తూర్పుగోదావరి

రూ.8కోట్లతో హోమియో ఆసుపత్రి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో ఆసుపత్రిని రూ. 8కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం ఆయన రూ. 2.10కోట్లతో పరీక్షలు, పరిపాలనా భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి, విస్తరణకు 1500 నుంచి 2వేల గజాలు అవసరం అవుతుందని, ఇందుకోసం ఆర్ట్స్ కళాశాలకు చెందిన స్థలాన్ని సేకరించే ఈవిషయమై విద్యాశాఖతో చర్చిస్తామన్నారు. రాజమహేంద్రవరం హోమియో వైద్యకళాశాలలో 18 సీట్లతో పిజి కోర్సులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు నివారణకు ప్రజలు హోమియో వైద్యాన్ని విశ్వసిస్తున్నారని, హోమియో వైద్యానికి పూర్వవైభవం తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో సాంప్రదాయ ఆయుర్వేద, హోమియో వైద్యరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా హోమియోవైద్యానికి ప్రాధాన్యతనిస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎంపి మాగంటి మురళీమోహన్, ఆయుష్ కమిషనర్ ఎం రేవతి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యభగవాన్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
సిఎం ఆరోగ్యకేంద్రం ఆకస్మిక తనిఖీ
అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్థానిక బృహన్నలపేటలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఒపి విభాగం, మందులు పంపిణీ, టెలిమెడిసిన్ విభాగాలను పరిశీలించారు. అయితే మంత్రి తనిఖీ చేసిన సమయంలో రోగుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గమనించిన ఆయన సిఎం ఆరోగ్య కేంద్రాలపై ప్రచారం కల్పించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈకేంద్రంలో అందిస్తున్న వైద్యసేవలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. అనంతరం తుమ్మలావలోని ఫస్ట్ రిఫరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు.
ఎంసెట్ పరిశీలించిన మంత్రి కామినేని
గండేపల్లి, ఏప్రిల్ 28: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలో జరుగుతున్న ఎం సెట్ ఆన్‌లైన్ పరీక్షలను శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య నభ్యసిస్తే మేథస్సు అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం కళాశాల క్యాంపస్‌ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. క్యాంపస్ డైరెక్టర్ మేడపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. కార్యక్రమంలో ఎంసెట్ చీఫ్ సూపరింటెండెంటు వి శ్రీనివాసరావు, పికె రామకృష్ణారావు, వైస్ చైర్మన్ ఎన్ సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సస్పెండైన ఇఒ వేలం నిర్వహణ..!
దేవాదాయ శాఖలో చోద్యం

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: సస్పెండైన ఇఓ ఖాళీ స్థలం లీజు వేలం ప్రక్రియ నిర్వహించడం దేవాదాయ శాఖకే చెల్లింది. వివిధ ఆరోపణలపై రాజమహేంద్రవరంలోని గౌతమీ జీవకారుణ్యం సంఘం ఇఒ సస్పెండయ్యారు. 2016 డిసెంబర్‌లో సస్పెండైన ఈ అధికారి శుక్రవారం తాను ఇంకా అధికారంలో ఉన్న అధికారినే అన్నట్టుగా ఖాళీస్థలం లీజు వేలంలో పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ లీజు వ్యవహారం కూడా పాటదారులు రింగయ్యేందుకు దోహదపడ్డారని ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి.
అసలు విషయంలోకెళితే..రాజమహేంద్రవరంలోని శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘం తాలూకు 70 సెంట్ల ఖాళీ స్థలం స్థానిక క్వారీ జంక్షన్ వద్ద ఉంది. ఈ స్థలానికి లీజు వేలాన్ని శుక్రవారం నిర్వహించారు. పలువురు పాటదారులు హాజరైనప్పటికీ తనకు కావాల్సిన వారికి దక్కించేందుకు సదరు సస్పెండైన అధికారి వేలంలో పాల్గొని రింగు చేసి లీజును ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో కొంతమంది దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

