తూర్పుగోదావరి

జిల్లాలో నాలుగు నోడల్ స్టోర్లు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జనవరి 21: జిల్లాలో ఈ ఏడాది కాట్రేనికోన, అడ్డతీగల, రాజవొమ్మంగి, రంపచోడవరం మండలాల్లో రూ.40 లక్షల వ్యయంతో నోడల్ స్టోర్లు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) లైలీహుడ్ (్ఫమ్) డైరెక్టర్ శ్రీనివాస బాబా చెప్పారు. ఎపి గ్రామీణ సమ్మిళత అభివృద్ధి పథకం ద్వారా మండల నోడల్ స్టోర్ల ఏర్పాటు అంశంపై ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంపికచేసిన సుమారు 50 మంది ఎపిఎంలు, డిపిఎంలు, ఆర్‌ఆర్‌సి ఎపిఎంలు, సిసిలకు స్థానిక టిటిడిసిలో రెండు రోజులుగా ఇస్తున్న శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సెర్ప్ డైరెక్టర్ శ్రీనివాస బాబా మాట్లాడుతూ ప్రతీ మండల పరిధిలోని చిన్న చిన్న కిరాణా దుకాణాలను అనుసంధానం చేస్తూ మండల స్థాయిలో రూ.10 లక్షల వ్యయంతో నోడల్ స్టోర్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ స్టోర్ ఏర్పాటు వల్ల మండల పరిధిలో అన్ని దుకాణాలకు అసరమైన సరుకులు అతి తక్కువ ధరలో వస్తాయని, అలాగే రవాణా ఛార్జీలు బాగా తగ్గి, తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు లభిస్తాయన్నారు. అలాగే డ్వాక్రా మహిళలు తయారుచేసిన పలు రకాల ఉత్పత్తుల విక్రయానికి ఈ దుకాణాలు వేదికలుగా ఉంటాయన్నారు. నోడల్ స్టోర్‌ల ఏర్పాటు నిర్వహణ తదితర అంశాలపై సెర్ప్ కన్సల్టెంట్ రమేష్, మార్ట్ సభ్యులు షాహీద్‌ఖాన్, సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, డిపిఎంలు హేమంత్, శరత్‌లు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎపిఎంలు, డిపిఎంలు తదితరులు హాజరయ్యారు.
చంద్రపాలెంను ఒడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి
కాకినాడ ఆర్డీవో అంబేద్కర్
సామర్లకోట, జనవరి 21: మండలంలోని చంద్రంపాలెం గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్) గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థులు, అన్ని వర్గాలు సహకరించాలని కాకినాడ ఆర్డీవో బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. శనివారం చంద్రంపాలెం గ్రామంలో బహిరంగ మలవిసర్జన నిర్మూలనపై ఇంటి ఇంటికీ వెళ్ళి బొట్టుపెట్టి వినూత్నంగా నిర్వహించిన ప్రచారంలో ఆర్డీవో అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపిడిఒ బి నారాయణమూర్తి అధ్యక్షత వహించారు. అలాగే ఒడిఎఫ్ గ్రామానికి సహకరించాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో వినూత్నంగా ఆడియో టేపుల ద్వారా, మైకుల ద్వారా ప్రచారం నిర్వహించారు. బహిరంగ మలవిసర్జన చేస్తే ఇక నుండి జరిమానాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ మల విసర్జన నిర్మూలన కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ఆర్డీవో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ తలాటం వెంకటరమణ, వార్డు సభ్యులు, కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.