తూర్పుగోదావరి

26న నాలుగు కిలోమీటర్ల తిరంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 21: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచశాంతిని ఆకాంక్షిస్తూ ఈనెల 26వ తేదీన 4 కిలోమీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించనున్నట్లు కార్పొరేటర్ బొంతా శ్రీహరి చెప్పారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక 4వ డివిజన్‌లోని రాజేంద్రనగర్ నుంచి 26వ తేదీన ఉదయం 9.30గంటలకు టిటిడి కళ్యాణమండపం, నందంగనిరాజు జంక్షన్, కంబాలచెరువు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా పుష్కరాలరేవు వద్దగల రాజరాజ నరేంద్రుడి విగ్రహం వరకు పతాకంతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈపతాకాన్ని ఎగురవేసేందుకు సుమారు 10వేల మంది విద్యార్థులను సమీకరిస్తామన్నారు. కులమతాలకు అతీతంగా పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈకార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోలీసులు కూడా ఈకార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈసందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈసమావేశంలో నరేంద్ర, కె జ్యోతిస్వరూప్, యాదగిరి, జి రాము తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ధ్రువీకరణ పత్రాలను విచారించి ఇవ్వాలి
జెసి సత్యనారాయణ
కాకినాడ, జనవరి 21: గిరిజనులకు జారీ చేసే కుల ధృవీకరణ పత్రాలు పూర్తి విచారణ జరిపి సంబంధిత రెవెన్యూ అధికారులు ఇవ్వాలని జెసి ఎస్ సత్యనారాయణ తెలిపారు. శనివారం డ్వామా సమావేశపు హాలులో ఎపి హ్యూమన్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసిన ఎస్టీ కులానికి ఇచ్చే కుల ధృవీకరణ పత్రాల జారీ, పరిశీలన ఒక్కరోజు సెన్సిటైజేషన్ శిక్షణా కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ మాట్లాడుతూ కుల ధృవీకరణ పత్రాల మంజూరులో పరిశీలన జరిపి ఇచ్చి రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ధృవీకరణ పత్రాలు ఇచ్చేటప్పుడు వారి సాధక బాధలు తెలుసుకోవాలని సూచించారు. ఇంకా కలెక్టరేట్ సూపరింటెండెంట్ సునీల్‌బాబు, రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కెవిఎస్‌ఎన్ మూర్తిలు పత్రాలు ఇవ్వడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, ఆర్‌ఐలు, విఆర్‌ఓలు, గిరిజన సంక్షేమ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.