తూర్పుగోదావరి

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ముమ్మరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 8: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ముమ్మరం చేయాలని జిల్లా కల్టెర్ హెచ్ అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈనెలాఖరు నాటికి మరో 159 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించాడానికి తగిన చర్యలు చెపట్టాలన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టుహాలులో ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలుకు దత్తత అధికారులుగా నియమించిన అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఈసంవత్సరం స్వచ్ఛ భారత్, జాతీయ ఉపాధి హామీ పధకాల ద్వారా జిల్లాలో 523 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చి దిద్దే లక్ష్యంతో ఇప్పటి వరకు 141గ్రామాలను తీర్చి దిద్దినట్లు చెప్పారు. అలాగే ఈనెలాఖరు నాటికి మరో 159 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చి దిద్దనున్నట్లు తెలిపారు. ఇంకా మిగిలిన 223 గ్రామాలను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. అధికారుల లక్ష్యాల సాధనకు తగిన కృషి చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ కోరారు. ఈసమావేశంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, జెడ్పీ సిఇఒ కె పద్మ, ఆర్‌డబ్య్లూఎస్ ఎస్‌ఇ రాజేశ్వరరావు, డ్వామా పిడి ఏ నాగేశ్వరరావు, డిఆర్‌డిఎ పిడి మల్లిబాబు, ఆర్డీఒలు బిఆర్ అంబేద్కర్, కె సుబ్బారావు, డిఇఒ నర్శింహారావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
కొత్తపేట, డిసెంబర్ 8:స్థానిక సంతోష్ నగర్‌కు చెందిన నరహరిశెట్టి ఆదినారాయణ(55) అనే కౌలు రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ డి విజయ్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలో మందపల్లిలో ఒక రైతు పొలాన్ని కౌలుకుతీసుకొని ఆదినారాయణ సాగు చేస్తున్నట్లు అయితే పంట సరిగాపండకపోవడం అప్పుల బాధ భరించలేకపోవడంతో పురుగుల మందుతాగి అతను ఆత్మ చేసుకున్నట్లు అతని కుమారుడు వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నోట్ల రద్దుతో ఢీలాపడిన వ్యాపారాలు
మండపేట, డిసెంబర్ 8: మండలంలోని ద్వారపూడి గ్రామంలోగల మహాత్మాగాంధీ వస్తవ్య్రాపార సముదాయం నోట్ల మార్పిడి కొత్త విధానానికి వ్యాపారాలు ఢీలాపడ్డాయి. ఈ సమయంలో మొత్తం 320 షాపులు, అదేవిధంగా ఆరుబయట మరో యాభై షాపుల్లో వ్యాపారాలు సాగిస్తుంటారు. అయితే ఈ నోట్ల మార్పిడి దగ్గర నుంచి వ్యాపారాలు పూర్తిగా సన్నగిల్లాయని వస్త్ర వ్యాపారి మండా వీరభద్రరావు అన్నారు. ఈ సముదాయంలో సీజన్‌లో సుమారు కోటి రూపాయల వరకు వస్త్ర వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం క్రిస్మస్, సంక్రాంతి పండుగలు కావడంతో ఎంతో ఆశతో వ్యాపారాలు జరుగుతాయని వ్యాపారులు ఎదురుచూస్తున్నప్పటికీ వ్యాపారాలు అంతంతమాత్రంగానే ఉండటం వల్ల వారు దిగాలు పడుతున్నారు. ఈ సముదాయాలపై ఆధారపడి సుమారు నాలుగువేల కుటుంబాలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయని వస్తవ్య్రాపారులు ఓంకార్, ఎస్ బాబ్జి తెలిపారు. ఒక్కసారిగా వ్యాపారాలు లేకపోవడంతో ఈ పనీ చేతకాక దీనినే నమ్ముకుని జీవిస్తున్న తమలాంటి వారికి ఏంచేయాలో తోచడంలేదని వస్తవ్య్రాపారులు, అందులో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అటవీ శాఖలో ముగ్గురు సస్పెన్షన్
శంఖవరం, డిసెంబర్ 8: అటవీశాఖలో శంఖవరం సెక్షన్‌లో పనిచేస్తున్న అధికారులు ముగ్గుర్ని సస్పెండ్ చేశారు. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శంఖవరం సెక్షన్ అటవీశాఖ అధికారిగా పనిచేస్తున్న బి విజయరత్నం, కొత్తూరు బీట్‌లో ఫారెస్ట్ బీట్ అధికారి కె వెంకటేశ్వరరావు, సహాయ బీట్ అధికారి పి లావణ్యలను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీ శాఖ అధికారి ఎమ్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 30న శంఖవరం సెక్షన్‌లోని వజ్రకూటం రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై అటవీ శాఖ అధికారులు చేసిన దాడుల నేపధ్యంలో ఈ సస్పెన్షన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. భారీ ఎత్తున తవ్వకాలను గుర్తించిన ఉన్నతాధికారులు, స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే భారీగా రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు భావించడంతోనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దీనితో రౌతులపూడి అటవీ సెక్షన్ అధికారి జి నాగేశ్వరరావుకు కత్తిపూడి ఇన్‌ఛార్జి సెక్షన్ అధికారి బాధ్యతలు అప్పగించడంతో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొత్తూరు బీట్‌లో సస్పెండైన ఇరువురి బాధ్యతలను బవురువాక బీట్ ఫారెస్ట్ బీట్ అధికారి ఎం రాంబాబుకు అప్పగించారు.