తూర్పుగోదావరి

అన్నవరం ఇఒపై దిశ కమిటీకి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 21: జిల్లా కేంద్రం కాకినాడలోని రాజాట్యాంక్ ఆవరణలో నిర్వహిస్తున్న వ్యవసాయ ఫల పుష్ప ప్రదర్శనలో ఏర్పాటుచేసిన అన్నవరం శ్రీ సత్యదేవుని నమూనా ఆలయంలో ప్రసాదం విక్రయించకపోవడం పట్ల రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల కోరిక మేరకు తక్షణం ఆలయంలో ప్రసాదాన్ని అందుబాటులో ఉంచాలని అన్నవరం దేవస్థానం ఇఒ కె నాగేశ్వరరావును ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో శనివారం జరిగిన దిశ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపికి సోషల్ వర్కర్ బొడ్డు వెంకటరమణమూర్తి ఈ సమస్యపై వినతిపత్రాన్ని సమర్పించారు. మూడురోజుల క్రితమే జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళామని, ఆలయ ఇఒపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వెంటనే ఎంపి మురళీమోహన్, ఇఒ నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడారు. సత్యదేవుని ప్రసాదాన్ని ఆలయంలో ఎందుకు అందుబాటులో ఉంచలేదని ప్రశ్నించారు. ప్రతి ఏటా ప్రసాదం విక్రయిస్తుండగా, ఈ ఏడాది ఎందుకు విక్రయించలేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తక్షణం అందుబాటులో ఉంచాల్సిందిగా ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావుకు సూచించారు.
అల్లవరం ఎంపిపిగా ఝాన్సీ ఏకగ్రీవ ఎన్నిక
అల్లవరం, జనవరి 21: అల్లవరం మండల పరిషత్ అధ్యక్షురాలిగా బొడసకుర్రు ఎంపిటిసి చింతా ఝాన్సీలక్ష్మీగౌరి, వైస్ ఎంపిపిగా అడపా బాల ఉమాసుందరి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఎన్నికల అధికారిగా పంచాయితీ రాజ్ డిఇఇ మురళీకృష్ణ పాల్గొని ఎన్నికలు నిర్వహించారు. ఎంపిపి అధ్యక్ష పదవికి ఝాన్సీలక్ష్మీగౌరి, వైస్ ఎంపిపి పదవికి బాల ఉమాసుందరి మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి మురళీకృష్ణ ప్రకటించారు. అనంతరం ఎంపిపి, వైస్ ఎంపిపిలతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఎంపిపిగా కొనసాగేందుకు గుబ్బల మాతాకస్తూరి రెండున్నరేళ్లు, ఆ తర్వాత కాలాన్ని ఝాన్సీలక్ష్మీగౌరి కొనసాగేటట్లు అప్పట్లో నాయకుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మాతా కస్తూరి తన పదవికి రాజీనామా చేయడం ఆమె నిజాయితీకి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా గుబ్బల మాతాకస్తూరిని ఎమ్మెల్యే అభినందించారు. గతంలో ఇదే విధంగా ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ నాయకులు అమలు చేయలేకపోయారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. అనంతరం ఎంపిపిగా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మీగౌరిని బొడసకుర్రు గ్రామస్థులు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ చిక్కాల గణేష్, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రవౌళి, ఏరియా ఆసుపత్రి ఛైర్మన్ మెట్ల రమణబాబు, జడ్పీటీసీలు వేగిరాజు ప్రవీణ, నాగిడి నాగేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్ గునిశెట్టి చినబాబు, దాట్ల గోపిరాజు, వేగిరాజు వెంకట్రాజు, చింతా శ్రీనివాస్, బాబ్జి, ఎంపిడిఒ వి శాంతామణి, తహసీల్దార్ వి సత్యవతి, ఎంపిటిసిలు పాల్గొన్నారు.