తూర్పుగోదావరి

ఒఎన్‌జిసి మహిళా ఫోరం భూగర్భ పరిశోధనా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 19: రాజమండ్రి ఒఎన్‌జిసి ఉమెన్ డెవలప్‌మెంట్ ఫోరం సభ్యులు శనివారం కెజి బేసిన్ పరిధిలో భూగర్భ పరిశోధనా పర్యటన సాగించింది. బేస్‌కాంప్లెక్సు నుండి సీనియర్ అధికారుల సమక్షంలో రాజమండ్రి ఒఎన్‌జిసి అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, అసెట్ మేనేజర్ దేబశిష్ సన్యాల్ ఈ పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌగోళిక అధ్యయనాలు, పరిశోధనలు ఆయిల్ పరిశ్రమలో ఒక భాగమని, ఈ పర్యటన ద్వారా మహిళా ఉద్యోగులు విజ్ఞానాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఒఎన్‌జిసి ఫార్వార్డ్ బేస్, కెజి బేసిన్ జిఎం(జియాలజీ) పిఆర్ భావన ఆధ్వర్యంలో మహిళా ఫోరం సభ్యుల పర్యటన కొనసాగింది. దుద్దుకూరు, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాల్లోని రాళ్లను, మట్టిని మహిళా ఫోరం సభ్యులు సేకరించారు. వీటిపై పరిశోధనలు నిర్వహించి నివేదికను రూపొందిస్తారు.

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
కరప, డిసెంబర్ 19: కరపలో డ్రైనేజీ శాఖకు చెందిన భూముల అక్రమణ తొలగింపులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డ్రైనేజీ శాఖకు చెందిన భూములను దశాబ్దాల కాలంగా ఆక్రమణ దారులు సాగుచేసుకుంటున్నారు. అయితే ఆక్రమణలు తొలగించాలని కొందరు ఇటీవల లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో శనివారం రెవెన్యూ అధికారులు, పోలీసులు భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆక్రమణదారుల్లో బడాబాబులు, పారిశ్రామిక వేత్తలు 26 మంది ఉండగా, వారిని వదిలేసి కేవలం దళితుల భూములను లాక్కోవడం అన్యాయని ఎమ్మార్పీఎస్ నాయకులు సవరపు చిన పాపారావు, ఇమ్మానియేలు, దయానంద్ తదితరులు అధికారులతో వాదనకు దిగారు. లోకాయుక్త ఆదేశాల మేరకే తాము పనిచేస్తున్నామని, మీరు కూడ ఆక్రమణలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు బదులిచ్చి భూముల స్వాధీనానికి ప్రయత్నించడంతో, ఘటనా స్థలంలో దళిత మహిళ సొమ్మిసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను 108లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం తహసీల్దారు బి శ్రీదేవి అధ్వర్యంలో సిబ్బంది ఆక్రమణలను స్వాధీనం చేసుకున్నారు.
వెలిచేరులో గోవుకు సీమంతం
ఆత్రేయపురం, డిసెంబర్ 19: మండలంలోని వెలిచేరు గ్రామంలో గోవుకు సీమంతం వేడుకలు నిర్వహించారు. వరద సూరిబాబు, సత్యవేణి దంపతులు పోషణలో ఉన్న ఆవు గర్భం దాల్చి తొమ్మిది మాసాలు కావడంతో శనివారం సీమంతం వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆవుకు పసుపు, కుంకుమ, గంధంతో పూజించి, గాజులు, నగలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ముతె్తైదువులకు సాంప్రదాయబద్ధంగా తాంబూలం అందజేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు గ్రామంలో అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ధనుర్మాసం కావడంతో ఇటువంటి గోపూజా కార్యక్రమాలు నిర్వహించడం గ్రామానికి శుభప్రదమని పండితులు పి వీరభద్రరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీమంత నిర్వాహకుడు సూరిబాబు మాట్లాడుతూ ఆవును తమ బిడ్డలతో సమానంగా పెంచుకున్నామని, అందుకే సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు కునాదిరాజు రంగరాజు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.
ఏజన్సీ ఆశ్రమ పాఠశాలలకు వైఫై సేవలు
ఐటిడిఎ పిఒ చక్రధరబాబు
రాజవొమ్మంగి, డిసెంబర్ 19: ఏజెన్సీలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలన్నిటికీ వైఫై సేవలు కల్పించనున్నామని ఐటిడిఎ పిఒ కెవిఎన్ చక్రధరబాబు అన్నారు. ఇప్పటికే ఏజెన్సీలో 35 పాఠశాలలను ఇందు నిమిత్తం గుర్తించామని, సిగ్నల్, విద్యుత్ సదుపాయం ఉన్న అన్ని పాఠశాలలకు ఈ సదుపాయం కల్పిస్తామన్నారు. మండలంలో జడ్డంగి శివారున ఉపాధి పథకంలో నిర్మిస్తున్న రహదారి పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్‌లో ఈ ఏడాది నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి జరుగుతుందన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని, విద్యార్థులకు ప్రత్యేక డైట్ అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ప్రతి 15 రోజులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని స్థానిక వైద్యాధికారి రవిచంద్రను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, వీలైనంత ఎక్కువ మందికి పని కల్పించాలన్నారు. సమాజానికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎపిఒ అప్పలరాజును ఆదేశించారు. ఏజెన్సీలో ఎనిమిది ప్రధాన రహదారులు అటవీశాఖ అభ్యంతరాల వలన నిలిచిపోయాయని, నెల రోజుల్లో తిరిగి పనులు ప్రారంభించడానికి కృషి చేస్తామన్నారు.
తక్కువ రేటుకు విక్రయించి మోసపోవద్దు!
అడవుల నుండి గిరిజనులు కష్టపడి సేకరించిన వస్తువులను దళారులకు తక్కువ రేటుకి విక్రయించి మోసపోవద్దని పిఒ కోరారు. ఆయన రాజవొమ్మంగిలో విలేకరులతో మాట్లాడుతూ షీకాయి కిలో రూ.8 నుండి 20కి, ముషిణి గింజలు రూ. 30 నుండి 33కి, ఇండుగ పిక్కలు రూ.18 నుండి 20కి పెంచామన్నారు. అన్ని జిసిసి డిపోల్లో సేల్స్ మేన్లను నియమించి సక్రమంగా నిత్యావసరాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిఇ డేవిడ్ రాజు, తహసీల్దారు పద్మావతి, ఎంపిడిఒ వీరన్న తదితరులు పాల్గొన్నారు.