తూర్పుగోదావరి

అండగా ఉంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, డిసెంబర్ 8: పోలవరం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, పునరావాసంపై ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి విలీన ప్రజలకు అభయమిచ్చారు. పోలవరం ముంపు ప్రాంత ప్రజలు గత మూడేళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలీన మండలాలైన విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో పర్యటించారు. ముందుగా చింతూరు చేరుకున్న జగన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను కలుసుకుని కళాశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కళాశాలలో అధ్యాపకులు లేకపోవడంతో తమ చదువులు అగమ్యగోచరంగా తయారయ్యాయని జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జగన్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు పాలన మరో రెండేళ్లని, ఆ తర్వాత వచ్చేది రాజన్న రాజ్యమని అన్నారు. అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవని విద్యార్థులతో అన్నారు. ఆ తర్వాత చింతూరు ప్రధాన సెంటర్లో ప్రజలతో కరచలనం చేసి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో అవసరమని, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి విలీన మండలాల ప్రజలు తమ మనుగడనే త్యాగం చేసిన త్యాగమూర్తులని కొనియాడారు. విలీన ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని పేర్కొన్నారు. అనంతరం మామిళ్లగూడెంలో కాళ్ల వాపు వ్యాధితో మృతిచెందిన ముచ్చిక లక్ష్మయ్య, ముచ్చిక సీతారామయ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఆయన వెంట జిల్లా పార్టీ అధ్యక్షుడు కురుసాల కన్నబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైసిపి జిల్లా యువజన అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వై రామలింగారెడ్డి, నాయకులు ఎండి ముసా, చిట్టిబాబు, సుధాకర్ (చిన్ని), అంజాద్, నర్సింహారెడ్డి, మన్మధహరి, లలితారెడ్డి, సంకురమ్మ తదితరులు పాల్గొన్నారు.