తూర్పుగోదావరి

పెట్రో కారిడార్ ఏర్పాటుతో మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 8 : నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్రోకారిడార్ ఏర్పాటుతో మహర్ధశ పట్టనుంది. విశాఖ - కాకినాడ రీజియన్ మధ్య ఏర్పడిన పెట్రోకారిడార్ ద్వారా ప్రస్తుతం 93 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధితో పాటు రాగల రెండు దశాబ్ధాల్లో 11.98లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని కేంద్ర కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్, పంపింగ్, జాతీయ రహదారి శాఖామంత్రి మాన్‌సుక్ ఎల్.మాంఢవ్య గురువారం లోక్ సభలో వెల్లడించినట్లు అమలాపురం ఎంపి పండుల రవీద్రబాబు తెలిపారు. గురువారం ఆయన డిల్లీ నుండి ఫోన్‌లో స్థానిక విలేఖర్లకు ఆ వివరాలను వెల్లడించారు. విశాఖ -కాకినాడల మధ్య పెట్రోలియం, కెమికల్స్ కారిడార్ (పిసిపిఐఆర్)లకు సంబంధించి ప్రభుత్వ ప్రణాళిక పెట్టుబడులు ఉపాధి లక్ష్యాలపై ఎంపి పండుల లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు మాంఢవ్య స్పందించి సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం- కాకినాడ రీజియన్‌ల మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం కెమికల్స్, పెట్రోకెమికల్ ఏర్పాటు కోసం 2009 ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసిందని మంత్రి వివరించారు. పర్యావరణ పరిస్థితులకు భంగం కలగని విధంగా కెమికల్స్, తయారీ సంస్థలను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసినట్లు మంత్రి స్పష్టం చేసారని ఎంపి రవీంద్రబాబు తెలిపారు. ఇప్పటికే హెచ్‌పిసిఎల్, గెయిల్ సంస్థలు పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్సులు ఏర్పాటవుతున్నట్లు మంత్రి తెలిపారన్నారు. ఈ కారిడార్ ప్రస్తుతం 93వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగుతుందని రాబోయే 15,20 ఏళ్లలో 11.98 లక్షల మందికి ఉపాధి ఆవకాశాలు కలుగుతాయని కేంద్ర మంత్రి లోక్‌సభలో వివరణ ఇచ్చారని ఎంపి పండుల విలేఖర్లకు చెప్పారు. విశాఖ, కాకినాడ పెట్రో కారిడార్ వల్ల రాష్ట్రంలో అనూహ్యమైన పారిశ్రామికాభివృద్ధి కలుగుతుందని ఎంపి ఆశాభావం వ్యక్తం చేసారు.