తూర్పుగోదావరి

ముగిసిన గోకార్డ్ రేసింగ్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, మార్చి 25: మండలంలోని సూరంపాలెం ఆదిత్య క్యాంపస్‌లో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సింగార్ ప్రో కార్టింగ్ ఛాంపియన్‌షిప్ -2017 పేరిట నిర్వహిస్తున్న గోకార్డ్ రేసింగ్ పోటీలు శనివారం విజయవంతంగా ముగిశాయి. ఆదిత్య విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ నల్లమిల్లి సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రేసింగ్‌లో శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (హైదరాబాద్) టీం అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. తొలుత ఈ ఫైనల్ ఫోటీలను ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 12 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ రేసింగ్ నిర్వహించారు. రన్నర్స్‌గా గ్లోబుల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ (బెంగుళూరు) నిలిచింది. పీపుల్ ఛాంపియన్ అవార్డు ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు లభించింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా గోకార్డ్ రేసింగ్‌లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. సీజర్ ఇన్నోవేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇన్నో కార్డ్ రేసింగ్ గతంలో ఎన్నో చూశామని, ఇంత చక్కగా, ఉత్సాహంగా ఎక్కడా జరగలేదన్నారు. పాల్గొన్న అన్ని టీంలు చివరి వరకూ పోటీల్లో తలపడడం ఇదే ప్రథమమన్నారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జెఎన్టీయు మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ కె హేమచంద్రారెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. జ్ఞాపికతోపాటు నగదును కూడా అందజేశారు. నిర్వాహకులను అభినందించారు. దేశం మొత్తంపై ఏడు రాష్ట్రాలకు చెందిన 20 టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి వలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టికె రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ పాల్గొన్నారు.
అమ్మను కోల్పోఋనా.. చదువులమ్మ ఒడిలోకి
శంఖవరం, మార్చి 25: ఏ విద్యార్థికి రాని విషాద పరిస్థితి జి కొత్తపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఈగల పైడితల్లికి ఎదురయ్యింది. ఒకపక్క అమ్మను కోల్పోయి, మరోపక్క పదవ తరగతి పరీక్ష రాయడం. వివరాల్లోకి వెళితే... శంఖవరం మండలం జి కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈగల పైడితల్లి శంఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తోంది. ఇదిలా ఉండగా పైడితల్లి తల్లి ఈగల లక్ష్మి తన పుట్టినిల్లైన విశాఖ జిల్లాలోని పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. దీంతో పైడితల్లి తీవ్రమైన శోకతప్త హృదయంతో దిగులు చెంది ఒక పక్క అమ్మను కడసారి చూసేందుకు వెళ్ళాల్సి ఉన్నా, కొందరు గ్రామస్థులు, కుటుంబ సభ్యుల సలహా మేరకు విషాద వదనంతో శంఖవరం హైస్కూలులో జరిగే పదవ తరగతి పరీక్షకు శనివారం హాజరయ్యింది. పరీక్ష పూర్తికాగానే కుటుంబ సభ్యులు పైడితల్లిని తన తల్లి లక్ష్మిని కడసారి చూసేందుకు తీసుకెళ్ళారు.