తూర్పుగోదావరి

మాస్టర్ ప్లాన్‌పై గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 8: ఆరు నెలల పాటు మేధావులు కసరత్తు చేసి అనుభవజ్ఞులైన నేతలు సైతం ఆమోద ముద్రవేయడంతో నగర ప్రణాళికాబద్ధ అభివృద్ధికి శ్రీకారం చుడుతున్న మాస్టర్ ప్లాన్‌పై ప్రతిపక్ష వైసిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని నగర అధికార పక్ష తెలుగుదేశం కౌన్సిల్ నేతలు ధ్వజమెత్తారు. దేశం కౌన్సిల్ నేతలు రాజమహేంద్రవర ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యూహాత్మకంగానే మాస్టర్ ప్లాన్‌పై కౌన్సిల్‌లో వైసిపి సభ్యులు అల్లరి చేశారని ఆరోపించారు. నగరాభివృద్ధికి కట్టుబడి సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అభివృద్ధి విజన్‌తో మేయర్, డిప్యూటీ మేయర్, కౌన్సిల్ సభ్యులంతా కృషి చేస్తున్నామన్నారు. టిడిపి చేసే అభివృద్ధికి చేతనైతే వైసిపి సహకరించాలి తప్ప ప్రజలను గందరగోళపర్చకూడదని హితవు పలుకుతున్నామన్నారు. వైసిపి ఫ్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి కుటుంబానికి సంబంధించిన 17 అభ్యంతరాలు రావడం విడ్డూరంగా ఉందన్నారు. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు మాట్లాడుతూ వైసిపి ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డికి పదవి కోతికి కొబ్బరి కాయ దొరికినట్టుగా వుందని ఆరోపించారు. వైసిపికి చెందిన 7 వార్డుల్లో సైతం రూ.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామని, అభివృద్ధి విషయంలో పార్టీ రహితంగా పని చేస్తున్నామని చెప్పారు. వైసిపి చేసే ఆరోపణలో ఏ ఒక్కటి రుజువు చేసినా టిడిపి సభ్యులు దేనికైనా సిద్ధమేనని సవాల్ చేశారు. హౌసింగ్‌లో రాత్రికి రాత్రే పేపర్లు మార్చిన దొంగబుద్ధులు వైసిపి ప్రదర్శించిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు అంతకాలం ఎమ్మెల్యేగా చేసినా వ్యాన్, లారీ స్టాండ్లను తరలించలేకపోయారని విమర్శించారు. తమ నేత గోరంట్ల బుచ్చియ్య చౌదరి ఆధ్వర్యంలో అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న టిడిపి నగరపాలక సంస్థలో ఎపుడూ తెలుగుదేశమే అధికారంలో వుంటుందన్నారు. వైసిపికి అభివృద్ధి కిట్టదని కార్పొరేటర్ పాలిక శ్రీను విమర్శించారు. అభివృద్ధికి సహకరించకుండా వైసిపి బురద జల్లడం సరికాదన్నారు. కార్పొరేటర్ కోసూరి చండీప్రియ మాట్లాడుతూ వైసిపి ప్లోర్ లీడర్ షర్మిలారెడ్డి అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో మరింత చులకన అవుతున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యురాలు మజ్జి పద్మ మాట్లాడుతూ క్రమ శిక్షణ కలిగిన టిడిపి నగరం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌తో శ్రీకారం చుట్టిందన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు శేఖర్, కిలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తుపానుతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ, డిసెంబర్ 8: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్ధా తుఫాను రాష్ట్రం తీరంవైప కదులుతున్న కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ తెలిపిన వివరాలు ప్రకారం వర్ధా తుఫాను గురువారం రాత్రికి విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 1060కిలోమీటర్లు, మచిలీపట్టనానికి 1150కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. నాబోయే నాలుగురోజుల్లో ఈ తుపాను ఉత్తరంగాను, వాయవ్యంగా రాష్రంలోని తీరం వెంబడి పయనించే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీని ప్రభావంతో 11వ తేదీ నాటికి రాష్ట్రం తీరం వెంబడి 40నుండి 60కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచి తేలికపాటి లేద భారీ వర్షాలు పడే అవకాసం ఉందని వాతావరణ శాఖ తెలియజేసిందని తెలిపారు. అంతే కాకుండా సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి చేపలువేటకు వెల్లవద్దని కలెక్టర్ అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. తుపాను హెచ్చరిక కారణంగా జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ అధికారులు, సిబ్బందికి శెలవులు ఇవ్వవద్దని, శెలవుపై ఉన్నవారు వెంటనే విధుల్లోకి చేరాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.