విద్యుదాఘాతంతో బాలుడు మృతి
ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ కార్యాలయం వద్ద మృతదేహంతో ధర్నా
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందిన తీటి సురేంద్రకుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు శుక్రవారం సాయంత్రం ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ కార్యాలయం వద్ద సురేంద్రబాబు మృతదేహంతో ఎదుట ధర్నా నిర్వహించారు. గురువారం షెల్టాన్ హోటల్ వద్ద సురేంద్రకుమార్, తన సోదరుడు రవికుమార్‌తో కలిసి అత్త ఇంటి వద్ద ఆడుకుంటుండగా హైటెన్షన్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈసంఘటనలో రవికుమార్, వారి బంధువు రాశి గాయపడ్డారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని, అతని సోదరుడు రవికుమార్ తీవ్రంగా గాయపడ్డాడని ఆరోపించారు. ఇంత ఘోరం జరిగినా అధికారులు కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద కుటుంబానికి చెందిన సురేంద్రబాబు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా సురేంద్రబాబు మృతదేహాన్ని కార్యాలయం ఎదురుగా పెట్టి దిగ్బంధించారు. సమీపంలోని గోదావరిగట్టురోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా డిఇ జి శ్యాంబాబు స్పందించి మృతుడి కుటుంబానికి తన వంతుగా రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. మృతుడి కుటుంబానికి రూ. 2లక్షల పరిహారం అందేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. బాలుడి తల్లి కనకలక్ష్మి, టిడిపి కార్పొరేటర్ పాలిక శ్రీను, వైసిపి నాయకుడు మార్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానికులు ఈధర్నాలో పాల్గొన్నారు.
మంటల్లో రైలు
పరుగులెత్తించిన అగ్నిమాపకశాఖ మాక్‌డ్రిల్
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: నిత్యం రద్దీగా ఉండే రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం అగ్నిమాపకశాఖ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన మాక్ డ్రిల్ రైల్వేస్టేషన్‌లోని ప్రయాణీకులను పరుగులెత్తించింది. మాక్‌డ్రిల్‌లో భాగంగా 3వ నెంబర్ ప్లాట్‌ఫారంపై ఆగి ఉన్న ఒక ప్యాసింజర్ రైలులో అధికారులు, సిబ్బంది పొగ పెట్టారు. దీంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణీకులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక, ఆర్పీఎఫ్ సిబ్బంది రైలులోని డమీ ప్రయాణీకులను సురక్షితంగా దించి వేసి, ప్రథమ చికిత్స చేశారు. ఆపదలో ఉన్న ప్రయాణీకులకు ప్రథమ చికిత్స అందించే అంశంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ఎంపి ఎం మురళీమోహన్, మేయర్ పంతం రజనీశేషసాయి మాక్‌డ్రిల్‌ను పరిశీలించారు. స్టేషన్ మేనేజర్ బిహెచ్ సుబ్రహ్మణ్యశాస్ర్తీ, అగ్నిమాపకశాఖ అధికారి పార్థసారధి, ఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్‌పై విమర్శలు తగదు
బ్రాహ్మణ కార్పొరేషన్ డిస్ట్రిక్టు కోఆర్డినేటర్ రాణి శ్రీనివాస్
కాకినాడ సిటీ, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుచేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది బ్రాహ్మణులు లబ్ధిపొందుతున్నారని, రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డిస్ట్రిక్టు కోఆర్డినేటర్ రాణి శ్రీనివాస్ అన్నారు. బ్రాహ్మణ చైతన్యవేదిక జల్లా అధ్యక్షుడు డిఎస్ కృష్ణ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం స్థానికంగా జరిగింది. ఈ సమవేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటైన బ్రాహ్మణ చైతన్యవేదిక ద్వారా రాష్టవ్య్రాప్తంగా నివాసం ఉంటున్న బ్రాహ్మణుల్లో చైతన్యం తీసుకువచ్చి వారందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. పారిశ్రామిక వేత్తలుగా బ్రాహ్మణులు ఎదిగేందుకు అవసరమైన రుణ సదుపాయాలను కల్పించడంతో ఈ పథకానికి మంచి స్పందన లభించిందన్నారు. జిల్లా నుండి రుణాల కోసం 650 దరఖాస్తులు రాగా వాటిలో అర్హులైన వారిని ఎంపికచేసినట్టు తెలిపారు. రుణాలు మంజూరు కానివారు ఇతర రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో దుష్పప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ విమర్శించారు. సమావేశంలో కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వూరి సురేష్, జిల్లా అధికార ప్రతినిధి విఠల్‌నాధ్, రాయవరపు సత్యభామ, ఆకెళ్ల ప్రసాద్, సుభారాణి, సౌజన్య, శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డులో రూ.1.80 కోట్లతో గోదాము
రూ.70 లక్షలతో షాపింగ్ కాంప్లెక్సు

