తూర్పుగోదావరి

జిల్లాలో ఇన్నీసుపేట అర్బన్ బ్యాంకు అదనపు బ్రాంచిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 8: చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలోని వందేళ్ల చరిత్ర కలిగిన ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు అదనపు శాఖలకు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆ బ్యాంకు ఛైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు వ్యవస్థాపక కార్యాలయం ఈ నెల 10వ తేదీన నూతన భవన ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని, పూజ్య స్వామీజీలు త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ, త్రిదండి వేదనాధ రామానుజ జీయర్ స్వామీజీల పర్యవేక్షణలో ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు. 2018 నాటికి ఇన్నీసుపేట అర్బన్ బ్యాంకు రూ.100 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పని చేస్తుందన్నారు. రిజర్వు బ్యాంకు అనుమతి మేరకు కొత్తగా రెండు బ్రాంచిలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఒకటి రాజమహేంద్రవరంలో, మరొకటి జిల్లాలో మరో ప్రాంతంలోనూ ఏర్పాటు చేసేందుకు పాలకవర్గం నిర్ణయించిందన్నారు. తమ అర్బన్ బ్యాంకు జాతీయ బ్యాంకులకు అన8సంధానమైన ఆధునిక కంప్యూటరీకరణ జరిగిందన్నారు.
అర్బన్ బ్యాంకుల నుంచి ఆదాయం పన్ను 30 శాతం గుంజడం దారుణమన్నారు. ప్రభుత్వం నుంచి కనీసం ఎటువంటి శాఖల నుంచి కూడా చెక్కులు సైతం దక్కని విధంగా వున్న అర్బన్ బ్యాంకుల నుంచి ఆదాయపు పన్ను విధించడం సరికాదన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల అర్బన్ బ్యాంకులు కుదేలయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. ఇన్నీసుపేట అర్బన్ బ్యాంకుకు కొత్తగా ఒక్కోటి 66 లాకర్లు కలిగిన రెండు లాకర్ ఛాంబర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదాయ పన్ను తొలగిస్తే అర్బన్ బ్యాంకులు పటిష్టవంతమవుతాయన్నారు. 10వ తేదీన రాజమహేంద్రవరంలో ఎపి స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్స్, అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుందని తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు సూరెడ్డి రమేష్, పిల్లి వీరవెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.