తూర్పుగోదావరి

ఇక అందరికీ విధిగా స్మార్ట్ఫోన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 8: జిల్లాలోని ప్రతివొక్కరూ విధిగా మొబైల్/స్మార్ట్ఫోన్లు కలిగివుండాలని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ సూచించారు. రోజూవారీ కూలీలకు కూడా మొబైల్ నగదు బదిలీ చేయాలని ఆయా వర్గాలకు పిలుపునిచ్చారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసినపుడు ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయవచ్చన్నారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని కలెక్టరేట్‌లో గల విధాన గౌతమీ హాలులో గురువారం నగదు రహిత లావాదేవీలపై కాకినాడ, పెద్దాపురం డివిజనల్ స్థాయిలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఎక్కువ మంది నగదు రహిత చెల్లింపులపైనే ఆధారపడేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నగదు రహిత బదిలీ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంగా తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 98శాతం వరకు నగదు లావాదేవీలు, 2 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నట్టు చెప్పారు. 20 శాతం వరకు నగదు రహిత లావాదేవీలు జరిగినపుడే నల్లధనం తగ్గుతుందని, పన్నుల వసూళ్ళు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నగదు రహిత బదిలీలకై సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ 500, 1000 నోట్ల రద్దుతో నగదు రహిత బదిలీ తప్పనిసరి అయ్యిందన్నారు. మొబైల్ ఫోన్స్‌లో యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని, నగదు రహిత బదిలీలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాకినాడ ఆర్‌డిఒ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఆన్‌లైన్ విధానంలో నగదు రహితంగా ఎటి ఎంలు, డెబిట్ కార్డుల వాడకంపై క్రిందిస్థాయి వారికి అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. కాకినాడ డివిజన్‌లో కాకినాడ అర్బన్‌ను మినహాయిస్తే మిగిలిన 8 మండలాల్లో వర్తకం చేసేవారు 1952 మంది ఉన్నారని, వీరిలో 480 మంది స్వైపింగ్ మెషిన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వర్తకులకు కరెంట్ ఖాతా ఉండాలని, లైసెన్స్‌లను పంచాయతీ కార్యదర్శులు జారీ చేస్తారని ఆర్‌డిఒ వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఐసి అధికారి ఉస్మాన్, జిల్లా శిక్షణ కో-ఆర్డినేటర్ సూరపురాజు, కాకినాడ, పెద్దాపురం డివిజన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.