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: తూర్పు గోదావరి జిల్లాలో అతి పెద్ద మార్కెట్ యార్డుగా వున్న రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో రూ. కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రూ. 1.80 కోట్ల కేంద్ర నిధులతో 3 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాము నిర్మాణం పూర్తయింది. మార్కెట్ యార్డు ప్రాంగణంలోని గోదాముల్లో రైతు బంధు పధకంలో రైతులు ధాన్యం, ప్రత్తి, మొక్కజొన్న, జీడి గింజలు నిల్వ చేసుకుంటున్నారు. గోదాములు, ఫ్లాట్ ఫారాలతో పాటు ఇరవై షాపుల సముదాయాన్ని రూ.70 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేశారు.
ఈ మార్కెట్ కమిటీ లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సాధిస్తోంది. 2015-16కు సంబంధించి రూ.4.87 కోట్లు ఆదాయం సాధించగా 2016-17లో ఇప్పటికే రూ.5.50 కోట్ల ఆదాయం సాధించింది. వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం మార్కెట్ సెస్సుపై ఈ ఆదాయాన్ని సాధిస్తోంది. ఇదిలా వుండగా రైతుల ప్రయోజనార్ధం ఈ మార్కెట్ యార్డు ప్రాంగణంలో వున్న భూసార పరీక్షా కేంద్రాన్ని విస్తరించేందుకు మార్కెట్ కమిటీ రూ.5 లక్షల నిధులను కేటాయించి అభివృద్ధి చేయడం వల్ల ఐదారు వేల భూసార పరీక్షలను నిర్వహించేందుకు వీలైనట్టు కార్యదర్శి ఎన్‌ఆర్‌జి చౌదరి చెప్పారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఈ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణా సరిహద్దులో చెట్టి ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు ద్వారా రూ. 16.50 ఆదాయాన్ని మూడు నెలల్లోనే సాధించామని కార్యదర్శి తెలిపారు.
జిఎస్‌టిపై వాణిజ్య పన్నుల శాఖ అవగాహన సదస్సులు
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: మే నెల నుంచి అమల్లోకి రానున్న జిఎస్‌టిపై వాణిజ్య పన్నుల శాఖ వ్యాపార వర్గాలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో శుక్రవారం వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ డి రమేష్ అవగాహన కల్పించారు. రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ ప్రాంతాల్లో వ్యాపార వర్గాలకు జిఎస్‌టిపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌లో జిఎస్‌టి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో సోదాహరణంగా తెలియజేశారు. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

బాహుబలి ప్రీమియర్
షోకోసం వివాదం
- అయిదు వాహనాలు ధ్వంసం

అమలాపురం ఏప్రిల్ 28: ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి-2 చిత్రం ప్రిమియర్ షోకోసం మెగా ఫ్యాను, ప్రభాస్ ఫ్యాన్ మధ్య చెలరేగిన వివాదంలో అయిదు కార్లు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళితే..బహుబలి-2 చిత్రం విడుదల సందర్భంగా గురువారం రాత్రి అమలాపురంలో మల్లీప్లెక్స్ థియేటర్ వద్ద మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ అభిమానుల మధ్య వివాదం చెలరేగింది. మెగా ఫ్యాన్ ప్రిమియర్ షో వేయకుండా అడ్డుకున్నారని ప్రభాస్ ప్యాన్ ఆరోపించింది. దీనిపై ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదంతో అయిదు కార్లు ధ్వంసమయ్యాయి. దీనిపై ఒక వ్యక్తిని అమలాపురం టౌన్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అల్లాడుతున్న మూగజీవాలు
రంగంపేట, ఏప్రిల్ 28: మండు వేసవికి సామాన్య ప్రజలతోపాటు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద కుళాయి నుంచి చుక్క చుక్క నీరు పడుతుండగా మేకలు తమ దాహార్తిని తీర్చుకున్నాయి.

