తూర్పుగోదావరి

కాతేరు అవినీతి వెనుక అధికార పార్టీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 21: కాతేరు గ్రామపంచాయితీలో జరిగిన రూ. కోటి 10లక్షల నిధుల దుర్వినియోగం వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని వైసిపి నాయకుడు కందుల దుర్గేష్ ఆరోపించారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పంచాయితీలో కుంభకోణం వెలుగుచూసినా అధికార పార్టీ నాయకుల వౌనంగా ఉండటం ఈ అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోందన్నారు. ఈకుంభకోణంలో పంచాయితీ కార్యదర్శిని, ఇఓపిఅండ్‌ఆర్‌డిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బహిర్గతం చేయాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేస్తామన్నారు. ధవళేశ్వరం, రాజోలు పంచాయితీల్లో కూడా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. పంచాయితీల్లో జన్మభూమి కమిటీలు పెత్తనం సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని గ్రామాల్లో పాలన అస్తవ్యస్థంగా ఉందన్నారు. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా కనీస వౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. విలీన గ్రామాల్లో 3 రెట్లు పన్నులు పెంచడం పట్ల దుర్గేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
విస్తృతంగా కల్వర్టులు తనిఖీ
రాజవొమ్మంగి, జనవరి 21: మావోయిస్టులు మందుపాతరలు అమర్చే అవకాశమున్నందున సాయుధ పోలీసులు రాజవొమ్మంగి నుండి సింగంపల్లి వరకు రహదారుల కింద ఉన్న కల్వర్టులను శనివారం తనిఖీ చేశారు. ఆర్‌అండ్‌బి రహదారికి ఆనుకొని ఉన్న పలు కల్వర్టులను, వంతెనలను నిశితంగా తనిఖీ చేసినట్టు ఎస్సై రవికుమార్ తెలిపారు. దూసరపాము సమీపంలో రింగ్ రోడ్డులో ఆకస్మికంగా వాహనాల తనిఖీ చేపట్టారు. విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి, సారా వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణానిరోధించేందుకు విస్తుృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన రికార్డులు లేని 22 వాహనదారుల నుండి రూ.6000 వసూలు చేశామని ఎస్సై రవికుమార్ తెలిపారు.
భక్తులతో పోటెత్తిన వాడపల్లి వెంకన్న ఆలయం
ఆత్రేయపురం, జనవరి 21: కోనసీమ తిరుపతిగా పేర్గాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. వేకువ ఝామునుండీ వివిధ వాహనాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అయితే భారీగా తరలివచ్చిన వాహనాలతో వాడపల్లి కిటకిటలాడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వాహనాలు వాడపల్లి గ్రామంలోకి రాకుండా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని లొల్ల వంతెన వద్ద నిలిపివేసి, అక్కడ నుండి కాలి నడకన శ్రీవారి ఆలయానికి భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు సహకరించారు. ఆలయ ఇవో భాగవతుల వెంకటరమణమూర్తి, దేవస్థాన సిబ్బంది మీసాల రాధాకృష్ణ, సాయిరాం, శ్రీదేవి, శివ తదితరులు ఆలయంలోని భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ చేశారు.