలుమార్లు కార్యాలయాలు చుట్టూ తిప్పివద్దని సూచించారు. ఇండస్ట్రియల్ ప్రొమోషన్ అధికారులు పరిశ్రమలు స్థాపించే వారిని గైడ్‌చేసి కౌన్సిలింగ్ ఇచ్చి గైడ్ చేయాలని, వారు పరిశ్రమ శాఖ కార్యాలయానికి వస్తే స్నేహభావ వాతావర్ణంలో మాట్లాడాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ అధికారులకు చెప్పారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి అనుమతులు మంజూరుచేయాలని, నూతనంగా దరఖాస్తులు వస్తే వాటిని స్వీకరించాలని స్పష్టంచేశారు. వివిధ రకాల 33పరిశ్రలకు ఒకకోటి 23లక్షల 49వేల 672సబ్సిడీని మంజూరుచేశారని వివరించారు. పెద్దాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఎస్సీ, ఎస్టీలకు ఆరుగురికి ఇండస్ట్రియల్ ప్లాట్‌లను కేటాయించామని పరిశ్రమల శాఖ జియం తెలియజేశారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ మూడు పరిశ్రమలకు భూములు కేటాయించాలని, వాటిని త్వరగా పూర్తిచేయాలని ఏపిఐఐసి జోనల్ మేనేజర్‌ను ఆదేశించారు. కొండగుంటూరు, జేగురుపాడుకు కేటాయించిన స్థలాల సేకరించడం జరిగిందని, మిగిలిన దానికి కూడా భూమిని సేకరించడం జరిగిందని జోనల్ మేనేజర్ చెప్పారు. పారిశ్రామికవేత్తలకు నగదు రహిత బదిలీపై అవగాహన కల్పించామన్నారు. పరిశ్రమల్లో పనిచేసే రోజువారి కూలీలకు చెల్లింపులు చేయడం కష్టంగా ఉందని, వారికి బ్యాంక్ ఖాతాలు లేవని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయన ఈవిషయమై స్పందిస్తు వారికి ప్రీపెయిడ్ కార్డుల ద్వారా చెల్పింపులు చేయవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఎస్‌విఎస్ సూరపురాజు నగదు రహిత బదిలీలపై వారికి వివరించారు. ఆంధ్రబ్యాంక్ ఎల్‌డిఎం మాట్లాడుతూ పిన్ నెంబర్ ఎవరికీ చెప్పరాదని, పిన్‌ను వినియోగించే సమయంలో ఇతరులు చూడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ఏవి పటేల్, డిడిలు డేవిడ్ సుందర్‌కుమార్, గణపతి, ఏఐఐసిసి జోనల్ మేనేజర్ పి నాగేశ్వరరావు, పరిశ్రమశాఖ ఏడిలు ఐ వీరశేఖర్, టి జయబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జడ్పీచైర్మన్ నామన జన్మదిన వేడుకలు
డి గన్నవరం, డిసెంబర్ 5 : జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు జన్మదిన వేడుకలను సోమవారం పి గన్నవరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొని నామనచే జన్మదిన కేక్‌ను కట్ చేయించి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా జడ్పీచైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ తనను అదరించి జడ్పీటిసిగా ఎన్నుకొని జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎంపిక కావడానికి కారకులైన పి గన్నవరం మండల ప్రజానికానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి నామన రాంబాబు పాదాభివందనం చేశారు. అదేవిధంగా రెడ్డి సుబ్రహ్మణ్యంకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు పి గన్నవరం ప్రధానరహదారి పొడువునా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లంకల గన్నవరం డొక్కా నాధ్‌బాబు వ్యవసాయ కేత్రంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నామనకు జన్మదిన శుభాక్షాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డొక్కా నాధ్‌బాబు, ఎంపిపి సంసాని లక్ష్మీగౌరీపెద్దిరాజు, జెడ్పీటిసి బొంతు పెదబాబు, గంగుమళ్ళ కాశీఅన్నపూర్ణ, మార్కెట్ యార్డ్ చైర్మణ్ అరిగెల బలరామమూర్తి, తెలుగు యువత ఉపాధ్యాక్షుడు పులపర్తి రవికుమార్, నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు గ్రామశాఖ అధ్యక్షులు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముద్రగడ కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు
కొత్తపేట, డిసెంబర్ 4: కాపు రిజర్వేషన్ పోరాటసమితి నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీమణితోపాటు ఆయన కుటుంబసభ్యులు మండల పరిదిలో వాడపాలెంలో వల్లీదేవసేనసమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముద్రగడ సతీమణి పద్మావతితోపాటు ఆయన కుమారుడు గిరి దంపతులు స్వామి వారికి ప్రత్యేక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఇటీవలే ఇదే గ్రామంలోని జ్ఞానసరస్వతి అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన విషయం తెలిసిందే. ముద్రగడ కుటుంబ సభ్యులకు నాయకులు బండారు శ్రీనివాసరావు, పెదపూడి బాపిరాజు, మట్టా బాబ్జి, మట్టా మురళీతో పాటు పలువురు ఘనస్వాగతం పలికారు.
కోనసీమ ఐ బ్యాంకుకు జాతీయ పురస్కారం
అంబాజీపేట, డిసెంబర్ 5: జాతీయ స్థాయిలో పేర్గాంచిన కోనసీమ ఐ బ్యాంకుకు జాతీయ పురస్కారం లభించింది. ఛైర్మన్ డాక్టర్ యర్రా నాగబాబుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారాన్ని హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన్ భవనంలో జాతీయ విశ్వజన కళా మండలి అధ్యక్షులు మాస్టార్జీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు వి నాగేశ్వరరావు అందజేశారు. జాతీయ అవార్డు అందుకున్న నాగబాబును పలువురు అభినందించారు.