తూర్పుగోదావరి

ఎంపిటిసి సభ్యులంతా గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, మార్చి 31: గండేపల్లి మండల ఉపాధ్యక్షుని ఎన్నిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపిడిఒ కె రమేష్ నిర్వహించారు. అయితే సమావేశానికి ఒక్క సభ్యుడు కూడ హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి సూర్యనారాయణ తెలిపారు. గతంలో వైస్ ఎంపిపిగా మురారి ఎంపిటిసి పోతుల మోహనరావు పనిచేశారు. అతను పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల అనివార్యమైంది. ఈ నేపథ్యంలో టిడిపి పరిశీలకులు కుంచే రాజా, యర్రంశెట్టి బాబ్జి మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టరు కందుల కొండయ్యదొర ఆధ్వర్యంలో అభ్యర్థిని పోటీకి దింపుతామని చెప్పారు.
కాపు కార్పొరేషన్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తపేట, మార్చి 31: కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధితో అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు పిలుపునిచ్చారు. స్థానిక కాపు కల్యాణ మండపంలో శుక్రవారం కాపు కార్పొరేషన్ సంక్షేమ పథకాలపై అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కొత్తపేట తెలగా అభ్యుదయ సంఘ డైరెక్టర్ సలాది రామకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు పాల్గొని ప్రసంగిస్తూ ఇప్పటి వరకూ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో మూడు లక్షల మందికి రుణాలిచ్చామన్నారు. అలాగే కార్పొరేషన్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నట్టు తెలిపారు. విదేశాల్లో చదువుకొనే వారికి ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్టు, అయిదు వందల మంది వరకూ విద్యార్థులకు సహాయం అందించినట్టు తెలిపారు. అయితే రుణాలను కేవలం సబ్సిడీ తీసుకొనేందుకు కాకుండా స్వయం ఉపాధి పొందేందుకు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావు మాట్లాడుతూ కాపులకు గుర్తింపునిచ్చేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి దీని ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో రజనీ, రమ్యశ్రీ, గంధం గోపాల్, ఏసు, మైగాపుల గుర్రయ్యనాయుడు, ముత్యాల బాబ్జి, కంఠంశెట్టి శ్రీనివాస్, ధరణాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
శంఖవరం, మార్చి 31: స్థానిక అంబేద్కర్ నగర్‌లోని 3వ నెంబర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం మండల ప్రత్యేకాధికారి, సెట్రాజ్ సిఇఒ శ్రీనివాస్ తనిఖీ చేశారు. పల్లెక్రాంతిలో భాగంగా ఎంపిడిఒ శ్రీనుతో కలిసి ప్రత్యేకాధికారి శ్రీనివాస్ ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. 3వ నెంబర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని గతంలో రెండు దఫాలు ఎంపిడిఒ శ్రీను తనిఖీలు నిర్వహించగా, ఒక దఫా వంట తక్కువ తయారుచేయడం, మరో దఫా అధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా అంగన్‌వాడీ కేంద్రం మూసివేసి కనిపించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మిని మండల పరిషత్ కార్యాలయానికి పిలిపించి, హెచ్చరించి పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తనిఖీల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీచేయగా, 24మంది చిన్న పిల్లలు, 16మంది గర్భిణీలు, 16మంది బాలింతలకు పౌష్ఠికాహారం అందించాల్సి ఉండగా, కనీసం ఒక్కరికి కూడా తినేందుకు ఆహారం తయారుచేయకపోవడం, రికార్డులు లేకపోవడం పట్ల అధికారులు మండిపడ్డారు. దీనిపై అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మి తమ కేంద్రానికి సరుకులు సరఫరా కాలేదని చెప్పడంతో, మిగిలిన కేంద్రాలకు సరుకుల ఎలా సరఫరా అయ్యాయని అధికారులు ప్రశ్నించారు. లక్ష్మి చెప్పిన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో తొలుతగా రికార్డులు తీసుకురావాలని ఆదేశించారు. దీనిపై ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఎంపిడిఒ శ్రీను మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్లక్ష్యంగా నిర్వహిస్తోందని, ఇప్పటికే రెండుమార్లు హెచ్చరించి వదిలేశామని, అయినప్పటికీ తీరుమారకపోగా మరింత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తోందన్నారు. దీనిపై అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌తో రికార్డుల పరిశీలన చేయించి, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనిపై అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సుజాత మాట్లాడుతూ సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్తకు మెమో జారీచేస్తున్నట్లు తెలిపారు.