బాహుబలి ప్రీమియర్
షోకోసం వివాదం
- అయిదు వాహనాలు ధ్వంసం

అమలాపురం ఏప్రిల్ 28: ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి-2 చిత్రం ప్రిమియర్ షోకోసం మెగా ఫ్యాను, ప్రభాస్ ఫ్యాన్ మధ్య చెలరేగిన వివాదంలో అయిదు కార్లు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళితే..బహుబలి-2 చిత్రం విడుదల సందర్భంగా గురువారం రాత్రి అమలాపురంలో మల్లీప్లెక్స్ థియేటర్ వద్ద మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ అభిమానుల మధ్య వివాదం చెలరేగింది. మెగా ఫ్యాన్ ప్రిమియర్ షో వేయకుండా అడ్డుకున్నారని ప్రభాస్ ప్యాన్ ఆరోపించింది. దీనిపై ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదంతో అయిదు కార్లు ధ్వంసమయ్యాయి. దీనిపై ఒక వ్యక్తిని అమలాపురం టౌన్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
జిల్లాలో బిజెపి బలోపేతానికి చర్యలు
రాష్ట్ర బిజెవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి
కాకినాడ, ఏప్రిల్ 28: జిల్లాలో బిజెపిని బలోపేతం చేసేందుకు యువత సన్నద్ధం కావాలని రాష్ట్ర బిజెవైఎం అధ్యక్షుడు ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం బిజెవైఎం ఆధ్వర్యంలో యువతతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్ధాయిలో పార్టీలో యువత అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజా మన్ననలు పొందుతున్నారన్నారు. జిల్లాలో మండల వారీగా యువతతో బిజెపిని బలోపేతం చేయాలని సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్, బూత్‌స్ధాయిలో కమిటీలు వేయాలని నాయకత్వాన్ని సూచించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్, రాష్ట్ర నేత కర్రి చిట్టిబాబు, జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు ఆకుల శ్రీ్ధర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసు ఛేదించిన పోలీసులు
రాయవరం, ఏప్రిల్ 28: మండలంలోని పసలపూడి గ్రామానికి చెందిన వివాహిత కర్రి శ్రీదేవి (38) కృష్ణాజిల్లా కంకిపాడులో గత ఫిబ్రవరి 28న హత్యకు గురైన ఘటనను కంకిపాడు పోలీసులు ఛేదించినట్లు సమాచారం. కర్రి శ్రీనివాసరెడ్డి, అతని భార్య శ్రీదేవి, కుమారుడు సతీష్‌రెడ్డితో కలిసి గత 15 సంవత్సరాలుగా కంకిపాడులో నివాసముంటున్నారు. శ్రీనివాసరెడ్డి, సతీష్‌రెడ్డి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీదేవిని హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారం, నగదు దోచుకుపోగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం పాఠకులకు విదితమే. అయితే కంకిపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేసే సమయంలో దగ్గరి బంధువే కిరాయి రౌడీలతో హత్య చేయించినట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కంకిపాడు పోలీసులు గురువారం పసలపూడి వచ్చి హత్యకు పథకం వేసిన శ్రీనివాసరెడ్డి దగ్గర బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వ్యాపార లావాదేవీల్లో ఏర్పడిన విబేధాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. శ్రీనివాసరెడ్డి భార్యను, కుమారుడు సతీష్‌రెడ్డిని హత్య చేసేందుకు పథకం వేయగా కుమారుడు తండ్రితో బయటకు వెళ్లడంతో సతీష్‌రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడు శ్రీదేవి ఇంటికి రావడంతో వరుసకు అన్న అయినందున టీ ఇచ్చి పూజ చేసుకుంటుండగా శ్రీదేవిని వెనుకనుండి వైరుతో హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ హత్యలో దగ్గర బంధువుతో పాటు ఒక మహిళ, ఇద్దరు కిరాయి మనుషులు పాల్గొన్నట్టు తెలిసింది. శ్రీదేవి హత్య అనంతరం అంత్యక్రియల దగ్గర నుండి ఇప్పటివరకు మృతురాలి భర్త శ్రీనివాసరెడ్డితో వెన్నంటి ఉన్న సమీప బంధువే ఈ హత్యకు పథకం వేయడం కొసమెరుపు. అయితే ఈ విషయాన్ని విని శ్రీనివాసరెడ్డి బంధువులు, గ్రామస్తులు నివ్వెరపోయారు.
ఎస్సీ వర్గీకరణ పాదయాత్ర భగ్నం

అమలాపురం, ఏప్రిల్ 28 : ఎస్సీవర్గీకరణ సాధన కోసం అమలాపురం నుంచి అమరావతి వరకూ పాదయాత్ర చేయడానికి సిద్ధపడిన తెనే్నటి అశోక్‌మాదిగను అరెస్టుచేయడం అన్యాయమని దండోరానాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రను భగ్నం చేయడం అన్యాయం అని బాబూ జగ్జీవన్‌రామ్ ఎంప్లారుూస్ అసోసియేషన్ యూనియన్ ఆరోపించింది. అనాధిగా మాదిగలు రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్ధికంగా, సామాజికంగా అన్నివిధాలా నష్టపోతున్నామని మడికి సత్యనారాయణ ఆరోపించారు. మాదిగలు నష్టపోతున్నట్లు జస్టిస్ ఉషా మెహరా కమిషన్ తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం మాదిగల పట్ల చూపుతున్న నిర్లక్ష్యమేనని అసోసియేషన్ ఆరోపించింది. ఈ కార్యక్రమంలో తెనె్నటి రాజుబాబు, మడికి వసంతరావు, కె కృపా నందం, యు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.