తూర్పుగోదావరి

రూ.18లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, డిసెంబర్ 5: ప్రజలు బ్యాంకుల నుండి నగదు లభ్యం కాకపోవడంతో ఇబ్బందులు పడుతుండగా ఓ వడ్డీవ్యాపారి పెద్ద మొత్తంలో నగదును తరలిస్తు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈసంఘటన సోమవారం ఉదయం కాకినాడ రూరల్ పరిధిలోని కాకినాడ-పెదపూడి రోడ్డులోని కొవ్వాడ రైల్వే గేటు వద్ద చోటుచేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వడ్డీ వ్యాపారి 18లక్షల రూపాయలు విలువైన నోట్లను రామచంద్రపురం మీదుగా కాకినాడకు తరలిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందడంతో ఇంద్రపాలెం ఎస్సై తిరుపతి తన సిబ్బందితో కలసి కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వాడ రైల్వేగేటు వద్ద సోమవారం ఉదయం వాహనాలను తనిఖీ చేపట్టారు. అదే సమయంలో రామచంద్రపురం మండలం మాచవరం గ్రామం నుండి కాకినాడకు వస్తున్న వడ్డీ వ్యాపారి కర్రి భావరెడ్డి పెద్ద మొత్తంలో నగదును భ్యాగ్‌లో తీసుకువస్తుండగా ఎస్సై తిరుపతి ఆయన వాహనాన్ని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో నగదు లభ్యమయింది. బ్యాంగ్‌లో ప్రస్తుతం కేంద్రప్రభుత్వం రద్దుచేసిన 4లక్షల రూపాయలు విలువైన నాలుగువేల 1000నోట్లు, నూతనంగా ముద్రించిన 14వేల రెండువేల రూపాయల నోట్లు ఉండగా వాటివిలువ సుమారు 18లక్షల రూపాయలు ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారం కోసం భావరెడ్డి పెద్ద ఎత్తున నగదును తరలిస్తు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈకేసును రూరల్ సిఐ పవన్ కిషోర్ నేతృత్వంలో ఎస్సై తిరుపతి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కరించాలి
జెసి సత్యనారాయణ
కాకినాడ, డిసెంబర్ 5: ప్రజాసమస్యల కోసం ప్రజావాణిలో అందిన అర్జీలను సంబంధిత అధికారులు సకాలంలో పరిష్కరించాలని జెసి ఎస్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 162 మంది హాజరై తమ సమస్యలు, విజ్ఞాపనలను జెసితో పాటు జెసి-2 జె రాధాకృష్ణమూర్తికి అందించారు. అర్జీదారులు ముఖ్యంగా తమకు ఆధార్, రేషన్ కార్డులు కావాలని, ఇళ్ళు, ఇళ్ళ స్ధలాలివ్వాలంటూ కోరారు. అందిన అర్జీలను పరిశీలించి వాటి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వే ఎడి నూతన్‌కుమార్, డిఎస్‌ఓ జి ఉమామహేశ్వరరావు, వయోవృద్ధుల శాఖ ఎడి కెవి సత్యనారాయణ, బిసి వెల్ఫేర్ డిడి ఎం చిన్నబాబు, మైనార్టీ సంక్షేమాధికారి డిఎస్ సునీత తదితరులు పాల్గొన్నారు.