తూర్పుగోదావరి

అంగరంగ వైభవంగా సుబ్బారాయుడి షష్ఠి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిక్కవోలు, డిసెంమర్ 5: బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి షష్ఠి మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి తీర్థాన్ని వీక్షించడానికి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సోమవారం తెల్లవారు జాము నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి గోదావరి కాలువలో స్నానఘట్టాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. 10 గంటలకు స్వామివారిని నెమలి వాహనంలో గ్రామంలో ఊరేగించారు. సంతాన ప్రాప్తిని కలుగచేసే శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో సహజసిద్ధంగా ఏర్పడిన పుట్టపై నాగులచీర ఉంచి దానిని ధరించి ఆలయం వెనుక నిదురిస్తే స్వామి కలలో కనిపించి సంతానప్రాప్తి కలుగ చేస్తాడని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. దీంతో సంతానంకోసం అధిక సంఖ్యలో మహిళలు ఆలయం వెనుక నిదురించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్యాండ్ కచేరీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పగటిపూట బాణాసంచా వెలిగించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పలు స్వచ్ఛంద సంస్థలు తాగునీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందచేశారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవాన్ని పురస్కరించుకుని రోడ్లన్నీ జన సంద్రాన్ని తలపించాయి. బ్యాండ్ మేళాలు, కోయ డాన్సులు, గరగ నృత్యాలు, గారఢీలు, బుట్టబొమ్మల నృత్యాలతో రాత్రి 11గంటలకు ప్రారంభమయ్యే స్వామి వారి గ్రామోత్సవం తెల్లవారులూ సాగుతుంది. రాత్రి 12గంటల నుంచి బాణాసంచా పోటీలు ప్రారంభమవుతాయి. హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగే ఈ పోటీల్లో శ్రీ గోలింగేశ్వరాఫైర్‌వర్క్స్, శ్రీ కనకదుర్గా హుస్సేనియా ఫైర్‌వర్క్స్ వారి మధ్య జరిగే ఈ పోటీ చూడడానికి యువకులు, మహిళలు, పిల్లల ఆశక్తిగా రాత్రి తెల్లవార్లూ వేచి ఉంటారు.